APY Scheme: ఇక్కడ దాదాపు అందరివీ మధ్య తరగతి కుటుంబాలే. భవిష్యత్ కోసం కస్టపడి సంపాదించిన డబ్బుని రకరకాల రూపాలలో మనం పొదుపు చేస్తూ ఉంటాం. కొందరు సవ్య దిశలో పొదుపు చేసుకుంటారు. ఇంకొందరు అపసవ్య దిశలో పొదుపు చేయడం మనం చూస్తూ ఉంటాం. అంటే సరియైన రీతిలో చేయకపోవడం అన్నమాట. అంతగా నాలెజ్డ్ లేనివాళ్లు ఎక్కడెక్కడో పొదుపు చేసి మోసపోతూ వుంటారు. అలాంటి స్కీములు ఎన్నింటినో మనం చూసాం, చూస్తున్నాం. ముఖ్యంగా అలాంటివారి కోసమే ప్రభుత్వాలు అప్పుడప్పుడు కొన్ని కొత్త స్కీములు ప్రవేశపెడతాయి. అలాంటివాటి కోసం మనం తప్పనిసరిగా తెలుసుకోవాలి.
భారత కేంద్ర ప్రభుత్వం చేపట్టిన స్కీమ్ వివరాలు:
కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పథకాలలో APY (అటల్ పెన్షన్ యోజన) అనే స్కీమ్ గురించి విన్నారా? స్వయాన కేంద్ర ప్రభుత్వమే ఈ పథకాన్ని నిర్వహిస్తోంది. అందువల్ల మీరు పెట్టే డబ్బులకు ఎలాంటి ఇబ్బందీ లేదు. పైగా బోలెడంత భరోసా కూడాను. PFRDA (పెన్షన్ ఫండ్ రెగ్యులేటర్) ఈ స్కీమ్ బాధ్యతలు మొత్తం చూసుకుంటుంది. ఇంకెందుకాలస్యం.. మీరు కూడా ఈ స్కీమ్ లో చేరి పదవీ విరమణ అనంతరం సంతోషంగా జీవించండి.
APY (అటల్ పెన్షన్ యోజన) స్కీమ్ వివరాలు:
18 ఏళ్ల నుంచి 40 ఏళ్ల మధ్య వయసు కలిగిన వారు దీనికి అర్హులు. కేవలం ఒకే ఒక బ్యాంక్ అకౌంట్ ఉంటే సరిపోతుంది. దీనిలో చేరిన వారికి 60 ఏళ్ల నుంచి పెన్షన్ వస్తుంది. కనీసం 20 ఏళ్లు డబ్బులు ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. 18 ఏళ్ల వయసులో ఉన్న వారు రూ.1000 పెన్షన్ కోసం నెలకు రూ.42 చెల్లించాలి. అలాగే రూ.2 వేల కోసం రూ.84, రూ.3 వేల కోసం రూ.126, రూ.4 వేల కోసం రూ.168, రూ.5 వేల కోసం రూ.210 కట్టవలసి ఉంటుంది. అదే 40 ఏళ్ల వయసు మీకు ఉంటే రూ.1000 కోసం నెలకు రూ.291 చెల్లించాల్సి ఉంటుంది.