NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ లో మరో సంక్షేమ పథకానికి మంగళం?ఎల్ఐసి బయటపెట్టిన నిప్పులాంటి నిజం!!

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ లో మరో సంక్షేమ పథకం అటకెక్కే సూచనలు గోచరిస్తున్నాయి.ఎల్ఐసి పత్రికాముఖంగా విడుదల చేసిన ఒక ప్రకటన కారణంగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. 2009 లో డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశ పెట్టిన అభయహస్తం పథకం అయన కుమారుడు జగన్ ముఖ్యమంత్రిగా వుండగా ఆగిపోయే పరిస్థితులు తలెత్తాయి.

another welfare scheme will be stopped in Andhra Pradesh?
another welfare scheme will be stopped in Andhra Pradesh

స్వయం సహాయక గ్రూపుల సభ్యులైన మహిళలకు వారి వృద్ధాప్యంలో పింఛను ఇచ్చే అభయహస్తం పథకానికి రూపకల్పన చేశారు.వయసును బట్టి కనీసం ఐదు వందల నుండి రెండువేల రెండువందల రూపాయల వరకు నెలవారీ పింఛన్ వారికి లభించేటట్లు ఈ పథకాన్ని రూపొందించారు.2009 నుండి ఈ పథకం రాష్ట్రంలో అమల్లో ఉంది.చివరకు ఇది టీడీపీ ప్రభుత్వ హయాంలో కూడా కొనసాగింది.జగన్ సీఎం అయ్యాక రెండేళ్లు ఈ పథకాన్ని కొనసాగించారు.అయితే వచ్చే నెల నుండి ఈ పథకం అమలు కాకపోవచ్చుననే సందేహాన్ని రేకెత్తించేలా ఎల్ఐసీ ఒక ప్రకటన విడుదల చేసింది.

Andhra Pradesh: అభయహస్తం పథకం అమలు ఇలా!

అభయహస్తం పథకం కింద వృద్దాప్యంలో పింఛన్ పొందేందుకు వీలుగా స్వయం సహాయక గ్రూపులు సభ్యురాలైన సభ్యులైన మహిళలు సంవత్సరానికి మూడు 365రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది.పధ్ధెనిమిది నుండి యాభై అయిదు సంవత్సరాల వయసు ఉన్న మహిళలు ఈ పథకంలో చేరడానికి అర్హులు.ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ప్రతి సభ్యురాలు పైనా అంతే మొత్తాన్ని జమ చేస్తుంది.ఈ మొత్తాలపై వచ్చే వడ్డీని, అసలు మొత్తాన్ని క్రోడీకరించి సభ్యురాలికి 60 సంవత్సరాలు వచ్చినప్పట్నుంచి నెలకు కనీసం అయిదువందల రూపాయలు పింఛన్ ప్రభుత్వం అందజేస్తోంది.చిన్న వయసు ఈ పథకంలో డబ్బు జమ చేస్తూ పోతే పింఛన్ రెండువేల రెండు వందల రూపాయలు వరకు వచ్చే అవకాశం ఉంటుంది.

Andhra Pradesh: ఎల్ఐసీతో ఒప్పందం

ఈ పథకానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎల్ఐసీతో ఒప్పందం చేసుకుంది.సభ్యుల ప్రీమియం, ప్రభుత్వం జమ చేసే మొత్తాలను ఎల్ఐసీలో ఉంచి అర్హులైన మహిళలకు ఇప్పటి వరకు పింఛన్ అందజేస్తూ వస్తున్నారు.ఎల్ఐసీలో ఈ నిధి కింద దాదాపు రెండువేల కోట్ల రూపాయలు ఉన్నట్లు సమాచారం.

ఇప్పుడేమి జరిగిందంటే?

కాగా అభయహస్తం పథకానికి సంబంధించి తమతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రద్దు చేసుకుని నిధి రూపంలో ఉన్న నగదు మొత్తాన్ని మొత్తం వెనక్కు తీసుకుందని ఎల్ఐసీ ఈనెల 27 వ తేదీన ప్రముఖ దినపత్రికల్లో ప్రకటన ఇచ్చింది.ఇక ఈ పథకంతో తమకు సంబంధమే లేదని ఎటువంటి క్లెయిములు స్వీకరించేది, నగదు చెల్లించేది ఉండబోదని ఎల్ఐసి స్పష్టం చేసింది.ఇకపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పేదరిక నిర్మూలన సంస్థ ఈ పథకానికి బాధ్యత వహిస్తుందని వెల్లడించింది.ఇది ఓ రకంగా బాంబులాంటి వార్త .ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చివరకు ఈ నిధి కింద ఉన్న వేల కోట్ల రూపాయలు కూడా తీసేసుకున్నట్లు అర్థమవుతోంది.మరి అభయహస్తం పథకం అమలవుతుందా లేదా అన్నది కాలమే నిర్ణయిస్తుంది.

 

author avatar
Yandamuri

Related posts

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N