NewsOrbit
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

BJP: నేడు ఖమ్మంలో ‘రైతు గోస – బీజేపీ భరోసా’ సభ .. అమిత్ షా సమక్షంలో జరిగే చేరికలపై ఉత్కంఠ

BJP: తెలంగాణలో ఎన్నికల సందడి మొదలైంది. ప్రధాన రాజకీయ పక్షాలు అన్నీ ఎన్నికల్లో గెలిచేందుకు అస్త్రశస్త్రాలను సిద్దం చేసుకుంటున్నాయి. అధికార బీఆర్ఎస్ తమ అభ్యర్ధులను ఇప్పటికే ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధుల ఎంపికపై కసరత్తు ప్రారంభించింది. ఈ క్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల నుండి దరఖాస్తులను స్వీకరించింది. స్వయంగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా ధరఖాస్తు చేసుకోవడంతో అన్ని నియోజకవర్గాల నుండి సీనియర్లు, ఆశావహులు ధరఖాస్తులు చేసుకున్నారు. అన్ని రాజకీయ పార్టీలు తమ బలం నిరూపించుకునేందుకు ఎక్కిడికక్కడ భారీగా బహిరంగ సభలు నిర్వహిస్తూ జనాలను ఆకర్షించే పనిలో ఉన్నాయి. చేరికలపైనా దృష్టి సారించాయి.

Amit shah

 

బీఆర్ఎస్ ఇప్పటికే అనేక బహిరంగ సభలు నిర్వహించింది. ఇక కాంగ్రెస్ కూడా కొద్ది రోజుల క్రితమే ఖమ్మంలో భారీ బహిరంగ సభ నిర్వహించింది. ఆ సభలోనే ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డిని పార్టీలో చేర్చుకుంది. ఆ తర్వాత మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు తదితరులు ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్ పెద్దల సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ ఘన విజయం సాధించిన తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ జోష్ మీద ఉంది. గతంలో బీజేపీలో చేరాలని యోచించిన నాయకులు సైతం కాంగ్రెస్ వైపు టర్న్ అయ్యారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు బీజేపీ స్పీడ్ పెంచింది. ఈ రోజు ఖమ్మంలో బీజేపీ బహిరంగ సభ నిర్వహిస్తొంది. రైతు గోస – బీజేపీ భరోసా పేరుతో నిర్వహించనున్న ఈ సభలో ముఖ్య అతిధిగా బీజేపీ అగ్రనేత, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా పాల్గొని ఎన్నికల శంఖారావం పూరించనున్నారు.

ఢిల్లీ నుండి ప్రత్యేక విమానంలో విజయవాడ చేరుకోనున్న అమిత్ షా .. అక్కడి నుండి హెలికాఫ్టర్ లో ఖమ్మం సర్దార్ పటేల్ మైదానంలో దిగుతారు. తర్వాత ఎస్ ఆర్ అండ్ బీజీఆర్ డిగ్రీ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన సభ ప్రాంగణంలో రాష్ట్ర బీజేపీ కోర్ కమిటీ సమావేశంలో పాల్గొని వచ్చే ఎన్నికల కార్యాచరణ, అభ్యర్ధుల ఎంపికపై ముఖ్య నేతలకు దిశానిర్దేశం చేస్తారు. దాదాపు 20 మంది వరకు ముఖ్య నేతలు ఈ భేటీలో పాల్గొననున్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ కు ధీటుగా ముందుకెళ్లేలా .. పార్టీ నేతలకు కీలకమైన సూచనలు చేసే అవకాశం ఉంది. అనంతరం నిర్వహించే బహిరంగ సభలో అమిత్ షా పాల్గొని ప్రసంగిస్తారు. ప్రస్తుత జాతీయ, రాష్ట్ర స్థాయి రాజకీయాల నేపథ్యంలో అమిత్ షా ప్రసంగంపై సర్వత్రా అసక్తి నెలకొంది.

