NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Kuppam Municipal Elections: చంద్రబాబుకు షాక్‌ల మీద షాక్‌లు..! అర్ధరాత్రి టీడీపీ ముఖ్యనేతల అరెస్టు..!!

Kuppam Municipal Elections:ఎన్నికల అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ టీడీపీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎస్ఈసీకి లేఖ రాసిన గంటల వ్యవధిలోనే మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ ప్రచార బాధ్యతలను పర్యవేక్షిస్తున్న మాజీ మంత్రి అమరనాధ్ రెడ్డి, చిత్తూరు పార్లమెంట్ నియోజకవర్గ టీడీపీ అధ్యక్షుడు పులివర్తి నాని, టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, కుప్పం టీడీపీ ఇన్ చార్జి పిఎస్ మునిరత్నంలను మంగళవారం రాత్రి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పం మున్సిపాలిటీలో ఓ వార్డును వైసీపీ ఎకగ్రీవం చేసుకుని మొదటి షాక్ ఇచ్చింది. ఆ తర్వాత టీడీపీ నేతలపై కేసులు నమోదు చేయడం, ప్రచార బాధ్యతలు నిర్వహిస్తున్న నేతలను అరెస్టు చేయడం చంద్రబాబుకు మరో షాక్ ఇచ్చినట్లు అయ్యింది.

Kuppam Municipal Elections: tdp leaders arrested
Kuppam Municipal Elections: tdp leaders arrested

 

Read More: Chandra Babu: వైసీపీ సర్కార్ పై సీరియస్ కామెంట్స్ చేసిన చంద్రబాబు..!!

Kuppam Municipal Elections: నేతల అరెస్టుపై చంద్రబాబు ఏమన్నారంటే..

టీడీపీ నేతలను అక్రమంగా అరెస్టు చేశారంటూ చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమ అరెస్టులను ఆయన ఖండించారు. టీడీపీ నేతల అరెస్టు అప్రజాస్వామికమని అన్నారు. కుప్పంలో ఓ హోటల్ లో ఉన్న అమరనాధ్ రెడ్డి, పులివర్తి నాని తదితరులను పోలీసులు అరెస్టు చేశారన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుందని చంద్రబాబు విమర్శించారు. టీడీపీ నేతలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని అన్నారు. ఎన్నికలను ఏకపక్షం చేసుకోవాలని జగన్ రెడ్డి ప్రణాళిక అని చంద్రబాబు దుయ్యబట్టారు. ఎట్టిపరిస్థితుల్లో జగన్ రెడ్డి ఆటలు సాగబోవని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరిగేలా ఈసీ చర్యలు తీసుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. అక్రమంగా అరెస్టు చేసిన టీడీపీ నేతలను విడుదల చేయాలని కోరారు.

అసలు ఏమి జరిగింది అంటే..

కుప్పం మున్సిపల్ అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తూ 14వ వార్డును ఏకగ్రీవం చేశారంటూ టీడీపీ నేతలు సోమవారం రాత్రి మున్సిపల్ కార్యాలయం వద్ద ఆందోళన చేసిన విషయం తెలిసిందే. ఈ నిరసన అర్ధరాత్రి వరకూ కొనసాగింది. ఈ నిరసనలో ఎమ్మెల్యే నిమ్మల రామనాయుడు, మాజీ మంత్రులు అమరనాధ్ రెడ్డి, బండారు సత్యనారాయణమూర్తి, పార్టీ పార్లమెంట్ ఇన్ చార్జి పులివర్తి నాని, ఎమ్మెల్సీ దొరబాబు, మాజీ ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. అయితే దీనిపై మున్సిపల్ కమిషనర్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. టీడీపీ నేతలు కార్యాలయంలో నిరసనకు దిగి తనతో పాటు సిబ్బంది విధులను ఆటంకం కలిగించారనీ, అద్దాలు పగులగొట్టారని కమిషనర్ చిట్టిబాబు ఇచ్చిన ఫిర్యాదుపై టీడీపీ నేతలు, కార్యకర్తలపై అర్బన్ పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదు అయ్యాయి. మొత్తం 16 మందిపై ఐపీసీ 143, 147, 353, 427, రెడ్ విత్ 149 తో పాటు ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసు మేరకు కుప్పంలోని ఓ హోటల్ లో ఉన్న అమర్‌నాధ్ రెడ్డి, పులివర్తి నాని లను మంగళవారం రాత్రి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదే విధంగా ఎమ్మెల్యే రామానాయుడు, కుప్పం ఇన్ చార్జి మునిరత్నం లను అదుపులోకి తీసుకున్నారు.

