NewsOrbit
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Aroori Ramesh: కేసీఆర్ ఎంట్రీతో మారిన సీన్ .. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ కీలక ప్రకటన .. హైడ్రామా సాగిందిలా..

Aroori Ramesh: తెలంగాణ రాజకీయ వర్గాల్లో బీఆర్ఎస్ వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ పార్టీ మార్పు అంశం హాట్ టాపిక్  అయ్యింది. ఉదయం నుండి నెలకొన్న హైడ్రామాకు కేసిఆర్ ఎంట్రీతో తెరపడింది. తాను బీఆర్ఎస్ లోనే ఉన్నాననీ, తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదంటూ కేసీఆర్ తో భేటీ అనంతరం పేర్కొన్నారు ఆరూరి రమేష్.

బీఆర్ఎస్ ను వీడి బీజేపీలో చేరే ఆలోచనలో ఆరూరి రమేష్ నిర్ణయించుకున్నారని తొలుత వార్తలు వచ్చాయి. ఈ విషయం బీఆర్ఎస్ హైకమాండ్ దృష్టికి వెళ్లడంతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెండ్, మాజీ మంత్రి కేటిఆర్ ఆయనను ఇటీవల తెలంగాణ భవన్ కు పిలిపి బుజ్జగించారు. వరంగల్ ఎంపీ టికెట్ ఇస్తామని కేటిఆర్ హామీ ఇచ్చారు. దీంతో మెత్తబడిన ఆరూరి తాను బీఆర్ఎస్ ను వీడటం లేదని మూడు రోజుల క్రితం ప్రకటించారు.

అయితే ఆ తర్వాత ఏమి జరిగిందో ఏమో కానీ మళ్లీ మనసు మార్చుకున్నారు. మంగళవారం బీజేపీ అగ్రనేత అమిత్ షాతో ఆదూరి సమావేశమైయ్యారు. దీంతో బీఆర్ఎస్ లో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. ఈ క్రమంలో ఇవేళ (బుధవారం) ఉదయం హనుమకొండలో మీడియా సమావేశం పెట్టి బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పేందుకు ఆరూరి రమేష్ సిద్దమయ్యారు.

అయితే మీడియా సమావేశానికి సిద్దమవుతున్న సమయంలోనే బీఆర్ఎస్ నేతలు ఎంట్రీ ఇచ్చారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, బసవరాజు సారయ్య తో పాటు మరి కొందరు బీఆర్ఎస్ నేతలు అక్కడకు చేరుకున్నారు. ఆరూరిని బుజ్జగించేందుకు ప్రయత్నించారు. ఆయన ససేమిరా అంటూ మీడియా సమావేశానికి సిద్దమవుతుండగా, ఆయనను కొద్దిగా బలవంతంగా ఎర్రబల్లి దయాకర్ రావు బయటకు తీసుకువచ్చి కారులో ఎక్కించుకుని హైదరాబాద్ తీసుకువెళ్లారు.

హైదరాబాద్ చేరుకున్న తర్వాత ఆరూరి రమేష్ ను బీఆర్ఎస్ అధినేత కేసిఆర్ ఇంటికి తీసుకువెళ్లారు. కేసిఆర్ తో సమావేశం అనంతరం రమేష్ పార్టీ మార్పు వార్తలపై ఉత్కంఠ వీడింది. కేసిఆర్ తో భేటీ అనంతరం రమేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను నిన్న (మంగళవారం) అమిత్ షాను కలవలేదని తెలిపారు. తాను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నానని స్పష్టం చేశారు. తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదని చెప్పారు. పార్టీ నేతలతో కలిసి హైదరాబాద్ వచ్చినట్లు తెలిపారు.

AP High Court: 2018 గ్రూప్ -1 మెయిన్స్ పరీక్షలపై ఏపీ హైకోర్టు కీలక తీర్పు ..

Related posts

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Telangana High Court: దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీస్ అధికారులకు ఊరట

sharma somaraju

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Janasena: సింబల్ వివాదంపై కూటమికి స్వల్ప ఊరట

sharma somaraju

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N

Shruti Haasan: శృతి హాసన్ బ్రేక‌ప్ స్టోరీ.. ఆ రీజ‌న్ వ‌ల్లే శాంతానుతో విడిపోయిందా..?

kavya N