సోషల్ మీడియా ద్వారా సెలబ్రెటీలకు అభిమానులు మరింత దగ్గరవుతున్నారు. ఈ ప్లాట్‌ఫామ్స్ ద్వారా అభిమానులు అడిగిన ప్రశ్నలకు సెలబ్రిటీలు సమాధానాలు కూడా చెప్తూ ఉంటారు. కానీ కొందరు నెటిజన్స్ కావాలనే నెగిటివ్ కామెంట్స్‌తో సెలబ్రిటీలకు చిరాకు తెప్పిస్తారు. సినీ హీరోలు, హీరోయిన్లు లేదా ఎవరైనా క్యారెక్టర్ ఆర్టిస్టులు పెట్టే పోస్ట్ లపై కొంతమంది పాజిటివ్ గా స్పందిస్తే మరికొంతమంది నెగిటివ్ కామెంట్స్ చేసి ట్రోల్స్ చేస్తుంటారు. వీరి ట్రోలింగ్ బారిన పడని సెలబ్రిటీ అంటూ ఎవరూ ఉండరు. టాలీవుడ్లో హీరోయిన్స్ చాలా మంది ఇలా నెగిటివ్ కామెంట్స్, ట్రోలింగ్స్ బారిన పడినవారే. అయితే కొంతమంది సెలబ్రెటీలు నెగిటివ్ కామెంట్స్ ని చూసీ చూడనట్టు వదిలేస్తుంటారు కానీ కొంతమంది మాత్రం ఆ కామెంట్స్‌కు తగ్గ సమాధానం ఇస్తూ ఉంటారు.
బిందు మాధవి డ్రెస్సింగ్ పై కామెంట్స్
డిస్నీ+హాట్‌స్టార్‌లో వచ్చిన బిగ్‌బాస్ ఓటీటీలో టైటిల్ గెలిచిన హీరోయిన్ బిందు మాధవి కూడా తాజాగా ట్రోలింగ్ బారిన పడింది. ఆమె డ్రెస్సింగ్ స్టైల్ వల్ల ఆమె పట్ల తనకు గౌరవం పోయింది అని ఓ నెటిజన్ పెట్టిన కామెంట్‌కు బిందు మాధవి స్ట్రాంగ్ గా సమాధానం చెప్పింది. అసలు విషయానికి వస్తే, బిందు మాధవి బిగ్‌బాస్ లో ఉన్నప్పుడు తన ఆటతీరు, ఆటిట్యూడ్ తో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. మగవారితో సమానంగా పోటీపడి బిగ్ బాస్ టైటిల్ నెగ్గింది.
స్ట్రాంగ్ రిప్లై
అయితే ఒక నెటిజన్ ఆమె గురించి కామెంట్ చేస్తూ.. “బిగ్‌బాస్‌లో ఉన్నప్పుడు ఆమె అంటే నాకు ఎంతో గౌరవం. ఎందుకంటే వేరే కంటెంట్లు తమ బాడీని ఎక్స్పోజ్ చేసే దుస్తులు ధరించేవారు కానీ బిందుమాధవి మాత్రం చక్కగా డ్రెస్ వేసుకునేది. కానీ ఇప్పుడు ఆ గౌరవం పోయింది” అని అన్నాడు. ఈ నెగిటివ్ కామెంట్ చదివిన బిందు మాధవికి కోపం పెరిగి పోయింది. దాంతో ఆమె అతనికి స్ట్రాంగ్‌గా కౌంటర్ ఇచ్చింది. “ఓ వ్యక్తికి ఇచ్చే గౌరవం అనేది వారి దుస్తుల వల్ల వస్తుందంటే.. నాకు అటువంటి గౌరవం వద్దు” అంటూ రిప్లై ఇచ్చింది. ఈ రిప్లైతో ఆ నెటిజన్‌కి దిమ్మ తిరిగి పోయింది.