Karthikeya: కార్తికేయను విలన్‌గానే చూడాలనుకుంటున్నారా..?

Share

Karthikeya: కార్తికేయ గుమ్మకొండ..ఈ పేరు వింటే అందరికీ వెంటనే గుర్తొచ్చేది రాం గోపాల్ వర్మ శిష్యుడు అజయ్ భూపతి దర్శకుడిగా మారుతూ రూపొందించిన ‘ఆర్ ఎక్స్ 100’ సినిమా. ఇందులో హీరోయిన్‌గా పాయల్ రాజ్‌పుత్ నటించింది. వాస్తవంగా దర్శకుడికి, హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్‌కు ‘ఆర్ ఎక్స్ 100’ మొదటి సినిమా. కానీ హీరో కార్తికేయకు మాత్రం ఇది రెండవ సినిమా. దీనికంటే ముందే ఈ హీరో ప్రేమతో మీ కార్తీక్ అనే సినిమా చేశాడు. ఈ సినిమా యూత్ ఆడియన్స్‌ను బాగానే ఆకట్టుకుంది.

are the fans willing to see karthikeya as villan...?
are the fans willing to see karthikeya as villan…?

మ్యూజికల్‌గా కూడా ప్రేమతో మీ కార్తీక్ బాగానే ఆకట్టుకుంది. అయితే అన్నీ వర్గాల ప్రేక్షకులను ప్రేమతో మీ కార్తీక్ సినిమా చేరకపోవడంతో హీరోగా అంత పాపులారిటీని తెచ్చుకోలేకపోయాడు. కానీ ‘ఆర్ ఎక్స్ 100’ సినిమా రిలీజ్‌కు ముందే కార్తికేయకు హీరోగా మంచి క్రేజ్ వచ్చేసింది. ఈ సినిమాతో ఒకేసారి ఇటు యూత్ ఆడియన్స్‌ను అటు మాస్ ఆడియన్స్ ను బాగా ఆకట్టుకున్నాడు. ‘ఆర్ ఎక్స్ 100’ కథ కార్తికేయకు హైటూ..పర్సనాలిటీకి, తన బాడీ లాంగ్వేజ్‌కు పర్‌ఫెక్ట్‌గా సూటయింది.

Karthikeya: ఈ సినిమాలలో ఆడియన్స్‌ను ఆకట్టుకునే ఎలిమెంట్స్ లేకపోవడం పెద్ద మైనస్ అయ్యాయి.

ఇక బ్లాక్ బస్టర్ హిట్ సాధించడంతో వరుసగా క్రేజీ ఆఫర్స్ అందుకున్నాడు కార్తికేయ. ‘ఆర్ ఎక్స్ 100’ సినిమా తరహాలోనే మంచి యాక్షన్ అండ్ రొమాన్స్ కలిసి ఉండే అంశాలతో ఉన్న కథలు ఎంచుకున్నాడు. ‘ఆర్ ఎక్స్ 100’ మూవీ తర్వాత కార్తికేయ ‘హిప్పీ’, ‘గుణ 369’, ’90 ఎంఎల్ సినిమాలు చేశాడు. ఈ సినిమా టైటీల్స్ చూస్తుంటేనే అర్థమవుతుంది. ఇవి ఎలాంటి కథా నేపథ్యంలో తెరకెక్కాయో. కానీ, ఎందుకనో వరుసగా వచ్చిన ఈ మూడు సినిమాలు కార్తికేయను తీవ్రంగా నిరాశపరిచాయి.

మ్యూజిక్ పరంగా మంచి పేరు వచ్చిన ఈ సినిమాలలో ఆడియన్స్‌ను ఆకట్టుకునే ఎలిమెంట్స్ లేకపోవడం పెద్ద మైనస్ అయ్యాయి. ‘ఆర్ ఎక్స్ 100’ లాంటి సినిమా సక్సెస్ తర్వాత అలాంటి సినిమాలనే కార్తికేయ నుంచి జనాలు కోరుకున్నారు. అయితే అన్నీ ఆ తరహా కథలే ఏ హీరో ఒప్పుకోడు..జనాలందరూ పదే పదే అదే కథలోను చూసేందుకు ఇష్టపడరు. కాబట్టే ఒక్క భారీ హిట్ కొడితే మూడూ డిజాస్టర్లు పడ్డాయి. విలన్‌గా చేసిన నాని గ్యాంగ్ లీడర్ సినిమా ఫ్లాపయినా కార్తికేయకు మాత్రం మంచి పేరు తెచ్చిపెట్టింది. ఇక హీరోగా ‘చావుకబురు చల్లగా’ అనే సినిమాను చేశాడు కార్తికేయ.

Karthikeya: నీ హైట్ అండ్ ఫిజిక్ ఆ రోల్స్‌కు పర్‌ఫెక్ట్‌గా సూటవుతుంది.

అగ్ర నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ 2 బ్యానర్లో నిర్మించిన ఈ సినిమాలో లావణ్య త్రిపాఠి హీరోయిన్‌గా నటించింది. అయితే ఈ కథ, కథనమే జనాలకి ఎక్కలేదు. దాంతో మరో ఫ్లాప్ కార్తికేయ అకౌంట్‌లో చేరింది. ఇప్పుడు కార్తికేయ విలన్‌గా తమిళ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇస్తున్నాడు. అజిత్ నటిస్తున్న వాలిమై మూవీలో విలన్‌గా కనిపించబోతున్నాడు. అలాగే శ్రీ సరిపల్లి దర్శకత్వంలో ‘రాజా విక్రమార్క’ సినిమా కంప్లీట్ చేశాడు. త్వరలో ఈ సినిమా రిలీజ్ రానుంది. అయితే టాలీవుడ్‌లో అందరూ ఇప్పుడు కార్తికేయకు నువ్వు హీరోగా చేస్తూనే విలన్ రోల్స్ కూడా చేయమని సలహాలిస్తున్నారు. నీ హైట్ అండ్ ఫిజిక్ ఆ రోల్స్‌కు పర్‌ఫెక్ట్‌గా సూటవుతుంది. మంచి లాంగ్ రన్ కెరీర్ కూడా ఉంటుందని చెబుతున్నారట.


Share

Related posts

బ్రేకింగ్: బిగ్ బాస్ ఎంట్రీస్ లో న్యూ ట్విస్ట్.. కంటెస్టెంట్స్ చేతిలో సెలక్షన్

Vihari

ఆ రాష్ట్ర సీఎం కొడుకు ని ముప్పుతిప్పలు పెడుతున్న కంగనారనౌత్..!!

sekhar

బిగ్ బాస్ నుంచి ఎలిమినేటైతేనేమి.. ప్రొడ్యూసర్స్ అందరినీ చుట్టూ తిప్పుకుంటుంది ..?

GRK