bjp

బీఆర్ఎస్ – బీజేపీ మధ్య లోపాయికారీ ఒప్పందం కుదిరిందన్న కాంగ్రెస్ విమర్శలను తిప్పికొట్టేలా ప్రసంగం సాగే అవకాశం ఉంది. తొలి సారి అమిత్ షా ఖమ్మం వస్తుండటంతో బహిరంగ సభ విజయవంతానికి బీజేపీ నేతలు విస్తృత ఏర్పాట్లు చేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీజేపీకి అంతగా పట్టు లేకపోవడంతో ఈ ఉమ్మడి జిల్లాను బీజేపీ కంచుకోటగా మార్చుకునేందుకు బీజేపీ నేతలు దృష్టి సారించారు. బలమైన నాయకులను పార్టీలో చేర్చుకునేందుకు వ్యూహరచన చేశారు. చాలా రోజులుగా బీజేపీలో చేరేందుకు కీలక నేతలే ప్రయత్నాలు చేస్తున్న క్రమంలో ఈ రోజు అమిత్ షా సభలో భారీగా చేరికలు ఉండబోతున్నట్లు బీజేపీ వర్గాలు పేర్కొంటున్నాయి.  ప్రధానంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ లకు చెందిన కీలక నేతలు 22 మంది బీజేపీలో చేరే అవకాశం ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఆ నాయకులు ఎవరు అనేది మాత్రం నేతలు గోప్యంగా ఉంచారు. దీంతో బీజేపీలో చేరే కీలక నాయకులు ఎవరు అనే ఉత్కంఠ కొనసాగుతోంది.

ఇక ఈ రోజు బహిరంగ సభకు సంబంధించి భారీ ఏర్పాట్లు చేశారు. సభా ప్రాంగణంలో వర్షం వచ్చినా ఎటువంటి ఇబ్బంది లేకుండా జర్మన్ సాంకేతిక పరిజ్ఞానంతో సభ స్థలిని తీర్దిదిద్దారు. పది అసెంబ్లీ నియోజకవర్గాల నుండి జన సమీకరణకు ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు వాహనాల్లో తరలిస్తున్నారు. బీజేపీ ఫ్లెక్సీలు, హోర్డింగ్స్ పాటు నేతల కటౌట్లతో ఖమ్మం కాషాయమయంగా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా తరలివచ్చే ముఖ్య నేతలు, మహిళల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.  అమిత్ షా ముందు షెడ్యుల్ ప్రకారం భద్రాచలం శ్రీరాముల వారి దర్శన కార్యక్రమం ఉండగా, సమయాభావం వల్ల భద్రాచలం పర్యటన రద్దు అయ్యింది. ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుండి గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకోనున్న అమిత్ షా .. అక్కడ నుండి హెలికాఫ్టర్ లో నేరుగా ఖమ్మంకు 3.45 గంటలకు చేరుకుంటారు. కోర్ కమిటీ భేటీ, బహిరంగ సభ అనంతరం హెలికాఫ్టర్ లో బయలుదేరి గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు.

డ్రగ్స్ కేసులో సైబర్ క్రైం ఎస్ఐ రాజేందర్ అరెస్టు

Related posts

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju

Ravi Teja: ర‌వితేజ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేసిన నాగార్జున బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఏదో తెలుసా?

kavya N

Rajinikanth: వెండితెర‌పై ర‌జ‌నీకాంత్ బ‌యోపిక్‌.. సూప‌ర్ స్టార్ గా న‌టించే హీరో ఎవ‌రంటే..?

kavya N

Anil Ravipudi-Rajamouli: అనిల్ రావిపూడిని ముసుగేసి కొడ‌తే రూ. 10 వేలు ఇస్తానంటూ రాజ‌మౌళి ప్ర‌క‌ట‌న‌.. అంత కోపం ఎందుకొచ్చింది?

kavya N

BRS MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

sharma somaraju