Samantha: టాలీవుడ్ టాప్ హీరోయిన్ అయినటువంటి సమంత గత కొన్నాళ్లుగా తెలుగుకే పరిమితం కాకుండా తమిళం, హిందీ భాషలలో కూడా అవకాశాలు చేజిక్కించుకుంటోంది. ఆమధ్య వచ్చిన ఫ్యామిలీ మ్యాన్-2 వెబ్ సిరీస్‌తో సామ్ ఏకంగా దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. ఈ క్రమంలో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగింది. ఆ సిరీస్ కూడా సూపర్ హిట్ కావడంతో సామ్ కు బాలీవుడ్లో అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. అలాగే ఫ్యామిలీ మ్యాన్ సిరీస్‌ను తెరకెక్కించిన రాజ్ అండ్ డీకే దర్శకత్వంలోనే మరో వెబ్‌సిరీస్‌కు సామ్ పచ్చ జెండా ఊపింది.
Anushka-Samantha: అనుష్క వర్సెస్ సమంత.. దేవదాసిగా మారేదెవరు..?
Samantha: సమంతని ప్రొటెక్ట్ చేసిన బాలీవుడ్ బుల్లోడు:
ఇక ఈ వెబ్ సిరీస్‌లో బాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ ధావన్ నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్‌కు సంబంధించి ప్రి ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. కాగా సిరీస్‌కు సంబంధిచిన చర్చల కోసం ముంబై అంధేరీలోని రాజ్ అండ్ డీకే నివాసంలో శుక్రవారం సమావేశం జరిగింది. ముంబయ్ లో ఈ మీటింగ్ అయిపోయిన తరువాత సమంత బయటకు వెళ్లిపోతున్న సందర్భంలో అంతా హడావిడి అయిపోయింది. ఫొటో జర్నలిస్టులు అంతా ఆమె చూటు చేరి ఫొటోల కోసం ప్రయత్నించారు. ఈ క్రమంలో వరుణ్ ధావన్.. ఆమెను ఒక భౌన్సర్ లా కాపాడాడు.
Samantha: ఇక సోది కామెంట్లు ఆపండి.. సమంత దిమ్మతిరిగే కౌంటర్!
ఇలా హేండిల్ చేసాడు!
ఫొటో జర్నలిస్టులను పక్కకు వెళ్ళమంటూ వరుణ్.. ఇలా సరదా వ్యాఖ్యలు చేశాడు. “హేయ్.. జరగండి.. జరగండి.. ఎందుకు ఆమెను అలా భయపెడుతున్నారు? భయపెట్టకండి సామ్ ని” అంటూ సరదాగా కామెంట్ చేశాడు. సమంతకు ఎస్కార్ట్ లాగా కారు దాకా వెళ్లాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో భాగా వైరల్ అవుతుంది. బాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉన్న వరుణ్ ధావన్… రీల్ హీరోలా మాత్రమే కాదు రియల్ హరోగా బిహేవ్ చేశాడంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.