Lavanya tripathi – Varuntej: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ప్రేమించుకుంటున్నారని.. త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. మెగా ఫ్యామిలీలో ఏ చిన్న ఫంక్షన జరిగినా లావణ్య త్రిపాఠి తప్పని సరిగా అటెండ్ అవుతుండటం, నైట్ పార్టీల్లో వరుణ్, లావణ్యలు క్లోజ్‌గా దిగిన కొన్ని ఫొటోలు గతంలో బయటకు రావడం ఈ ప్రచారానికి మరింత బలాన్ని చేకూర్చాయి.
వీటికి తోడు నిన్న ఓ వార్త సోషల్ మీడియాలో మరింత వైరల్ అయింది. బుధవారం వరుణ్ తేజ్ పుట్టిన రోజు సందర్భంగా బెంగుళూరు వెళ్లి అక్కడే బర్త్ డే సెలబ్రేట్ చేసుకున్నారు. అక్కడి ఫొటోలను ఇన్‌స్టాలో షేర్ చేశాడు. దీంతో లావణ్యతో బర్త్‌డే సెలబ్రేట్ చేసుకునేందుకే వరుణ్ బెంగుళూరు వెళ్లాడని, అక్కడ ఆమెకు ఖరీదైన డైమండ్ రింగ్‌తో ప్రపోజ్ కూడా చేయబోతున్నాడని నెట్టింట నిన్నంతా ప్రచారం జరిగింది.
అయితే ఈ ప్రచారానికి తాజాగా లావణ్య పులిస్టాప్ పెట్టేసింది. వరుణ్ తేజ్‌తో ప్రేమ, పెళ్లి అంటూ వస్తున్న వార్తలకు లావణ్య పరోక్షంగా సూపర్ రిప్లై ఇచ్చింది. తాను ప్రస్తుతం ఫ్యామీలీతో డెహ్రాడూన్‌లో ఉన్నానని, అక్కడి ప్రకృతి అందాలు ఆస్వాదిస్తున్నానని తెలుపుతూ కొన్ని ఫొటోస్ నేడు ఇన్స్టాగ్రామ్ వేదికగా షేర్ చేసింది. దీంతో లావణ్య బెంగుళూరులోనే లేదని, సోషల్ మీడియాలో జరిగిన ప్రచారం మొత్తం అసత్యమే అని స్పష్టంగా తేలిపోయింది.
కాగా, వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠిలు గతంలో మిస్టర్, అంతరిక్షం చిత్రాల్లో కలిసి నటించారు. ఈ రెండు సినిమాలు ఫ్లాప్ అయినప్పటికీ.. వరుణ్, లావణ్య మధ్య కెమిస్ట్రీ మాత్రం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈ నేపథ్యంలోనే వీరిద్దరిపై గత కొద్ది రోజుల నుంచి పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!