ట్రెండింగ్ న్యూస్

Cash: ఛీ.. నా వల్ల ఇలా తయారయ్యావా? యాంకర్ రవికి సుమ వార్నింగ్?

anchor ravi teases anchor suma in cash program
Share

యాంకర్ రవి అంటేనే ఎంటర్ టైన్ మెంట్ కు కేరాఫ్ అడ్రస్. తోటి యాంకర్లు, ఇతర కమెడియన్, ఇతర కంటెస్టెంట్లు.. ఎవ్వరు ఏమన్నా.. దులిపేసుకుంటాడు తప్పితే.. ఎవ్వరితో పెద్దగా వైరం పెంచుకోడు యాంకర్ రవి. ఆయన కామెడీ టైమింగ్ కూడా బాగుంటుంది. అందుకే ప్రస్తుతం తెలుగు బుల్లితెరను ఏలుతున్నాడు యాంకర్ రవి.

anchor ravi teases anchor suma in cash program
anchor ravi teases anchor suma in cash program

మరోవైపు యాంకర్ సుమ.. ఈమె గురించి అస్సలు ఏం చెప్పాల్సిన అవసరమే లేదు.ఆమె దశాబ్దాల నుంచి తెలుగు బుల్లితెరను ఏలేస్తుంది. నిజం చెప్పాలంటే చాలామంది తనను చూసి యాంకర్లు అయ్యారు. తన యాంకరింగ్ ను చూసి నేర్చుకున్నారు.

మన యాంకర్ రవి కూడా అదే చెప్పాడు. తాజాగా విడుదలైన క్యాష్ ప్రోగ్రామ్ ప్రోమోలో యాంకర్ రవి, వర్షిణీ, భానుశ్రీ, కెవ్వు కార్తీక్ తల్లులు వచ్చారు. వాళ్లతో క్యాష్ ప్రోగ్రామ్ ను నిర్వహించారు.

అయితే.. అందరూ వాళ్ల తల్లులకు పాయసం తినిపిస్తారు. యాంకర్ రవి.. తన తల్లికి తినిపించిన అనంతరం.. వెంటనే తనకు యాంకరింగ్ నేర్పించిన తల్లికి అంటూ యాంకర్ సుమకు కూడా పాయసం తినిపించబోతాడు. దీంతో యాంకర్ సుమ వద్దు అంటూ వారిస్తుంది. నేను నీకు యాంకరింగ్ నేర్పించలేదు.. అంటుంది. దీంతో రవి.. ఇదంతా మీరు పెట్టిన బిక్షే.. అంటాడు. ఛీ.. నా వల్ల ఇట్లా తయారయ్యావా? అంటూ కొంచెం వార్నింగ్ ఇచ్చినట్టు మాట్లాడుతుంది సుమ. దీంతో ఆ సీన్ అక్కడితో కట్ అయిపోతుంది.

మొత్తానికి వచ్చే వారానికి సంబంధించిన క్యాష్ ప్రోగ్రామ్.. తెలుగు ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది. దానికి సంబంధించిన ప్రోమోను చూసేయండి మరి..


Share

Related posts

CM KCR: ప్రతిపక్షాలకు సీఎం కేసిఆర్ ఇచ్చిన కౌంటర్ మామూలుగా లేదుగా..

somaraju sharma

Sushmita Sen: ఆక్సిజన్ సిలిండర్స్ పంపిస్తానాన్న సుస్మితాసేన్.. నెటిజన్ ట్రోల్స్ కు స్ట్రాంగ్ కౌంటర్..

bharani jella

ప్రకాష్ రాజ్- పవన్ వివాదంలో సరికొత్త ఎంట్రీ ఇచ్చిన పూనమ్ కౌర్..!!

sekhar
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar