NewsOrbit
న్యూస్

‘ఆయన చెప్పేవన్నీ అబద్దాలే’

అమరావతి: టిడిపి అధినేత చంద్రబాబు పచ్చి అబద్దాలతో ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఆరోపించారు. వరదలపై చంద్రబాబు శుక్రవారం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా చెప్పిన విషయాలను ఆయన తీవ్రంగా ఖండించారు. శనివారం మంత్రి అనిల్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు బురద రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. ఆయన చెప్పినట్లు వరద నీటిని వదిలి ఉంటే  నేడు డ్యామ్‌ల్లో నీరు ఉండేది కాదని అనిల్ కుమార్ అన్నారు.

అధికార యంత్రాంగం సమర్థవంతంగా పని చేయడం వల్లనే ఆస్తి, ప్రాణనష్టం సంభవించలేదని అనిల్ కుమార్ పేర్కొన్నారు. నది ఒడ్డున ఇల్లు కట్టుకుంటే ఇల్లు మునగక ఏమవుతుందని అనిల్ కుమార్ ప్రశ్నించారు. నీటి విడుదలపై చంద్రబాబు, టిడిపి నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారనీ, ఈ నెల మూడవ తేదీ నుండి ప్రాజెక్టుల నీటి లెక్కలన్నీ పక్కాగా ఉన్నాయని అనిల్ కుమార్ స్పష్టం చేశారు. శ్రీశైలం ప్రాజెక్టు నిండిన తర్వాతే పోతిరెడ్డిపాడు నుండి నీళ్లు రాయలసీమకు తరలించగలమని అనిల్ అన్నారు. వచ్చిన నీరు వచ్చినట్లు దిగువకు వదిలేస్తే రాయలసీమకు నీరు ఎలా ఇవ్వగలమని అనిల్ కుమార్ ప్రశ్నించారు. ఈ నెల తొమ్మిదిన శ్రీశైలం గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల చేశామని అనిల్ కుమార్ చెప్పారు. పులిచింతల నీరు రాకముందే ప్రకాశం బ్యారేజి నుండి నీటిని విడుదల చేశామని అనిల్ కుమార్ తెలిపారు. సామర్థ్యం మేరకే ప్రాజెక్టుల్లో నీరు నిల్వ చేస్తారని అనిల్ కుమార్ పేర్కొన్నారు.

author avatar
sharma somaraju Content Editor

Related posts

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

Leave a Comment