ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ స్థానం నుండి టీడీపీ అభ్యర్ధి చిరంజీవి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. గత ఎన్నికల్లో టీడీపీ మద్దతుతో పోటీ చేసి ఎమ్మెల్సీగా ఎన్నికైన బీజేపీ అభ్యర్ధి మాధవ్ ఈ సారి డిపాజిట్ కూడా దక్కించుకోలేకపోయారు. ఈ పరిస్థితులపై ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్ రాజు సంచలన కామెంట్స్ చేశారు. ఎన్నికల్లో వైసీపీ డబ్బులు ఖర్చు చేసినా గెలవలేదు టే ఏపి ప్రజలు మార్పు కోరుకుంటున్నారని అర్ధం అవుతోందని అన్నారు. ఇక వైసీపీతో కుమ్మక్కయ్యారనే ప్రచారం వల్లే ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధి ఓడిపోయినట్లు ఆయన పేర్కొన్నారు.

ఇక్కడ బీజేపీ – వైసీపీ ఒక్కటేనన్న అభిప్రాయం ఒటర్లలో బలంగా వెళ్లడం వల్లే బీజేపీ ఓడిపోయిందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు విష్ణుకుమార్ రాజు. ఏపిలో ప్రజాస్వామ్య పరిరక్షణకు మూడు పార్టీలు టీడీపీ, జనసేన, బీజేపీ కలవాల్సిన అవసరం ఉందని అన్నారు. ఏపిలో ఎమ్మెల్సీ ఫలితాలపై పార్టీ నాయకత్వం అంతర్మధనం చేసుకోవాలనీ, వైసీపీ ఎన్నికల్లో డబ్బు ఖర్చు పెట్టినా గెలవలేదు అంటే ఏపి ప్రజలు మార్పు కోరుకుంటున్నారని అర్ధం అవుతోందన్నారు. అయితే ఏపిలో వైసీపీ, టీడీపీలకు సమాన దూరం అంటూ బీజేపీ రాష్ట్ర నేతలు పదేపదే చెబుతున్న నేపథ్యంలో విష్ణుకుమార్ రాజు చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
రాష్ట్రంలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో నాలుగు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలు, రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలను వైసీపీ కైవశం చేసుకోగా, మూడు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల్లో టీడీపీ విజయం సాధించింది. ఈ ఫలితాలు టీడీపీలో జోష్ ను నింపాయి. వైసీపీ మాత్రం ఈ గెలుపునకు టీడీపీ బలం కారణం కాదని, వామపక్షాలు, పీడీఎఫ్ ఓట్ల కారణమని పేర్కొంటోంది. ఈ ఫలితాలు రాబోయే ఎన్నికలకు ఎలాంటి ప్రభావం చూపదని స్పష్టం చేస్తున్నారు అధికార పార్టీ నేతలు.
అది టీడీపీ బలం కాదు .. సజ్జల ఆసక్తికర వ్యాఖ్యలు