న్యూస్ హెల్త్

Diabetic: బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరిగినా కష్టమే.!? తగ్గినా నష్టమే.!?

Low diabetic levels indicates this symptoms
Share

Diabetic: ఈరోజుల్లో ఎక్కువ మంది బాధపడుతున్న అనారోగ్య సమస్యలలో డయాబెటిస్ కూడా ఒకటి రక్తంలో చక్కెర స్థాయిలో పెరిగితే అది మధుమేహం అదే రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు తగ్గితే హైపో గ్లైసిమియా అంటారు.. రక్తంలో షుగర్ ఎక్కువైతే కాదు తక్కువైనా కూడా సమస్యలు ఎదురవుతాయి.. రక్తంలో చక్కెర స్థాయిలు తక్కువైనప్పుడు కొన్ని రకాల లక్షణాలు కనిపిస్తాయి..! వాటిని మనం ముందుగానే గుర్తించవచ్చు అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..! అలాగే రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గితే ఎటువంటి సమస్యలు వస్తాయో కూడా చూద్దాం..!

Low diabetic levels indicates this symptoms
Low diabetic levels indicates this symptoms

రక్తంలో షుగర్ తక్కువైతే హైపో గ్లైసిమియా అంటారు.. దీనిని గుర్తించడం చాలా తేలిక.. బ్లడ్ షుగర్ 70ఎంజి కంటే తక్కువ ఉంటే వెంటనే వైద్యుల సహాయం తీసుకోవాలి. ఇలా తక్కువగా ఉందన్న విషయాన్ని కొన్ని సంకేతాలు చెబుతాయి.. ఆకలి బాగా వేయడం, ఆందోళన , మూడ్ మారిపోవడం, ఏకాగ్రత ఉండకపోవటం వంటి సమస్యలు.. మన శరీరంలో చక్కెర స్థాయిలు తగ్గాయని సంకేతాలు ఇస్తాయి.. అలా షుగర్ లెవెల్స్ తగ్గినప్పుడు వెంటనే ఏదైనా పండ్ల రసాన్ని తీసుకోవాలి..

Low diabetic levels indicates this symptoms
Low diabetic levels indicates this symptoms

మూడ్ మారిపోవడం ఉన్నట్టుండి భావోద్వేగాల్లో మార్పులు హైపో గ్లైసిమియా లక్షణాలుగా చెప్పుకోవచ్చు. చిరాకు, డిప్రెషన్ మాదిరిగా కూడా కొన్నిసార్లు అనిపిస్తుంది.. శక్తి కోసం రక్తంలో షుగర్ విడుదల అయ్యేందుకు మెదడుకి సంకేతాలు ఇస్తుంది. గ్లూకోస్ తగ్గిపోయినప్పుడు మెదడు సరిగ్గా పనిచేయదు. దాంతో దేని మీద ఏకాగ్రత చూపించడం కష్టమవుతుంది. కొన్నిసార్లు మాటల్లో కూడా తడబాటు ఏర్పడుతుంది. 40 ఎంజి/డిఎల్ కు షుగర్ పారిపోయినప్పుడు ఈ పరిస్థితి ఏర్పడుతుంది.. అందుకే డయాబెటిక్ లెవెల్స్ ను ఎప్పటికప్పుడు నియంత్రణలో ఉంచుకునే ప్రయత్నం చేయాలి. షుగర్ లెవెల్స్ ఎక్కువైనా ప్రమాదమే.. తక్కువ అయినా ప్రమాదమే.. అందువలన డయాబెటిస్ తో బాధపడుతున్న వారు ఇలాంటి లక్షణాలతో బాధపడుతుంటే.. ముందుగానే గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది..


Share

Related posts

YS Jagan: జ‌గ‌న్ స‌ర్కారు సంచ‌ల‌న నిర్ణ‌యం…క‌రోనా స‌మ‌యంలో డేరింగ్‌ నిర్ణ‌యం

sridhar

కేసీఆర్… జ‌గ‌న్‌.. ఓ ఆర్నేళ్ల ట్విస్టుకు నేడే శుభం?

sridhar

Dhanush-aishwarya: విడిపోవడంపై స్పందించిన ఐశ్వర్య ధనుష్.. ప్రేమ కేవలం ఒక మనిషికి సంబంధించినది కాదంటూ హితబోధ!

Ram