NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

ర‌చ్చ ర‌చ్చ‌… టీడీపీ ఎమ్మెల్యేపై పోటీగా త‌మ్ముడు…!

జనసేన – తెలుగుదేశం పార్టీ పొత్తు నేపథ్యంలో కొన్ని నియోజకవర్గాలలో ఇరు పార్టీలకు రెబల్స్ బెడద తప్పటం లేదు. మరీ ముఖ్యంగా జనసేన నుంచి చాలామంది సీట్లు ఆశిస్తున్నారు. అయితే జనసేన కేవలం 24 సీట్లలో మాత్రమే పోటీ చేస్తుంది. ఈ క్రమంలోనే మిగిలిన నియోజకవర్గాల్లో జనసేన సీట్లు ఆశించి రాని నేతలు అంతా రెబల్స్ గా బరిలోకి దిగేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మరికొన్నిచోట్ల తెలుగుదేశం పార్టీకి సీనియర్ నేతలకు రెబల్స్ బెడ‌ద‌ తప్పడం లేదు. విశాఖ జిల్లాలో ఈ రెబల్స్ బెడద పలు నియోజకవర్గాలలో కనిపిస్తోంది.

Brother contesting against TDP MLA.
Brother contesting against TDP MLA.

విశాఖపట్నం న‌గ‌రంలో అసెంబ్లీ సీటు ఆశించి భంగపడిన ఆ పార్టీ సీనియర్ నేత పాసర్ల ప్రసాద్ రెబల్గా బరిలోకి దిగేందుకు ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇక్కడ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే గణబాబు ఉన్నారు. 2014 – 2019 ఎన్నికలలో వరుసగా రెండుసార్లు గెలిచిన ఆయనకే చంద్రబాబు మరోసారి సీటు ఇచ్చారు. అయితే పాసర్ల ప్రసాద్ తన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గత ఐదేళ్లుగా తన పశ్చిమ నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేసేందుకు ఎంతో కష్టపడ్డాను అని.. ఈసారి అయినా తనకు టిడిపి టిక్కెట్ వస్తుందని ఎన్నో ఆశలు పెట్టుకున్నాను.. పైగా సిట్టింగ్ ఎమ్మెల్యే గణబాబుకే టిక్కెట్ ఇచ్చారంటూ ఆయన వాపోతున్నారు.

పార్టీలో తాను చేసిన సేవకు గుర్తింపు లేదని.. అందుకే ఈసారి కఠిన నిర్ణయం తీసుకుంటున్నాను అని తన అనుచరులతో ప్రసాద్ చెప్పినట్టు తెలుస్తోంది.. వచ్చే ఎన్నికలలో ప్రసాద్ విశాఖపట్నం ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గం నుంచి టిడిపి రెబల్ అభ్యర్థిగా పోటీ చేస్తే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. విశాఖపట్నం ప‌శ్చిమంలో కాపు సామాజిక వర్గం ఓటర్లు పెద్ద సంఖ్యలో ఉన్నారు.

అయితే 2009లో ఈ నియోజకవర్గంలో ఏర్పడినప్పటి నుంచి మూడుసార్లు ఒకే సామాజిక వర్గం గెలుస్తూ వస్తోంది. గవర సామాజిక వర్గం వారే ఇక్కడ ఎమ్మెల్యేలు అవుతున్నారు. టిడిపి ఇక్కడ కొత్త ప్రయోగాలు చేయడం లేదు. దానితో పాసర్ల ప్రసాద్ వర్గం తీవ్ర అసంతృప్తికి లోనవుతుంది. ఒకవేళ ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేస్తే టిడిపికి రాజకీయంగా నష్టమే అన్న చర్చలు నడుస్తున్నాయి.

Related posts

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Congress: పార్టీ కండువా కప్పుకున్నా .. చేరికకు బ్రేక్ .. తెలంగాణ కాంగ్రెస్ లో విచిత్రం

sharma somaraju

ఏపీ ఎన్నిక‌ల్లో ఇప్పుడు అన్ని పార్టీల‌కు ‘ 15 ‘ టెన్ష‌న్ స్టార్ట్‌…?

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

నిన్న భువ‌నేశ్వ‌రి.. నేడు చంద్ర‌బాబు.. ఏంటీ ఫేక్‌ పాలిటిక్స్ .. !

‘ ఇక్క‌డున్న‌ది జ‌గ‌న్ రా ‘ బాబు… కూట‌మి అంత లైట్ అయ్యిందా ?

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

YSRCP: వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్ .. ఆ లబ్దిదారులు ఖుషీ

sharma somaraju

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N