NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

జ‌గ‌న్ రాంగ్ స్ట్రాట‌జీ దెబ్బ‌కు అనిల్ యాద‌వ్‌ విల‌విలా…!

ఏపీ అధికార పార్టీ వైసీపీ.. వ‌చ్చే ఎన్నిక‌ల‌కు సంబంధించి అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేస్తున్న విష‌యం తెలిసిందే. నియోజ‌క‌వ‌ర్గాల వారీగా స‌మ‌న్వ‌య క‌ర్త‌ల‌ను నియ‌మిస్తున్నారు. వీరికే దాదాపు వ‌చ్చే ఎన్నిక‌ల్లో టికెట్ ఇచ్చే అవ‌కాశం క‌నిపిస్తోంది. ఈ క్ర‌మంలో ఉమ్మ‌డి గుంటూరు జిల్లాలోని న‌ర‌స‌రావు పేట పార్ల‌మెంటు స్థానానికి నెల్లూరు నుంచి నాయ‌కుడిని తీసుకువ‌చ్చారు. ప్ర‌స్తుతం నెల్లూరు సిటీ ఎమ్మెల్యేగా ఉన్న మాజీ మంత్రి పోలుబోయిన అనిల్ కుమార్ యాద‌వ్‌ను న‌ర‌స‌రావుపేట పార్లెమంటు స్థానానికి స‌మ‌న్వ‌య క‌ర్త‌గా నియమించారు.

అయితే.. మార్పు మంచిదేన‌ని పార్టీ అధిష్టానం భావించినా.. స్థానికంగా ఉన్న ప‌రిస్థితుల‌ను గ‌మ‌నిస్తే.. మాత్రం అనిల్ కుమార్‌ను తీసుకురావ‌డంపై వైసీపీ ఎమ్మెల్యేల్లోనే పెద‌వి విరుపులు క‌నిపిస్తున్నాయి. `ఈసీటును బీసీల‌కు ఇవ్వాల‌ని అనుకున్నారు. మంచిదే. కానీ, స్థానికంగానే చాలా మంది బీసీ నాయ‌కులు ఉన్నారు. వారిని వ‌దిలేసి.. ఎక్క‌డో నెల్లూరు నుంచి తీసుకురావ‌డం ఎందుకు?` అని ఒక‌రిద్ద‌రు వైసీపీ నాయ‌కులు వ్యాఖ్యానిస్తున్నారు.

ఇక‌, మెజారిటీ నాయ‌కులు మాత్రం.. `అమ్మో ఆయ‌నో ఫైర్‌బ్రాండ్‌` అని బెంబేలెత్తిపోతున్నారు. త‌మ‌తో కూడా స‌ఖ్య‌త‌గా ఉండ‌ర‌ని.. పైగా ఎన్నిక‌ల ఖ‌ర్చులు కూడా భ‌రిస్తాడో లేదో న‌ని వారు బెంగ‌టిల్లుతున్న ప‌రిస్థితి క‌నిపిస్తోంది. పైగా.. బీసీ అనే ఒక్క ట్యాగ్ త‌ప్ప‌.. ఆయ‌న లోక‌ల్ కాక‌పోవ‌డాన్ని కూడా వైసీపీ నాయ‌కులు ప్ర‌శ్నిస్తున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో స్థానిక‌త అంశం కూడా ప్ర‌జ‌లు గ‌మ‌నిస్తార‌ని అంటున్నారు.. అప్పుడు ఎంత బీసీ ట్యాగ్ ఉన్నా.. ఫ‌లితం ద‌క్క‌డం క‌ష్ట‌మేన‌ని చెబుతున్నారు.

