Allu Arjun: పుష్ప సినిమాలో తన నటనతో అందరినీ ఆకట్టుకున్నాడు అల్లు అర్జున్. ఈ హీరో దేశ వ్యాప్తంగా పుష్ప సినిమా సూపర్ హిట్ కావడంతో పాన్ ఇండియా స్టార్‌గా క్రేజ్ తెచ్చుకున్నాడు. పుష్ప సీక్వెల్ ‘పుష్ప ది రూల్’ షూటింగ్లో పాల్గొనేందుకు అల్లు వారి హీరో రెడీ అవుతున్నాడు. నిజానికి బన్నీ ఇటీవలే న్యూయార్క్ లో తన వెకేషన్‌ను ఎంజాయ్ చేసి నాలుగు రోజుల క్రితమే తిరిగి హైదరాబాద్‌కి వచ్చేసాడు. న్యూయార్క్ లో ఉన్నప్పుడు ఒక హాలీవుడ్ డైరెక్టర్ తో కలిసి ఒక సూపర్ హీరో ఫిలిం చేయడానికి కూడా బన్నీ ఒప్పుకున్నాడని టాక్. హోమ్ టౌన్‌కి వచ్చేసిన ఆ తర్వాత బన్న్ట్ ఓ పబ్‌లో తన స్నేహితులతో ఓ పెద్ద పార్టీ జరుపుకున్నాడు. అయితే స్టైలిష్ స్టార్‌పై ఇప్పుడు వస్తున్న ఒక రూమర్ అందరినీ నివ్వెరపోయేలా చేస్తోంది.
ఆ ఇద్దరితో అఫైర్
నిజానికి ఈ అల్లు వారి అబ్బాయి ఎక్కువగా ఎలాంటి డేటింగ్ లేదా కాంట్రవర్షియల్ న్యూస్‌లో నిలవడు. అతని కెరీర్లో అతను ఏ హీరోయిన్‌తోనూ రిలేషన్ పెట్టుకున్నట్లు ఒక్క వార్త కూడా రాలేదు. కానీ రీసెంట్ డేస్‌లో అతని గురించి వస్తున్న పుకార్లు “అమ్మ, బాబోయ్!” అనిపిస్తున్నాయి. నిజానికి బన్నీ తన మనసుకు నచ్చిన స్నేహా రెడ్డిని పెళ్లి చేసుకున్నాడు. ఇప్పటికీ అయాన్, అర్హా ఇద్దరు పిల్లలకు తండ్రి అయి చాలా సంతోషకరమైన జీవితాన్ని గడుపుతున్నాడు. ఇలాంటి సమయంలో అతను యువ కథానాయికలు కేతిక శర్మ, ప్రియాంక ఝవాల్కర్తో ఆ పేరు పెట్టుకున్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఆ కుర్ర హీరోయిన్లు వీరే
టాక్సీవాలాతో అందరినీ టెంప్ట్ చేసింది ప్రియాంక ఝవాల్కర్. ఈ కుర్రది అల్లు అర్జున్‌పై తనకున్న ప్రేమను పబ్లిక్‌గానే చెప్పేసింది. ఆ సమయంలో అల్లు అర్జున్, ప్రియాంక ఝావాల్కర్ మధ్య ఏదో అఫైర్ కొనసాగుతుందని పుకార్లు షికారు చేశాయి. ఇప్పుడు అల్లు అర్జున్, కేతిక శర్మలపై కూడా అలాంటి రూమర్లే స్ప్రెడ్ అవుతున్నాయి.
కేతిక శర్మ చేసింది కొన్ని సినిమాలే అయినప్పటికీ, ఆమె హాట్ లుక్స్, కిల్లర్ ఎక్స్ప్రెషన్స్ ప్రేక్షకులకు నిద్రలేని రాత్రులను మిగుల్చుతున్నాయి. సోషల్ మీడియాలో తన వీడియోలతో సినిమాల్లోకి రాకముందే కేతిక క్రేజ్ తెచ్చుకుంది. కేతిక శర్మ ఇండస్ట్రీకి వచ్చి ఏడాదికి పైగానే ఉండటంతో అల్లు అర్జున్ కేతిక శర్మతో సీక్రెట్‌గా డేటింగ్ చేశాడనే పుకార్లు దావానలంలా వ్యాపిస్తున్నాయి. వీటిలో నిజం ఎంత అనేది త్వరలోనే ఆ హీరోయిన్లే చెప్పే అవకాశం.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!