Kuppam Municipal Elections: 14వ వార్డు ఏకగ్రీవంపై ఎస్ఈసీకి ఫిర్యాదు

మరో పక్క కుప్పం మున్సిపాలిటీలోని 14వ వార్డు ఏకగ్రీవంపై ఎస్ఈసీకి టీడీపీ ఫిర్యాదు చేసింది. టీడీపీ అభ్యర్ధులు ఎం ప్రకాశ్, పి తిరుమగల్ కుప్పం లో లేకపోయినా వారు నామినేషన్లు ఉపసంహరించుకున్నట్లు ప్రకటించారని ఎస్‌ఈసీకి టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు ఫిర్యాదు చేశారు. అభ్యర్ధుల సంతకాలతో కూడిన లేఖను ఎస్ఈసీకి పంపారు. నామినేషన్ నుండి ఉపసంహరణ తేదీ వరకూ జరిగిన పరిణామాలను అశోక్ బాబు లేఖలో పేర్కొన్నారు. అభ్యర్ధుల తరపున ఫొర్జరీ పత్రాలు ఎవరు సమర్పించారో సీసీ కెమెరా పుటేజ్ ఆధారంగా తేల్చాలని ఆయన కోరారు.

Related posts

‘ బోడే ‘ ప‌వ‌ర్‌… పెద్దిరెడ్డికి లైఫ్‌లో ఫ‌స్ట్ టైం స‌రైన మ‌గాడు త‌గిలాడు..!

మెగా డెసిష‌న్ ఏంటి? పిఠాపురం వ‌స్తున్న‌ట్టా.. రాన‌ట్టా..!

`ల్యాండ్ టైటిలింగ్`తో రాజ‌కీయ‌ న‌ష్టం ఎవ‌రికి..? లాభం ఎవ‌రికి..?

Ram Pothineni: కొత్త ప్ర‌యాణానికి శ్రీ‌కారం చుడుతున్న రామ్‌.. ఫ్యాన్స్ ముచ్చ‌ట తీర‌బోతోందోచ్..!

kavya N

Allu Arjun: 20 ఏళ్ల నుంచి షూటింగ్స్ కు వెళ్లే ముందు అల్లు అర్జున్ పాటిస్తున్న‌ ఏకైక‌ రూల్ ఏంటో తెలుసా?

kavya N

Varalaxmi Sarathkumar: నాగ‌చైత‌న్య-వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ కాంబినేష‌న్ లో ప్రారంభ‌మై ఆగిపోయిన సినిమా ఏదో తెలుసా?

kavya N

Ramya Krishnan: హీరోయిన్లు ఎదగాలంటే కొన్నిసార్లు సర్దుకుపోవాల్సిందే.. కాస్టింగ్ కౌచ్‌పై ర‌మ్య‌కృష్ణ షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Deepika Padukone: షాకింగ్ న్యూస్.. విడాకులకు సిద్ధ‌మ‌వుతున్న దీపికా పదుకొనే.. బిగ్ హింట్ ఇచ్చిన రణవీర్!

kavya N

Brahmamudi May 08 Episode 404:అత్త కోసం సాక్ష్యం నాశనం చేసిన కావ్య.. కోటి కోసం రుద్రాణి తిప్పలు.. అపర్ణ మరో కఠిన నిర్ణయం..?

bharani jella

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju