ఆడవాళ్లకు ముందుగా చర్మంపై అలాగే కంటి కింద ముడతలు ఏజింగ్ లక్షణం కిందకే వస్తాయి. ఈ సమస్యను తగ్గించుకునేందుకు కొన్ని తేలికగా చేసుకునే చిట్కాల గురించి తెలసుకుందాం..
ముందుగా నిద్రలేమి లేకుండా సరిపడా నిద్ర అనేది పోవాలి. నీరు ఎక్కువగా తాగాలి. అలాగే కళ్ళ మీద ఎక్కువ ఒత్తిడిని పెట్టకండి. కంటి కింద ముడతల సమస్యను అరికట్టడం ద్వారా చర్మ సౌందర్యాన్ని కూడా కాపాడుకోవచ్చు. కాస్తంత కొబ్బరి నూనెను తీసుకుని నిద్రపోయే ముందు ఈ నూనెతో కంటి కింద మసాజ్ చేయడం వలన కంటి కింద ముడతలను అరికట్టవచ్చు.
ఒక టేబుల్ స్పూన్ పెరుగును, ఒక టేబుల్ స్పూన్ తేనెను అలాగే కొన్ని చుక్కల రోజ్ వాటర్ ను తీసుకోవాలి. వీటిని బాగా కలిపి చక్కటి మిశ్రమాన్ని తయారుచేసుకోవాలి. దీన్ని కంటి కింద ముడతలపై అప్లై చేయాలి. పదిహేను నిమిషాల పాటు ఈ మిశ్రమాన్ని అలాగే ఉంచి ఆ తరువాత చల్లటి నీటితో కడిగేసుకోవాలి.
అలోవెరాలో విటమిన్ ‘సి’ మరియు విటమిన్ ‘ఈ’ కూడా లభిస్తాయి.ఇవి చర్మం పటుత్వంగా ఉండేందుకు బాగా తోడ్పడతాయి. అలాగే, చర్మం హైడ్రేటెడ్ గా ఉండేందుకు తోడ్పడతాయి.కాస్తంత నిమ్మరసాన్ని ముడతలపై అప్లై చేయాలి. లేదా అర నిమ్మచెక్కను తీసుకుని కంటి కింద ముడతలపై అప్లై చేయండి. ఇది ఏజింగ్ వలన ఎదురయ్యే కంటి కింద ముడతలను తగ్గించేందుకు తోడ్పడుతుంది.
ఒక టమోటా, ఒక నిమ్మకాయ తీసుకోండి. నిమ్మకాయ రసం, టమోట రసాన్ని బాగా కలపండి. తర్వాత కాటన్‌తో ఈ రసాన్ని కంటి చుట్టూ అప్లై చేయండి. ఈ ప్యాక్‌ని గంటసేపు ఉంచి తర్వాత శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా ఈ ప్యాక్ ని వారానికి ఒక సారి చేస్తే చాలు మెరిసిపోయే కళ్ళు మీ సొంతం అవుతాయి.