Balakrishna : బాలకృష్ణ Balakrishna బీబీ3 కంటే రవితేజ ఖిలాడి మీదే అందరి అంచనాలు ఉన్నాయని ఇప్పుడు ఫిల్మ్ నగర్ లో చర్చించుకుంటున్నారు. అభిమానుల మధ్య కూడా ఇదే చర్చ సాగుతుందని సమాచారం. ఎవరికి వారు మా హీరో సినిమానే బ్లాక్ బస్టర్ అన్న మాట చెప్పుకుంటున్నారట. అందుకు కారణం రవితేజ – బాలకృష్ణ నటించీ సినిమాలు మే 28 రిలీజ్ కాబోతుండటమే. సహజంగా ఇద్దరి స్టార్ హీరోల సినిమాలు ఒకేసారి బాక్సాఫీస్ వద్ద పోటీ పడితే అభిమానులే కాదు ఇండస్ట్రీ వర్గాలలోను ఆసక్తికరమైన చర్చలు సాగుతుంటాయి.
ఇద్దరి హీరోల గత సినిమాల రికార్డ్స్ గురుంచి మాట్లాడుకుంటూ ఆ సినిమా వసూళ్ళని పోల్చుకుంటూ రెండు సినిమాల మధ్య హెచ్చు తగ్గుల ని బేరీజు వేసి విశ్లేషకులు మాట్లాడుకుంటుంటారు. ఇప్పుడు అదే బాలయ్య బీబీ3.. రవితేజ ఖిలాడ్ సినిమాల గురించి జరుగుతోందట. రీసెంట్ గా క్రాక్ సినిమాతో అద్భుతమైన హిట్ అందుకొని మాస్ మహారాజ రవితేజ సక్సస్ ట్రాక్ లోకి వచ్చాడు. అదే ఊపుతో డ్యూయల్ రోల్ లో తెరకెక్కుతున్న లేటెస్ట్ సినిమా ‘ఖిలాడి’ లో నటిస్తున్నాడు రవితేజ. యంగ్ డైరెక్టర్ రమేష్ వర్మ దర్శకత్వంలో రవితేజ ఖిలాడి తెరకెక్కుతోంది.
Balakrishna : బాలయ్య – బోయపాటి శ్రీను కి హిట్ లేకపోవడం తో రవితేజ ఖిలాడి మీదే అంచనాలు ..!
ఇక ఖిలాడి సినిమాని పెన్ స్టూడియోస్ అధినేత జయంతి లాల్ గడ సమర్పణలో హవీష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై సత్యనారాయణ కోనేరు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. మీనాక్షి చౌధరి, డింపుల్ హయతి హీరోయిన్లుగా ఈ సినిమాలో నటిస్తున్నారు. అలాగే బాలకృష్ణ – మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరకెక్కుతున్న బీబీ3 కూడా అదే రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. ఒకరకంగా ఇది గట్టి పోటీ అని చెప్పాలి. అయితే గత కొంత కాలంగా బాలయ్యకి గాని .. బోయపాటి శ్రీను కి గాని హిట్ లేకపోవడం తో ఎక్కువగా రవితేజ ఖిలాడి మీదే అంచనాలు ఉన్నాయి. కాని సీన్ రివర్స్ అయ్యే ఛాన్స్ కూడా ఉందని బాలయ్య – బోయపాటి ల బీబీ 3 సిన్హ, లెజెండ్ సినిమాల మాదిరిగా భారీ హిట్ ఖాయమని అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!