అల్లు అర్జున్ అంటే ఇష్టం అని బాలీవుడ్ హాట్ బ్యూటీ దిశా పఠాని గతంలో చాలాసార్లు చెప్పుకొచ్చింది. అంతేకాదు అల్లు అర్జున్ డాన్స్ కి ఫ్లాటైపోతానని దిశాపఠాని అందరి ముందు చెప్పిన సంగతి తెలిసిందే. దిశాపఠాని మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన లోఫర్ సినిమాతో టాలీవుడ్ కి పరిచయం అయింది. డైరెక్టర్ పూరి జగన్నాధ్ పరిచయం చేసిన దిశాపఠాని పర్ఫార్మెన్స్ పరంగా మంచి పేరు తెచ్చుకుంది. అంతేకాదు ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్, రాం చరణ్ లాంటి స్టార్ హీరోల సినిమాలలో అవకాశం అందుకుంటుందని అందరూ భావించారు.
కాని దిశాపఠాని కి మళ్ళీ టాలీవుడ్ లో సినిమా చేసే ఛాన్స్ దక్కించుకోలేకపోయింది. కాని బాలీవుడ్ లో మాత్రం దిశాపఠాని స్టార్ హీరోయిన్ గా వరసగా అవకాశాలు అందుకుంటోంది. టైగర్ ష్రాఫ్ తో కూడా మంచి రిలేషన్ మేయింటైన్ చేస్తోంది. ఈ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు కూడా సూపర్ హిట్ గా నిలిచాయి. ఇంత పాపులారిటీ వచ్చినా కూడా టాలీవుడ్ హీరోల మీద దిశాపఠాని కి మక్కువ ఎక్కువగా ఉంది. అవకాశాలు రావాలే గాని తెలుగు సినిమాలు చేయాలని ఆశపడుతోంది.
ఈ ఆశతోనే ఆ మధ్య అల్లు అర్జున్ అంటే ఇష్టమని చెప్పుకొచ్చింది. దాంతో అల్లు అర్జున్ నటిస్తున్న తాజా చిత్రం పుష్ప సినిమాలో స్పెషల్ సాంగ్ కోసం సుకుమార్ బృందం దిశా పఠాని ని సంప్రదించారట. కాని అల్లు అర్జున్ అంటే ఇష్టం అన్న దిశాపఠాని చిన్న సినిమా తీసే రేంజ్ లో ఒక్క సాంగ్ కే రెమ్యూనరేషన్ డిమాండ్ చేసిందట. దాంతో మేకర్స్ ఒక్క మాట మాట్లాడకుండా సైలెంట్ అయ్యారని చెప్పుకుంటున్నారు. మరి ఈ సాంగ్ చేసే అవకాశం ఏ బ్యూటీకి దక్కుతుందో చూడాలి. కాగా మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న పుష్ప సినిమాలో అల్లు అర్జున్ కి జంటగా మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ రష్మిక మందన్న నటిస్తోంది.
Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!