ఇక‌, ప్ర‌స్తుతం వైసీపీ స‌మ‌న్వ‌య‌క‌ర్త‌లుగా, ఎమ్మెల్యేలుగా ఉన్న న‌ర‌సారావు పేట పార్ల‌మెంటు నియోజ‌క వ‌ర్గం ప‌రిధిలోని నాయ‌కులు ఈ నియామ‌కంపై పెద‌వి విరుస్తున్నారు. త‌మ‌తో కలివిడిగా ఉంటారా? అనే సందేహాలు వ్య‌క్తం చేస్తున్నారు. పైగా.. స్థానికేత‌రుడు కావ‌డంతో ఆ ప్ర‌భావం ఎక్కువ‌గా ఉంటుంద‌ని అంటున్నారు. ఫైర్ బ్రాండ్ కావ‌డంతో చీటికీ మాటికీ వివాదాల‌కు దిగే మ‌న‌స్త‌త్వం ఉండ‌డంతో చాలా మంది ఆయ‌న అభ్య‌ర్థిత్వాన్ని ఇష్ట‌ప‌డ‌డం లేదు.

ఇదిలావుంటే.. గ‌తంలో పోల‌వ‌రం పూర్తిచేస్తామ‌ని.. అసెంబ్లీలో ప్ర‌గ‌ల్భాలు ప‌లికార‌ని.. కానీ, అది పూర్తి చేయ‌లేద‌ని.. కాబ‌ట్టి ప్ర‌తిప‌క్షాలు ఈ అంశాన్ని ప్ర‌చారం చేసే అవ‌కాశం ఉంద‌ని కూడా సొంత నేత‌లే అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఈ ప‌రిణామాల నేప‌థ్యంలోనే న‌ర‌స‌రావుపేట విష‌యంలో సీఎం జ‌గ‌న్ రాంగ్ స్టెప్ వేశారా? అనే చ‌ర్చ సాగుతుండ‌డం గ‌మ‌నార్హం. అదే టైంలో ఇక్క‌డ స్థానిక నేత‌ల స‌హాకారం లేక‌పోతే అనిల్‌కుమార్‌కు క‌ష్టాలు త‌ప్పేలా లేవు.

Related posts

ఆమెను లైట్ తీస్కోన్న టీడీపీ టాప లీడ‌ర్ … నా త‌డాఖా చూపిస్తాన‌ని షాక్ ఇచ్చిందిగా..?

ష‌ర్మిల క‌డ‌ప ఎంపీగా గెలిచేందుకు కాదా… ఆమె గేమ్ ప్లాన్ ఇదేనా..?

చిరు ఎంట్రీతో ర‌గులుతోన్న పిఠాపురం… బాబాయ్ కోసం రామ్‌చ‌ర‌ణ్ కూడా ప్ర‌చారం..?

పోలింగ్ బూతుల్లో సీలింగ్ ప్యాన్‌ టీడీపీకి మ‌రో క‌ష్టం వ‌చ్చిందే…?

కొడుకును రెబ‌ల్‌గా పోటీ చేయించుకుంటోన్న వైసీపీ ఎమ్మెల్యే.. ఓట‌మి భ‌యంతోనా ?

MP Prajwal Revanna: జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

PM Modi: అవినీతికి అడ్డుకట్ట పడాలంటే బీజేపీ అభ్యర్ధులను గెలిపించాలి – మోడీ

sharma somaraju

YS Jagan: జగన్‌కు మరో అస్త్రం దొరికేసింది (గా) ..! కూటమి మ్యానిఫేస్టోపై ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

AP Elections 2024: ఏపీలో ప్రజాగళం పేరుతో టీడీపీ – జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టో విడుదల

sharma somaraju

Balakrishna-Pawan Kalyan: బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబోలో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Rk Sagar: మొగలిరేకులు త‌ర్వాత ఆర్కే నాయుడు సీరియ‌ల్స్ ఎందుకు మానేశాడు.. కార‌ణం ఏంటి..?

kavya N

Ileana D’Cruz: ఆ అపోహే సౌత్ లో నా కెరీర్ ను నాశ‌నం చేసింది.. ఇలియానా ఎమోష‌న‌ల్ కామెంట్స్!

kavya N

Breaking: విజయవాడలో విషాదం .. వైద్యుడి ఇంట్లో అయిదుగురు మృతి

sharma somaraju

Janasena: స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాస్ గుర్తు కేటాయింపు .. హైకోర్టును ఆశ్రయించిన జనసేన

sharma somaraju