ట్రెండింగ్ న్యూస్

బిగ్ బాస్ హౌస్ లో కావాల్సినవి దొరకలేదు… బయటికొచ్చి షాకింగ్ కామెంట్స్ చేసిన అవినాష్?

bigg boss 4 buzz with mukku avinash by rahul sipligunj
Share

బిగ్ బాస్ సీజన్ 4 చివరి దశకు చేరుకుంది. గత వారం ముక్కు అవినాష్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యాడు. అతడి ఎలిమినేషన్ అందరూ ఊహించిందే. ప్రస్తుతం హౌస్ లో మిగిలింది ఆరుగురు ఇంటి సభ్యులే. అరియానా, హారిక, మోనల్, అఖిల్, సోహెల్, అభిజీత్. వీళ్లలో అఖిల్ ఇప్పటికే ఫైనల్స్ కు చేరుకున్నాడు.

bigg boss 4 buzz with mukku avinash by rahul sipligunj
bigg boss 4 buzz with mukku avinash by rahul sipligunj

ఇక మిగిలిన ఐదుగురిలో ఎవరో ఒకరు ఈ వారం ఎలిమినేట్ అవ్వాలి. అయితే.. ఈ వారం ఒకవేళ నామినేషన్స్ లోకి వస్తే.. అరియానా, మోనల్ లలో ఎవరో ఒకరు ఇంటి నుంచి వెళ్లిపోతారని టాక్ నడుస్తోంది.

సరే.. అసలు విషయానికి వస్తే.. హౌస్ నుంచి బయటపెట్టాడో లేదో అవినాష్ బిగ్ బాస్ హౌస్ పై సంచలన కామెంట్స్ చేశాడు. రాహుల్ సిప్లిగంజ్ షోలో ఇంటర్వ్యూలో పాల్గొన్న అవినాష్.. బిగ్ బాస్ హౌస్ లో కావాల్సినవి అన్ని దొరకవు కదా.. అంటూ రాహుల్ తో ఇంటర్వ్యూలో అన్నాడు.

నీకు బిగ్ బాస్ హౌస్ లో ఎట్ల అనిపించింది.. అని రాహుల్ అడగగా… లోపల మనకు కావాల్సినవి ఉండవు కాబట్టి… అంటూ అవినాష్ ఏదో అనబోయే సరికి… వెంటనే రాహుల్ అందుకొని కావాల్సినవి అంటే ఏంటివి… అంటూ అడుగుతాడు.  కావాల్సినవి అంటే గదే.. అంటాడు అవినాష్. గదే అంటే ఏంటి.. అంటూ ఎదురు ప్రశ్నించేసరికి.. ఏం చెప్పాలో తెలియక నెత్తి గోక్కుంటాడు అవినాష్.

అవినాష్ ఇంటర్వ్యూకు సంబంధించిన ప్రోమోను తాజాగా విడుదల చేశారు. మొత్తానికి అవినాష్ ఎక్కడ ఉంటే అక్కడ రచ్చే. కామెడీకి కేరాఫ్ అడ్రస్ అవినాష్ అని అనిపించుకుంటున్నాడు.


Share

Related posts

Pegasus: మమతపై టిడిపి కుతకుత..ప్రశాంత్ కిశోర్ పైన చిటపట!ఏపీ రాజకీయాలను వేడెక్కించిన పెగాసన్!

Yandamuri

“RRR”: ఇంకా కోట్లు గుమ్మరిస్తున్న రాజమౌళి..!

GRK

రైతుల ముంగిట్లో మ‌ళ్లీ త‌న స‌త్తా చూపించుకున్న జ‌గ‌న్‌

sridhar