Prabhas : “బాహుబలి” సినిమా తో అంతర్జాతీయ స్థాయిలో విజయం సాధించిన ప్రభాస్ Prabhas క్రేజ్ ఊహించని విధంగా అంచెలంచెలుగా ఎదుగుతున్న సంగతి తెలిసిందే. “బాహుబలి” సినిమా రాకముందు ప్రభాస్ కెరియర్ మార్కెట్ చాలా వరకు టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిమితం అన్నట్టు ఉండేది. కానీ ఎప్పుడైతే రాజమౌళి దర్శకత్వంలో తన కెరీర్లో “బాహుబలి” సినిమా పడిందో .. తన తలరాత ఒక్కసారిగా మారిపోయింది. పాన్ ఇండియా సూపర్ స్టార్ గా మారిపోయాడు ప్రభాస్. అన్నీ ఇండస్ట్రీలలో ప్రభాస్ కి అభిమానులు ఉండటంతో.. మార్కెట్ విస్తరించడంతో సరే ఇండస్ట్రీలకు చెందిన చాలా మంది నిర్మాతలు డైరెక్టర్లు ప్రభాస్ తో సినిమా చేయడం కోసం క్యూ కట్టే పరిస్థితి ప్రస్తుతం ఉంది. ఇలాంటి తరుణంలో బాలీవుడ్ ఇండస్ట్రీ టాప్ ప్రొడక్షన్ హౌస్ ప్రభాస్ కి కళ్లుచెదిరే ఆఫర్ ఇచ్చినట్లు ఫిల్మ్ ఇండస్ట్రీలో వార్తలు వైరల్ అవుతున్నాయి.
మేటర్ లోకి వెళితే బాలీవుడ్ ఇండస్ట్రీలో “యాష్ రాజ్ ఫిలిమ్స్” అనే టాప్ మోస్ట్ ప్రొడక్షన్ హౌస్ ప్రభాస్ తో కొన్ని సంవత్సరాల పాటు సినిమాలు చేయడానికి అగ్రిమెంట్ చేసుకోవడానికి రెడీ అయినట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం యాష్ రాజ్ ఫిలిమ్స్ యాజమాన్యం ప్రభాస్ తో మంతనాలు జరుపుతున్నట్లు అంతా ఓకే అయితే అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం. ఈ ఆఫర్ ఒక ప్రభాస్ కి మాత్రమే కాక కేజిఎఫ్ హీరో యాష్ కి కూడా ఇచ్చినట్లు బీ టౌన్ లో వార్తలు వైరల్ అవుతున్నాయి. యాష్ రాజ్ ఫిలిమ్స్ లో సినిమాలు చేయాలని చాలామంది బాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోలు కలలు కంటూ ఉంటారు. అలాంటి నిర్మాణ సంస్థ ఏకంగా ప్రభాస్ తో ఎగ్రిమెంట్ చేసుకోవడానికి రెడీ అవుతున్నట్లు వార్తలు రావడంతో ఈ వార్త ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!