Uppena : థియేటర్స్ లో సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ అయిన సినిమాలకి అంతకు మించి బుల్లితెర మీద సూపర్ రెస్పాన్ వస్తుందని అందరూ భావిస్తుంటారు. అలాంటి సినిమాలు కూడా ఉన్నాయి. మహేష్ బాబు పోకిరి, మురారి, పవన్ కళ్యాణ్, ఖుషీ, తొలిప్రేమ, బద్రి, ఖలేజా, జల్సా, అత్తారింటికి దారేది, ప్రభాస్ నటించిన బాహుబలి సిరీస్ ఇలా చాలా సినిమాలు థియేటర్స్ లో ఎంత పెద్ద హిట్ అవుతాయో బుల్లితెర మీద కూడా అంతే సక్సెస్ దక్కించుకుంటాయి. ఊహించని విధంగా టీ.ఆర్.పీ రేటింగ్ రాబట్టి హాట్ టాపిక్ అవుతుంటాయి. ఇక కొన్ని సినిమాలు థియేటర్స్ లో ఎంత ఘన విజయాన్ని అందుకున్నా ఎందుకనో ప్రేక్షకులు బుల్లితెర మీద అంతగా ఆదరించరు.
అలాంటి సూపర్ హిట్ సినిమాలు కూడా చాలానే ఉన్నాయి. ఈ క్రమంలోనే ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్న రెండు బ్లాక్ బస్టర్ సినిమాలు బుల్లితెరమీద ప్రసారమై షాకింగ్ రేటింగ్ తెచ్చుకున్నాయి. ఈ సినిమాలు మొదటి సారి మంచి రేటింగ్ సాధించినప్పటికి రెండవసారి మాత్రం ఆశించిన స్థాయిలో రేటింగ్ దక్కలేదు. ఆ సినిమాలే మెగా మేనల్లుడు పంజా వైష్ణవ్ తేజ్, డెబ్యూ బ్యూటీ కృతి శెట్టి నటించిన ఉప్పెన, కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటించిన మాస్టర్. ఈ రెండు సినిమాలు రెండవసారి ప్రసారమైనప్పుడు తక్కువ రేటింగ్ నమోదు చేశాయి. దాంతో ప్రేక్షకులు థియేటర్స్ లో సూపర్ హిట్ సినిమాలు ఇక్కడ మాత్రం యావరేజ్ అని చెప్పుకుంటున్నారట.
Uppena : ఈ రెండు సినిమాలలో విలన్గా నటించింది విజయ్ సేతుపతి కావడం విశేషం.
బుచ్చిబాబు సాన దర్శకత్వంలో ఉప్పెన తెరకెక్కింది. ఈ సినిమా మొదటిసారి ఏప్రిల్ 18న ‘స్టార్ మా’లో ప్రసారమైంది. ఉప్పెనకు మొదటిసారి 18.5 టిఆర్పీ రేటింగ్ వచ్చింది. ఇది మంచి రేటింగ్. దాంతో మళ్ళీ ప్రసారం చేసే అదే స్థాయిలో రేటింగ్ వస్తుందని భావించి ప్రసారం చేశారు. కానీ ఉప్పెన 11.37 టిఆర్పీ తెచ్చుకొని షాకిచ్చింది. ఇక విజయ్ నటించిన మాస్టర్ సినిమా జెమినీ ఛానల్లో ఫస్ట్ టైం టెలికాస్ట్ అయినప్పుడు 4.8 రేటింగ్ వచ్చింది. ఇటీవల రెండవసారి ప్రసారమైనప్పుడు 3.8 రేటింగ్ వచ్చింది. ఇది చాలా తక్కువ రేటింగ్ అని విశ్లేషకులు భావిస్తున్నారు. కాగా ఈ రెండు సినిమాలలో విలన్గా నటించింది విజయ్ సేతుపతి కావడం విశేషం.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!