బీజేపీ తలుపు తడుతున్న ఆ జిల్లా నేతలు..!!

దుబ్బాక ఉప ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ పెద్దగా ఓట్లు సాధించిన దాఖలాలు కనబడలేదు. దీంతో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతల చూపులు ఇతర పార్టీలపై పడినట్లు తెలంగాణ రాజకీయాలలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ చైర్మన్ పదవిలో ఉన్న విజయశాంతి కాషాయ కండువా కప్పుకోవడం జరిగింది.

Karnataka polls: Want to keep a track of BJP, Congress' hate mongering? Don' t, if you want 'peace' - Oneindia Newsదీంతో మరింత మంది కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు బీజేపీ లోకి వెళ్లి పోవడానికి ఆ పార్టీకి చెందిన నాయకులతో మంతనాలు జరుపుతున్నారట. గత కొంత కాలం నుండి కాంగ్రెస్ పార్టీ ఉనికి చాటాలని ప్రయత్నిస్తున్న నాయకుల ప్రయత్నాలు సక్సెస్ కాకపోవడంతో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మనుగడ కనుమరుగయ్యే చాన్స్ ఉందని ఇప్పటికే కొంత మంది నేతలు వ్యాఖ్యానించిన సందర్భాలు ఉన్నాయి.

 

అయితే జిహెచ్ఎంసి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఆటలో అరటి పండు లాగా ఉండటంతో పోటాపోటీ బీజేపీ టీఆర్ఎస్ పార్టీల మధ్య గట్టిగా ఉన్న నేపథ్యంలో.. కాంగ్రెస్ పార్టీ నుండి గోడ దూకాలని చూస్తున్న నేతలు బీజేపీ తలుపు తడుతున్నారట. దీంతో ఇదే సరైన సమయం అని కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉండే జిల్లాలపై తెలంగాణ బిజెపి నేతలు స్పెషల్ ఫోకస్ పెట్టడం జరిగిందట. దీనిలో భాగంగా ఉమ్మడి అదిలాబాద్ జిల్లాలో ఒకానొక సమయంలో కాంగ్రెస్ పార్టీ గెలుపు ఓ వెలుగు వెలగాలని ఇప్పుడు.. ఆ జిల్లాలో ఉన్న కాంగ్రెస్ నేతలు బిజెపి పార్టీ వైపు చూస్తున్నారట. ముఖ్యంగా మహేశ్వర్ రెడ్డి బిజెపి లోకి వెళ్ళటానికి రంగం సిద్ధం చేసుకున్నట్లు..వార్తలు వస్తున్నాయి. ఇదే కనుక జరిగితే భవిష్యత్తులో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కి బలమైన పోటీదారుడు అవుతారని స్థానికంగా ఉన్న నేతలు అంటున్నారు. అంతే కాకుండా మరికొంత మంది స్థానికంగా ఉన్న ఏడుగురు కాంగ్రెస్ నేతలు కూడా కాషాయ కండువా కప్పుకోవడానికి రెడీ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.