బిగ్బాస్ ఇంటిలో 73వ రోజు అఖిల్ బర్త్డే కావడంతో ఇంటి సభ్యులు అంతా ఆనందంగా ఉన్నారు. అందరూ తనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆనందంగా గడిపారు. అయితే అఖిల్ పైన సోహెల్ నిరసన తెలియజేశాడు. అతను వ్యవహరించిన తీరు తనకు నచ్చలేదంటూ ఫిర్యాదు చేయడం ఇక్కడ గమనార్హం.
ఇంతకీ ఏం జరిగిందంటే అఖిల్ బర్త్ డే సెలబ్రేషన్స్…. 72వ రోజు అర్ధరాత్రి నుండి ప్రారంభమయ్యాయి. అఖిల్ కోసం యాంకర్ లాస్య కేక్ తయారు చేసింది. అతను మొదట కేక్ కట్ చేసి మోనాల్ కు తినిపించాడు. ఆ సమయంలో ఎవరినీ పిలవకుండా నలుగురే ఉండటం గమనార్హం. ఇక కేక్ కట్ చేసిన తర్వాత మోనాల్ తో అఖిల్ ఏకాంతంగా 10 నిమిషాల గడిపాడు.
ఆ తర్వాత నిద్ర వస్తుందని మోనాల్ వెళ్ళిపోతుంటే…. ఆమెను కౌగిలించుకోవాలని కోరాడు. అఖిల్ ను కౌగిలించుకుని ఆమె ముద్దుల మొదలుపెట్టింది. ఇక ఉదయమే అఖిల్ కి సోహెల్ షాక్ ఇచ్చాడు. అందరూ అఖిల్ కు బర్త్డే విషెస్ చెప్పినప్పటికీ సోహెల్ మాత్రం చెప్పకుండా నిరసన తెలిపాడు. కానీ అఖిల్ నాకు విషెస్ చెప్పు రా అంటూ సోహెల్ వెంటపడ్డాడు. న
న్ను లేపకుండా నువ్వు కేక్ ఎలా కట్ చేస్తావు…. అంతే కాకుండా సార్ గారు మనం లేకుండా కేక్ కట్ చేసి బర్త్డే జరుపుకున్నాడు అంటూ గట్టిగా అరిచి చెప్పాడు. దానికి అవినాష్ జోక్యం చేసుకుంటూ అందరినీ ఎందుకు లేపలేదు అని అడిగితే…. ఆయనకి ఎవరు అవసరం లేదు నన్ను వద్దు అనుకున్నాడు అని చెప్పాడు. నన్ను లేపు అని మోనాల్ కి చెప్పాను కానీ అఖిల్ లేపనివ్వలేదు అని కంప్లైంట్ చేశాడు. ఆ తర్వాత కోపం తగ్గి కౌగిలించుకొని విషెస్ చెప్పాడు.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!