NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

ఎంపీగా ‘ బండ్ల గ‌ణేష్‌ ‘ … ఆ సీటు నుంచే పోటీ…!

పార్ల‌మెంటు ఎన్నిక‌ల‌కు ముహూర్తం దూసుకువ‌స్తున్న నేప‌థ్యంలో ఔత్సాహిక రాజ‌కీయ‌నాయ‌కులు, వివిధ రంగాల్లోని వారు కూడా.. పార్టీల్లో చేరి, పోటీకి సై అంటున్నారు. ఇలాంటి వారిలో తెలంగాణ‌కు చెందిన బండ్ల గ‌ణేష్ ఇప్పుడు ముందున్నారు. తెలుగు సినీ రంగంలో క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుగా ప‌నిప్రారంభించిన గ‌ణేష్‌.. త‌ర్వాత కాలంలో ఓ రాజ‌కీయ నాయ‌కుడి అండ‌తో ఆర్థికంగా ఎదిగార‌ని.. ఉమ్మ‌డి రాష్ట్రంలోనే పెద్ద ఎత్తున చ‌ర్చ‌సాగింది. ఉత్త‌రాంధ్ర‌కు చెందిన ఓ సీనియ‌ర్ నాయ‌కుడు, ఒక‌ప్పుడు కాంగ్రెస్‌ను శాసించిన నేత క‌నుస‌న్న‌ల్లో గ‌ణేష్ ఉండేవార‌ని కూడా అంటారు.

ఇలా.. అనూహ్యంగా క‌లిసి వ‌చ్చిన అదృష్టంతో గ‌ణేష్‌.. నిర్మాతగా కూడా విజ‌యాలు అందుకున్నారు. త‌ర్వాత త‌ర్వాత‌.. సోష‌ల్ మీడియా వేదిక‌గా రాజ‌కీయాల‌పై స‌టైర్లు వేయ‌డం, కామెంట్లు చేయ‌డం ప్రారం భించి.. అన‌తికాలంలోనే రాజ‌కీయాల్లోనూ గ‌ణేష్ గుర్తింపు పొందారు. ముఖ్యంగా కాంట్ర‌వ‌ర్సీల‌కు, ముక్కు సూటి త‌నానికి గ‌ణేష్ పెట్టింది పేరు. ఇక‌, ఇప్పుడు తాజాగా ఆయ‌న వ‌చ్చే పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో పోటీ చేయాల‌ని భావిస్తున్నారు. అది కూడా.. తెలంగాణ‌లోని కీల‌క‌మైన మ‌ల్కాజిగిరి నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఆయ‌న పోటీకి సిద్ధ‌మ‌వుతున్నారు.

కాంగ్రెస్ అభిమానిగా ఉన్న బండ్ల‌.. మ‌ల్కాజిగిరి స్థానం కోరుతూ.. తాజాగా పార్టీకి ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు. వ‌చ్చే పార్ల‌మెంటు ఎన్నిక‌ల‌కు సంబందించి కాంగ్రెస్ పార్టీ ద‌రఖాస్తులు స్వీక‌రించే కార్య‌క్ర‌మానికి శ్రీకారం చుట్టింది. ఈ క్ర‌మంలో బండ్ల కూడా త‌న ద‌ర‌ఖాస్తును ఇవ్వ‌డం గ‌మ‌నార్హం. ఇటు సీని రంగంలోనూ అటు పౌల్ట్రీ రంగంలోనూ.. ఎదిగిన బండ్ల‌కు ఆర్థికంగా ఎలాంటి ఇబ్బంది లేదు. పైగా.. ఆయ‌న చేతికి ఎముక లేని వ్య‌క్తిగా పేరు తెచ్చుకున్నారు. జెన్యూన్‌గా ఉండి.. ఎవ‌రైనా ఆయ‌న‌ను ఆశ్ర‌యించి సాయం అడిగితే లేద‌నే మాట ఆయ‌న నోటి నుంచి రాద‌ని పేరుంది. ఇది ఇప్పుడు ఆయ‌న‌కు ప్ల‌స్ కానుంది.

టికెట్ ఇస్తారా…
మ‌ల్కాజిగిరి విష‌యానికి వ‌స్తే.. ఇక్క‌డ నుంచి గ‌త ఎన్నిక‌ల్లో ప్ర‌స్తుత సీఎం రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ టికెట్‌పై విజ‌యం ద‌క్కించుకున్నారు. సో.. పార్టీ ప‌రంగా ఇక్క‌డ ఢోకా లేదు. 2014-2019 వరకు ఎంపీగా మల్లా రెడ్డి తెలుగుదేశం పార్టీ తరఫున కొనసాగారు. ప్రస్తుతం బీఆర్ఎస్‎లో ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆ తరువాత 2019 ఎన్నికల్లో రేవంత్‌రెడ్డి విజయం సాధించారు. పెద్ద సంఖ్యలో విద్యావంతులు, మధ్యతరగతి ఓటర్లు ఉన్నందున వివిధ ప్రాంతాలకు చెందిన రాజకీయ అభ్యర్థలను ఆకర్షిస్తోంది. ఇటీవ‌ల కాలంలో పాల‌నా ప‌గ్గాలు చేప‌ట్టిన కాంగ్రెస్ అందిస్తున్న సంక్షేమం నేప‌థ్యంలో ఇక్క డ విజ‌యం ఖాయం. ఎవ‌రు నిల‌బ‌డ్డా.. గెలుపు గుర్రం ఎక్కుతార‌నే అంటున్నారు. అయితే.. బండ్ల గ‌ణేష్‌కు ఇది ఇస్తారా లేదా? అనేది చూడాలి.

Related posts

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Telangana High Court: దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీస్ అధికారులకు ఊరట

sharma somaraju

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Janasena: సింబల్ వివాదంపై కూటమికి స్వల్ప ఊరట

sharma somaraju

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N

Shruti Haasan: శృతి హాసన్ బ్రేక‌ప్ స్టోరీ.. ఆ రీజ‌న్ వ‌ల్లే శాంతానుతో విడిపోయిందా..?

kavya N