Banana: అరటి తొక్క లోపలి భాగం తో పళ్లను రుద్దితే తెల్లగా మెరిసిపోతాయి. ఎంత బాగా బ్రష్ చేసిన కూడా కొందరు పళ్ళు పసుపు బారిపోయి కనిపిస్తుంటాయి. ఇలాంటి వారు అరటి తొక్కలు లోపలి భాగం తో అప్పుడప్పుడు పళ్లు రుద్దుకుంటే ఉంటే పళ్ళు మెరిసిపోతాయి. అరటి తొక్క గార్డెనింగ్ లో వాడుకుంటే చాలా లాభాలు ఉంటాయి.
ఆర్గానిక్ ఎరువుగా ఉపయోగపడి మొక్కల పెరుగుదలకు సహాయపడుతుంది. ఇందులో ఉండే పొటాషియం మొక్కలు వివిధ రకాల తెగుళ్లు తో పోరాడేందుకు వాటికి శక్తిని ఇస్తాయి. పండ్ల మొక్కలకు అరటి పళ్ళ తొక్కలను ఎరువుగా వేస్తె వాటి పండ్లు ఎంత రుచిగా ఉంటాయో మీకు తెలుస్తుంది. పూలు, పండ్లు ఎక్కువగా పూయటానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. దీనికోసం అరటి తొక్క లను పెద్ద మొక్కల పక్కన పాతిపెడితే చాలు. అరటి తొక్క లను చిన్న ముక్కలుగా కోసుకుని వాటిని ఒక డబ్బాలో పెట్టి దాని నిండా నీళ్ళు నింపి వారం రోజుల పాటు అలా వదిలేసి, వారం తర్వాత ఈ నీటిలో మగ్గిన తొక్కలను కుండీలో వేసుకుని మిగిలిన నీటిని కొంచెం కొంచెం గా మొక్కలకు పోయటం వల్ల అందులోని పోషకాలను మొక్కలు వెంటనే గ్రహిస్తాయి.
ఒకవేళ ఫర్టిలైజర్ తయారు చేసుకోవాలనుకుంటే అరటి తొక్కలు, కొన్ని మొక్కల ఆకులు, మిగిలిపోయిన కూరగాయలు అన్నీ ఒక ఖాళీ కుండీలో కి లేదా కవర్ లో కి వేసి అందులో కొద్దిగా మట్టి వేసి వేసి వారం రోజుల పాటు కప్పి ఉంచేయాలి . వారం తర్వాత అన్నీ మట్టిలో కలిసిపోతున్నాయిఅనుకున్నపుడు దాన్ని తీసి మొక్కలకు ఎరువు గా వేస్తే మొక్కలు చాలా బాగా పెరుగుతాయి. సహజమైన ఎరువు వేసి పండించడం ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.