సీజన్ ఫోర్ బిగ్ బాస్ హౌస్ లో గ్లామర్ గా చాలా మందిని ఆకట్టుకున్న కంటెస్టెంట్ మోనాల్. గుజరాత్ రాష్ట్రానికి చెందిన ఈ ముద్దుగుమ్మ హౌస్ లోకి వచ్చిన ప్రారంభంలో భాషతో కొద్దిగా ఇబ్బందులు ఎదుర్కొన్నా గాని తర్వాత మెల్లమెల్లగా సెట్ అయిపోయింది. కాని ప్రారంభంలో ప్రతిసారి ఏడుస్తూ అలుగుతూ ఈమె ఆడిన గేమ్ చాలామంది కి ఆమెపై నెగిటివిటీ ని పెంచే రీతిలో చేసింది.
ఇదే టైమ్ లో కంటెస్టెంట్ అఖిల్, అభి తో క్లోజ్ అయినా ఈ గుజరాతి అమ్మడు ఇద్దరి తో ట్రయాంగిల్ లవ్ స్టోరీ అన్న తరహాలో హౌస్ లో సీన్లు క్రియేట్ చేయడం జరిగింది. కానీ మధ్యలో ఇంటిలిజెంట్ అభి డ్రాప్ కావటంతో .. మోనాల్ వన్ సైడ్ అన్నట్టు అఖిల్ తో క్లోజ్ అవ్వడం జరిగింది. ఇదిలా ఉంటే రోజులు ఉన్న కొద్ది గడిచే క్రమంలో బిగ్ బాస్ ఫైనల్ కి వచ్చేసరికి చివరాఖరి లో మంచి గేమ్ ఆడటం తో మోనాల్ ఓటింగ్ టాప్ కంటెస్టెంట్ లకు సైతం మంచి పోటీ ఇచ్చింది.
ముఖ్యంగా హారికా నీ కెప్టెన్ చేయడంలో అదేవిధంగా ఒకసారి ఎలిమినేషన్ సమయంలో అఖిల్ తో వాదించటం లో మోనాల్ తన గేమ్ స్ట్రాటజీతో చాలా మందిని ఆకట్టుకుంది. కానీ సరిగ్గా టాప్ పైకి వెళ్లకముందు ఇంటి నుండి ఎలిమినేట్ కావడంతో చాలామంది నిరాశ చెందారు. ఇదిలా ఉంటే బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లిన తర్వాత మంచి క్రేజ్ క్రియేట్ చేసుకున్న మోనాల్ ప్రస్తుతం టెలివిజన్ రంగంలో ఒక డ్యాన్స్ షోకి జడ్జి గా వ్యవహరిస్తూ తాజాగా ఓ కుర్రహీరో సినిమా లో ఐటెం సాంగ్ చేయటానికి రెడీ అయింది. మేటర్ లోకి వెళ్తే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా తెరకెక్కుతున్న అల్లుడు అదుర్స్ సినిమాలో ఐటెం సాంగ్ చేయటానికి మోనాల్ రెడీ అయ్యి ఏకంగా ఒక సాంగ్ కోసం 15 లక్షలు రెమ్యూనరేషన్ ఈ గుజరాతి ముద్దుగుమ్మ తీసుకుంటున్నట్లు ఇండస్ట్రీ లో టాక్ నడుస్తుంది. కేవలం మూడే మూడు నిమిషాల పాటు ఉండే ఈ సాంగ్ కి మోనాల్ ఈ స్థాయిలో డబ్బులు డిమాండ్ చేయడం పెద్ద చర్చనీయాంశంగా మారినట్లు వార్తలు ఇండస్ట్రీలో వినబడుతున్నాయి.