NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Pawan kalyan : విశాఖ ఉక్కు పరిశ్రమ విషయంలో పవన్ చెబితే మోడీ ఆగుతారా?

Pawan kalyan : విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటు పరం చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఆ దిశగా అడుగులు వేస్తుంది. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అన్న నినాదంతో మొదలై 32 మంది బలిదానాలు, వందలాది మంది నిర్భందాలు, లక్షలాది మంది ఆందోళనలు త్యాగాల ఫలితంగా విశాఖ ఉక్కు కర్మాగారం ఆవిర్భవించింది. 22 వేల ఎకరాలలో విస్తరించి 17వేల మంది పర్మినెంట్, 16వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగులతో పాటు సుమారు లక్ష మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పిస్తోంది ఈ కర్మాగారం. యాజమాన్య హక్కులను పూర్తిగా వదులుకోవడానికి కేంద్రం సిద్ధపడటం పట్ల రాజకీయ పక్షాలు, ఉద్యోగులు, కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Pawan kalyan : Will Modi respond to Pawan's request? విశాఖ ఉక్కు
Pawan kalyan Will Modi respond to Pawans request విశాఖ ఉక్కు

Pawan kalyan : ఎవరు ఆందోళన చేసినా ఆగదు

విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంపై బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి స్పందించారు. స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేయడాన్ని ఆయన సమర్థించారు. హైదరాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ విశాఖ స్టీల్ ప్లాంట్ లో పెట్టుబడులు పెంచేందుకే విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రవేటీకరణ చేస్తున్నారని అన్నారు. స్టీల్ ప్లాంట్ పై ప్రభుత్వం వ్యాపారం చేయకూడదనే ఈ నిర్ణయం తీసుకుంటుందని వెల్లడించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ పై విపక్షాలు అనవసర రాద్దాంతం చేస్తున్నారని తెలిపారు. దీనిపై టీడీపీ, వైసీపీ ఆందోళనలు చేసినంత మాత్రాన ఆగదని కూడా తెలిపారు. ప్లాంట్ విశాఖలోనే ఉంటుందని, వేరే దేశానికి తరళివెల్లడం లేదని సుజనా చౌదరి వ్యాఖ్యానించారు.

మోడీకి పవన్ వినతి

అయితే బీజెపీకి మిత్రపక్షమైన జనసేన నేత పవన్ కళ్యాణ్ మాత్రం విశాఖ ఉక్క పరిశ్రమను ప్రైవేకరణ చేయడానికి వీలులేదని అంటున్నారు. దీనిపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని కలిసి కూడా మాట్లాడతానని అన్నారు. తెలుగు వారి ఆత్మగౌరవానికి, ఆకాంక్షలకు ప్రతీక అయిన ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు నుండి పెట్టుబడులు ఉపసంహరించుకోవడం బాధాకరమని అన్నారు పవన్ కళ్యాణ్, ఎందరో త్యాగాల ఫలితంగా ఆవిర్భవించిన ఈ కర్మాగారం చేతులు మారుతుందంటే తెలుగు వారందరికీ ఆమోదయోగ్యం కాదని అన్నారు. యుపిఏ పక్షాన ప్రధాన మంత్రిగా మన్మోహన్ సింగ్ ఉన్న సమయంలోనే ప్రవేటీకరణ అడుగులు పడ్డాయన్నారు. ఈ విషయంలో జన సేన తన వంతు కృషి చేస్తుందన్నారు ఈ ప్రతిపాదనను ఉపసంహరించుకోవాల్సిందిగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, బీజెపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా లను కోరుతున్నానని పవన్ కళ్యాణ్ తెలిపారు. ఢిల్లీకి వెళ్లి నేరుగా వారిని కలిసి మరీ తెలుగు వారి పక్షాన విజ్ఞాపనను కూడా సమర్పించనున్నట్లు వెల్లడించారు.

ఇది కూడా చదవండి :Visakha Steel : అతను బయటకొచ్చాడు..అమ్మో ఎందుకొచ్చాడో అని కంగారు పడుతొన్న జగన్? 

 

author avatar
sharma somaraju Content Editor

Related posts

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju