చిన్నవయసులోనే యాంకర్ గా కెరీర్ ప్రారంభించిన అరియానా గ్లోరీ అతి తక్కువ సమయంలోనే బిగ్బాస్ ద్వారా ఎక్కడలేని క్రేజ్ సంపాదించింది. చక్కటి రూపం, తనదైన శైలిలో హావభావాలు…. వీటికి తోడు కొంచెం పెంకితనం, దూకుడు స్వభావం ఆమెను ప్రేక్షకులకు మరింత దగ్గర చేసింది. ప్రస్తుతం బిగ్ బాస్ లో టాప్ కంటెస్టెంట్ గా బయటకు వచ్చిన అరియానా వరుఅస్ ఆఫర్లతో దూసుకుపోతుంది. ఈ నేపథ్యంలో ఆమె పెళ్లి గురించి తనకు కాబోయే వాడి గురించి కొన్ని సీక్రెట్స్ లీక్ చేసింది.
వాస్తవానికి అరియానా ఇంటిలోకి వచ్చినప్పుడు ఆమెపై పెద్దగా అంచనాలు లేవు. వచ్చీరాగానే అందరితో గొడవలు పెట్టుకున్న ఆమెను చూసి మూడు నాలుగు వారాలకు వెళ్ళిపోతుందని అనుకున్నారు. కానీ ఆ తర్వాత చాలా బ్యాలెన్స్డ్ గా ఆలోచిస్తూ అందరినీ ఆకట్టుకుంది. వరుస ఇంటర్వ్యూలతో బిజీగా గడుపుతున్న ఆమె ఒక ఏడాదిన్నర పెళ్లి చేసుకుంటానని చెప్పింది.
ఒక ఎన్నారై సంబంధం వచ్చింది అని ….ఇంకా చర్చల దశలోనే ఉంది అని చెప్పడం అరియానా ఫ్యాన్స్ కు కొంచెం బాధించే విషయమే. అలాగే అమెరికాలో ఉండే మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ నన్ను పెళ్లి చేసుకుంటా అన్నాడు…. అది అందరికీ తెలుసు. కానీ కెరీర్ కోసం దానిని హోల్డ్ లో పెట్టాను… ఒకవేళ ఇదే ఓకే అవ్వచ్చు అని కూడా ఆమె చెప్పింది. ఇప్పుడు సమయం వచ్చింది కాబట్టి బయట పెడుతున్నట్లు తెలిపింది. ఇక తనకు పుట్టే పిల్లలు కూడా ముగ్గురు కావాలని… వారిలో ఇద్దరు కవలలు ఉండాలని అరియానా ఆశిస్తున్నట్లు తెలిపింది
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!