NewsOrbit
న్యూస్

ఒంటరినై పోయాను.. ఇక ఏమని అమరావతికి పోను!

మూడు రాజధానులు వద్దని అమరావతిని ఏక రాజధానిగా ప్రకటించాలన్న డిమాండ్తో జగన్ ప్రభుత్వానికి డెడ్లైన్లు విధిస్తున్న చంద్రబాబు భంగపడ్డారు.

ఆయన ఇచ్చిన 48 గంటల గడువు ముగిసి పోయినా ఇప్పటివరకు చంద్రబాబు మళ్లీ ఏమి స్పందించకపోవడం ఇక్కడ గమనార్హం. చంద్రబాబు డెడ్లైన్లను ఎల్లో మీడియా ఎంతగానో ఫోకస్ చేసింది. అయినా ప్రజల్లో ఎటువంటి స్పందనా లేదు. చివరకు టిడిపి శాసనసభ్యులు ప్రాతినిధ్యం వహిస్తున్న గుంటూరు, ప్రకాశం, జిల్లాలలోని నియోజకవర్గాల్లో సైతం అమరావతి కి మద్దతుగా ప్రజలు స్పందించని పరిస్థితి నెలకొంది.

 

చంద్రబాబు అయితే ఏదో చెప్పారు కానీ ఆ పార్టీ ఎమ్మెల్యేలు లేదా ఇతర అగ్రనాయకులు అంత గట్టిగా అమరావతికి మద్దతుగా మాట్లాడలేదు. ప్రకాశం జిల్లాలో ముగ్గురు టిడిపి ఎమ్మెల్యేలు ఉండగా వారు ఎవరూ అమరావతిని వెనకేసుకు రాకపోవడం ఇక్కడ గమనార్హం. ఇదే పరిస్థితి ఏపీ అంతటా కనిపిస్తోందని టిడిపి వర్గాలు చెబుతున్నాయి. పార్టీలోనే మద్దతు కరువయిన చంద్రబాబుపై మరోవైపు వైసిపి వర్గాలు విరుచుకు పడుతున్నాయి. పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చంద్రబాబుపై విరుచుకుపడ్డారు.ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులను రాజీనామా చేయమంటారా? అని బాబు మీద ఆగ్రహం వ్యక్తం చేశారు.

సీఎం జగన్ ఒక్కసారి మాటిస్తే ఆ మాటపై నిలబడే వ్యక్తి అని అన్నారు. ‘వైఎస్సార్ స్ఫూర్తితో ప్రారంభమైన పార్టీ వైసీపీ. మాట తప్పే పార్టీ కాదు మాది. చంద్రబాబు ఏనాడైనా మాట మీద నిలబడ్డారా?’ అని బొత్స ప్రశ్నించారు.’డెడ్ లైన్ ఇచ్చాం స్పందించలేదంటారు… మరి మీరేం చేశారు? ఇవాళ సిగ్గు లేకుండా, తగుదునమ్మా అంటూ వచ్చి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. విశాఖపట్నాన్ని దోచుకున్నది మీరే. ఎంతసేపూ అమరావతిపై రాద్ధాంతం చేయడమేనా మీ పని? ఎవరు కాదన్నారు అమరావతిని? శాసన రాజధాని అని చెప్పాం కదా! చంద్రబాబు స్వార్థ రాజకీయాలకు పాల్పడే వ్యక్తి. చంద్రబాబు గురించి దేశం మొత్తానికి తెలుసు. ఈయన ఇప్పుడో కొత్త పల్లవి మొదలుపెట్టాడు.

లేస్తే 48 గంటల్లో మీ ముందుకు వస్తానంటున్నావు… ఏం చేస్తావు ముందుకొచ్చి? ఇప్పటివరకు ఏం చేశావు? అని ఆయన బాబుని నిలదీశారు. ఇక కాకినాడ వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్రెడ్డి కొద్దిగా ముందుకు వెళ్లి.. అమరావతి సెంటిమెంట్ ఉందని భావిస్తే నీ 23 మంది శాసనసభ్యుల చేత రాజీనామా చేసి ఉప ఎన్నికలకు వెళ్ళు.పోటీకి మేము రెడీ. గతంలో తెలంగాణ సెంటిమెంటు ఉందని భావించిన కేసీఆర్ ఇలాగే చేశాడు.. మాకు నీ సలహాలు అక్కర్లేదు.. నీ పని నువ్వు చేసుకో మంటూ బాబుపై కస్సు మన్నారు. ఇంకోవైపు ‘అమరావతి విషయంలో 48 గంటల డెడ్ లైన్ విధించి ఆ తర్వాత పీచేముడ్ అన్న చంద్రబాబుపై ఏపీ ప్రజలు నెటిజన్లు సెటైర్లు కురిపిస్తున్నారు.

‘గెట్ వెల్ సూన్ చంద్రబాబు’ హ్యాష్ ట్యాగ్ ఇండియా వైడ్ ట్రెండింగ్ లో ఉంది. నెటిజన్లు ఏపీ ప్రజలు మీడియాలో  అంతటా పెద్ద ఎత్తున ఈ హ్యాష్ ట్యాగ్ తో ట్వీట్లు చేస్తూ చంద్రబాబుకు మంటపుట్టిస్తున్నారు. ‘చంద్రబాబు సెల్ఫ్ గోల్’ హ్యాష్ ట్యాగ్  ట్విట్టర్ లో ట్రెండ్ అయ్యింది. చంద్రబాబు వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో ఏపీ ప్రజలు ఉద్యోగులు నెటిజన్లు ట్వీట్లతో దాడి చేస్తున్నారు ఇక ఏపీ వెల్ కమ్ 3 క్యాపిటల్స్ హ్యాష్ ట్యాగ్ సైతం ట్రెండింగ్ లో ఉంది.మొత్తం మీద అమరావతి విషయంలో చంద్రబాబు ఒంటరి అయిపోయాడు. ఇక భవిష్యత్తులో ఆయన డెడ్లైన్లు విధించకపోతేనే పరువైనా మిగులుతుందని టీడీపీ వర్గాలే ఆఫ్ ది రికార్డుగా చెబుతున్నాయి.

 

Related posts

Balakrishna: ఇండ‌స్ట్రీలో బాల‌కృష్ణను `బాలా` అంటూ ముద్దు పేరుతో పిలిచే ఏకైక వ్య‌క్తి ఎవ‌రో తెలుసా?

kavya N

Janasena: జనసేనకు ఝలక్ .. రాత్రికి రాత్రే హెలిప్యాడ్ ధ్వంసం

sharma somaraju

Pawan Kalyan: రాత్రుళ్లు నిద్ర ప‌ట్ట‌క‌పోతే ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎలాంటి ప‌నులు చేస్తాడో తెలుసా.. లీకైన టాప్ సీక్రెట్‌!

kavya N

Vithika Sheru: పెళ్లై 8 ఏళ్లు.. అయినా సంతానం లేరు.. ఫ‌స్ట్ టైమ్ పిల్ల‌ల‌ను క‌న‌క‌పోవ‌డం పై నోరు విప్పిన వితిక!

kavya N

Brazil: బ్రెజిల్ ను అతలాకుతలం చేస్తున్న భారీ వర్షాలు .. కొండచరియలు విరిగిపడి 37 మంది మృతి

sharma somaraju

Road Accident: కెనడాలో ఘోర రోడ్డు ప్రమాదం .. మనవడితో పాటు భారతీయ దంపతులు మృతి

sharma somaraju

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !