Boyapati srinu: బోయపాటి శ్రీనులో ఆ మార్పు రాదు..అది బ్రాండ్ అంతే..!

Share

Boyapati srinu: సినిమా ఇండస్ట్రీలో ఒక్కో దర్శకుడి శైలి ఒక్కో విధంగా ఉంటుంది. సినిమా మేకింగ్ స్టైల్లో, హీరోను చూపించే విధానంలో. స్క్రీన్ ప్లే నడిపే విధానంలో అలాగే రాజమౌళి మాదిరిగా ముందే సినిమా కథేంటో టూకీగా చెప్పేసి కూడా ప్రేక్షకుల్లో భారీ అంచనాలను క్రియేట్ చేసి భారీ హిట్ అందుకోవడంలో, పూరి జగన్నాధ్ మాదిరిగా జోనర్ మార్చకుండా కూడా హిట్స్ అందుకోవడంలో..ఇలా ఎవరి ప్రత్యేకత వారికుంది. వి.వి.వినాయక్ అంటే గాల్లో సుమోలు లేస్తాయి. అది ఆయన ప్రత్యేకత. రాజమౌళి అంటే భారీ గ్రాఫిక్స్‌తో ఓ విజువల్ వండర్‌లా సినిమా ఉంటుంది.

boyapati-srinu-will-not-change-that-is-brand
boyapati-srinu-will-not-change-that-is-brand

పూరి జగన్నాధ్ సినిమా అంటే పక్కా కమర్షియల్ ఫార్మాట్. హీరో ఊర మాసివ్‌గా ఉంటాడు. డిఫరెంట్ మాడ్యులేషన్.. డిఫరెంట్ డైలాగ్స్.. డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్‌తో స్క్రీన్ మీద కనిపిస్తాడు. ఇక సీనియర్ దర్శకులు కోడి రామకృష్ణ అంటే మంచి గ్రాఫిక్స్ ఉంటాయి. అంతేకాదు ఆయనకు ఓ ఐడెంటిటీ ఉంది. సినిమా షూటింగ్ ఉన్నా లేకపోయినా తల నుదురుకు క్లాత్ కట్టుకోవడం ఓ సెంటిమెంట్. ఈ సెంటిమెంట్ ఆయన కెరీర్ ప్రారంభంలో మొదలైతే చివరి శ్వాస వరకు కొనసాగింది. ఇక సినిమా ప్రమోషన్స్ ను కూడా ఒక్కో దర్శకుడు ఒక్కో స్టైల్లో చేస్తుంటారు.

Boyapati srinu: సినిమా ప్రారంభంలో ముందు కనిపించేది బోయపాటి శ్రీనునే

ఈ విషయంలో దర్శకుడు బోయపాటి శ్రీను వ్యవహార శైలి కాస్త భిన్నంగా ఉంటుంది. దిల్ రాజు నిర్మాతగా వచ్చిన భద్ర సినిమాతో టాలీవుడ్‌కు దర్శకుడిగా మారిన బోయపాటి ఏ సినిమా చేసినా కాస్త ఫ్యాక్షన్, అండ్ యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌ లోనే ఉంటున్నాయి. భారీ ఛేజింగులు, భారీ స్థాయి ఫైట్స్ బోయపాటి శ్రీను తెరకెక్కించే సినిమాలలో ప్రత్యేకత. ఇక సినిమా షూటింగ్ సమయంలో చిన్న ఆర్టిస్ట్ నుంచి స్టార్ హీరో వరకు ఎవరికైనా బోయపాటి స్వయంగా డైలాగ్ ఎలా..ఏ మాడ్యులేషన్‌లో చెప్పాలో..ఎలాంటి హావాభావాలు ఇవ్వాలో చేసి చూపిస్తుంటారు.

అంతేకాదు ఖచ్చితంగా సినిమా ప్రారంభంలో ముందు కనిపించేది బోయపాటి శ్రీనునే. సౌండ్..రోల్ కెమెరా..అండ్ యాక్షన్ అంటూ ముందు సినిమా ప్రారంభంలో కనిపించారంటే అది ఖచ్చితంగా దర్శకుడు బోయపాటి సినిమా అని ఫిక్సవ్వాల్సిందే. ఇక సినిమా సాంగ్ రిలీజ్ చేసినా ఏదైనా మేకింగ్ వీడియో రిలీజ్ చేసినా, టీజర్, ట్రైలర్ రిలీజ్ చేసినా అందులో బోయపాటి శ్రీను తప్పకుండా కనిపిస్తుంటారు. ఆయన సీన్ వివరిస్తున్న షాట్స్, డైలాగ్స్, యాక్షన్ చేసి చూపిస్తున్న షాట్స్ కూడా కలిపే విజువల్స్ వస్తుంటాయి. ఈ విషయంలో ఫ్యాన్స్ పాజిటివ్‌గా రెస్పాండ్ అయినా కూడా కొందరు నెటిజన్స్ మాత్రం నెగిటివ్‌గా ట్రోల్ చేస్తుంటారు.

Boyapati srinu: ఆయన సినిమాలకి ఇదొక బ్రాండ్

అయితే ఎవరెన్ని కామెంట్స్ చేసినా ఈ విషయంలో బోయపాటి శ్రీను తన పంథా మార్చుకోవడం లేదు. ఎందుకంటే ఆయన సినిమాలకి ఇదొక బ్రాండ్ మాదిరిగా అభిమానులు ఫిక్సైపోయారు. ఇటీవల నందమూరి బాలకృష్ణ హీరోగా రూపొందిస్తున్న అఖండ మూవీ సాంగ్ రిలీజైంది. ఈ సాంగ్‌లో కూడా బోయపాటి మేకింగ్ విజువల్స్ యాడ్ చేశారు. కాబట్టి నెటిజన్స్ చేస్తున్న అనవసరమైన ట్రోల్స్ ఆయన ఏమాత్రం పట్టించుకోరని అర్థమైపోయింది. ఇక అఖండ మూవీ బాలయ్య – బోయపాటి శ్రీనుల హ్యాట్రిక్ సినిమా. ఈ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇంతకముందు వీరి కాంబినేషన్‌లో వచ్చిన సింహ, లెజెండ్ సినిమాలు భారీ కమర్షియల్ హిట్‌గా నిలిచాయి. ఇప్పుడు అఖండ ఎలాంటి సక్సెస్ సాధిస్తుందో చూడాలి.


Share

Related posts

బస్టాండ్‌లో లైంగిక వేధింపులు

sarath

రకుల్ ప్రీత్ సింగ్ మీద రూమర్స్ రావడానికే ఆ సినిమా ఒప్పుకున్నట్టైందా ..?

GRK

తండ్రికి జగన్ నివాళి!

somaraju sharma