చదలవాడ శ్రీనివాసరావు పేరు వినగానే మనకు చటుక్కున గుర్తుకు వచ్చే సినిమా ‘బిచ్చగాడు’. ఈ సినిమా తర్వాత ఈయన తన బ్యానర్ శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలిమ్స్ బ్యానర్‌పై డి 16, హెడ్ కానిస్టేబుల్ వెంకట్రామయ్య, కర్తకర్మక్రియ చిత్రాలను రూపొందించారు. చదలవాడ శ్రీనివాసరావు తనయుడు లక్ష్మణ్ హీరోగా పరిచయం అవుతూ ఇదే బ్యానర్లో సినిమా రూపొందనుంది. హిప్పీ ఫేమ్ దిగంగన సూర్యవంశీ హీరోయిన్గా పరిచయం అవుతుంది. అయితే ఇక్కడ ప్రస్తావించాల్సిన విషయమేమంటే.. చదలవాడ లక్ష్మణ్ కెరీర్ ప్రారంభంలో హీరోగా రాణించాలనుకున్నారు. ఒకట్రెండు సినిమాలు కూడా చేశారు. అయితే అవేవీ హిట్ కాకపోవడంతో లక్ష్మణ్ అలియాస్ లక్ష్ కామ్‌గా ఉండిపోయాడు. తాజాగా.. మరోసారి లక్ష్ హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించాలనుకుంటున్నాడు. మరి ఈసారి ఏమవుతుందో చూడాలి.
శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలింస్ బ్యానర్ ప్రొడక్షన్ నెం. 10 శనివారం లాంఛనంగా ప్రారంభమైంది. లక్ష్, దిగంగన సూర్యవంశీ హీరో హీరోయిన్గా నటిస్తున్నారు. రమేశ్ కడుముల దర్శకత్వం వహిస్తున్నారు. శేఖర్ చంద్ర సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి రామకృష్ణ సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు. రవిప్రకాశ్, రవి వర్మ, నోయెల్ సేన్, చిత్రం శ్రీను తదితరులు నటిస్తోన్న ఈ చిత్రాన్ని పద్మావతి చదలవాడ నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుంది.
previous post
next post
Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!