ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

కుప్పంలో మాజీ ఎమ్మెల్సీ సహా పలువురు టీడీపీ నేతలపై హత్యాయత్నం కేసు

Share

కుప్పం నియోజకవర్గ పరిధిలోని రామకుప్పం మండల పోలీస్ స్టేషన్ లో పలువురు టీడీపీ నేతలపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. వైసీపీ కార్యకర్త గణేష్ ఫిర్యాదు మేరకు మాజీ ఎమ్మెల్సీ గౌరివాని శ్రీనివాసులు సహా ఎనిమిది మందిపై ఐపీసీ 143, 147, 148, 149, 424, సెక్షన్ ల కింద కేసు నమోదు చేశారు. మరో 11 మందిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు.

 

టీడీపీ అధినేత చంద్రబాబు నిన్న రామకుప్పం మండలంలో పర్యటించారు. కొల్లుపల్లిలో చంద్రబాబు పర్యటించే మార్గంలో టీడీపీ శ్రేణులు స్వాగత తోరణాలు ఏర్పాటు చేశారు. అదే ప్రాంతంలో వైసీపీ శ్రేణులు ఏర్పాటు చేసిన తోరణాలను టీడీపీ శ్రేణులు తొలగించే ప్రయత్నం చేయడంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. పరస్పరం రాళ్లు, కర్రలతో దాడులు చేసుకున్నారు. ఈ ఘర్షణలో ఇరువర్గాలలోని కొందరు గాయపడ్డారు. వైసీపీ కార్యకర్త ఫిర్యాదు మేరకు టీడీపీ నేతలపై కేసులు నమోదు అయ్యాయి.

కుప్పంలో తీవ్ర ఉద్రిక్తత .. రోడ్డుపై భైటాయించిన చంద్రబాబు ..డీజీపీ ఆఫీసు వద్ద టీడీపీ నేతల ధర్నా


Share

Related posts

Huge compensation : రసాయన పరిశ్రమ ప్రమాద బాధిత కుటుంబాలకు భారీగా పరిహారం

somaraju sharma

ఎపి అసెంబ్లీలో సవరణలతో మళ్లీ దిశ బిల్లు

somaraju sharma

అలా అయితే లెక్కింపు కష్టం

sarath