Bheemla Nayak: గత కొన్ని నెలలుగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో నెలకొన్న అనిశ్చితి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి వచ్చిన విముఖత ద్వారా ఇండస్ట్రీ వారు ఇప్పటికే ఎంతో నష్టపోయారు. దీనికి తగ్గట్టు ఈ కరోనా ఒకటి. రాష్ట్రంలో ఒమిక్రాన్ చెలరేగిన తర్వాత సంక్రాంతి రిలీజ్ లు అన్నీ వాయిదాపడ్డాయి.
పండగ సమయంలో రావలసిన భీమ్లా నాయక్, రాధే శ్యామ్, ఆర్ఆర్ఆర్ వరుసగా వాయిదా పడ్డాయి. అయితే మూడవ వేవ్ వచ్చేందుకు ముందే రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ సినిమా కారణంగా సర్కారు వారి పాట, భీమ్లా నాయక్ వంటి సినిమాలు వాయిదా పడ్డాయి. అయితే ఒక్క సారిగా కొవిడ్ కారణంగా పలు రాష్ట్రాల్లో లాక్ డౌన్ ప్రకటించడంతో రాజమౌళి సినిమా కూడా వాయిదా పడటంతో చిన్న సినిమాలు అప్పటి నుండి బాక్సాఫీస్ వద్ద సందడి చేశాయి.
ఇప్పుడు మళ్లీ పెద్ద సినిమా పండగ మొదలైంది. అన్నింటికంటే ముందు ఈనెల 25వ తేదీన భీమ్లా నాయక్ థియేటర్లలో విడుదల అయ్యేందుకు సిద్ధంగా ఉంది. జగన్ స్టార్ హీరోలతో కలిసి హామీ ఇచ్చిన నేపథ్యంలో కొత్త టికెట్ ధరలు అమలులోకి రానున్నాయి.
అదీ కాకుండా ఆంధ్రప్రదేశ్లో కూడా నైట్ కర్ఫ్యూ ఎత్తివేశారు. దీంతో పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ రిలీజ్ కి రెడీ అయిపోయింది. అయితే ఇదే సమయంలో చిన్న సినిమాలు మాత్రం సైడ్ అయిపోతున్నాయి. ఇప్పటికే నిర్మాత నాగ వంశీ పవన్ కళ్యాణ్ నటన ఈ సినిమాలో మునుపెన్నడూ చూడని విధంగా ఉంటుందని అభిమానులకు ఒక క్లారిటీ ఇచ్చేశారు.
అయితే ఫిబ్రవరి 25వ తేదీన యువ హీరో కిరణ్ అబ్బవరం నటించిన సెబాస్టియన్ సినిమా విడుదల కావలసి ఉంది కానీ పవన్ కళ్యాణ్ సినిమా కోసం తప్పుకుంది. ఈ విషయాన్ని హీరో నే ఒక ప్రమోషనల్ వీడియో ద్వారా తెలియజేశారు. మరి నాగ వంశీ సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై నిర్మించిన భీమ్లా భారీ విజయాన్ని అందుకొని తన ప్రత్యర్థులకు సరైన సమాధానం ఇస్తుందో లేదో చూడాలి.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!