ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Breaking: రేపు ఏపి కేబినెట్ భేటీ ..ఈ కీలక అంశాలపై చర్చ..

Share

Breaking: ఆంధ్రప్రదేశ్ కేబినెట్ భేటీ రేపు జరగనుంది. సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి అధ్యక్షతన శక్రవారం ఉదయం 11 గంటలకు సచివాలయంలో మంత్రిమండలి సమావేశం అవుతోంది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలపై కేబినెట్ చర్చించి ఆమోదించనుంది. ప్రస్తుతం ఏపిలో ఉద్యోగుల పీఆర్సీ సమస్య హాట్ టాపిక్ గా ఉంది. నూతన పీఆర్సీ జీవోను వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉద్యమ కార్యాచరణకు సన్నద్దం అవుతున్నారు ఉద్యోగ సంఘాల నేతలు. సమ్మెలోకి వెళ్లేందుకు సైతం సిద్దమై రేపు నోటీసు అందజేయనున్నారు. ఈ నేపథ్యంలో కేబినెట్ లో ఈ సమస్యపై చర్చించే అవకాశం ఉంది.

Breaking: tomorrow ap cabinet meet
Breaking: tomorrow ap cabinet meet

Breaking: కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపైనా

అదే విధంగా రాష్ట్రంలో కరోనా కేసులు వివరీతంగా పెరుగుతున్నాయి. తాజాగా 12 వేలకు పైగా కరోనా కొత్త కేసులు నమోదు అయ్యాయి. పలు జిల్లాల్లో వెయ్యికి పైగా కేసులు నమోదు అవుతున్నాయి. కేబినెట్ భేటీలో కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపైనా చర్చించి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. అదే విధంగా సినిమా టికెట్ల ధరల విషయంలో కేబినెట్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి సీఎం జగన్ తో భేటీ అయిన తరువాత త్వరలో ఈ సమస్య పరిష్కారం అవుతుందని, ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుంటుందని వ్యాఖ్యానించారు. ఈ నెలలో అమలు చేయనున్న ఈబీసీ నేస్తం పథకంతో పాటు పలు ప్రధాన అంశాలపైనా చర్చించి కేబినెట్ ఆమోదం తెలపనుందని సమాచారం.

Read more: CPI Narayana: ఏపి ప్రభుత్వంపై సీపీఐ నారాయణ ఘాటు వ్యాఖ్యలు..! ఉద్యోగుల ఆందోళనకు మద్దతు..


Share

Related posts

Balakrishna: మరోసారి ఆ టాప్ డైరెక్టర్ తో పని చేయడానికి రెడీ అవుతున్న బాలయ్య బాబు..!!

sekhar

HariHaraVeeraMallu: పవన్ ఫాన్స్ కి సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన క్రిష్..!!

sekhar

ఒకే ఒక్క సీన్ తో దుబ్బాక లో “వార్ వన్ సైడ్” అన్నట్టు మారింది..??

sekhar