NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (సిడిఆర్ఐ) లో ఖాళీలు.. వివరాలు ఇలా..

 

లఖ్ నవూ లోని సీఎస్ఐఆర్ – సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (సిడిఆర్ఐ) లో టెక్నికల్, సపోర్ట్ స్టాఫ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం పలుకుతోంది.. ఆసక్తి అర్హత అభ్యర్థులు ఆన్ లైన్ , ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.. ఈ పోస్టులను రాత పరీక్ష ద్వారా భర్తీ చేయనుంది.. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా..

 

 

మొత్తం ఖాళీలు 55

టెక్నికల్ ఆఫీసర్ అండ్ టెక్నికల్ అసిస్టెంట్ : 42 పోస్టులు

 

అర్హతలు : పోస్ట్ ను అనుసరించి సంబంధిత సబ్జెక్టులలో బిఎస్సి, బీఈ, బీటెక్, డిప్లమో (ఇంజనీరింగ్), ఎంబీఏ ఉత్తీర్ణత . సంబంధిత రంగంలో వృత్తి నైపుణ్యాలు అనుభవం అవసరం.

 

ఎంపిక విధానం :

ట్రేడ్ టెస్ట్ , రాత పరీక్ష ఆధారంగా నియామకం ఉంటుంది. ట్రేడ్ టెస్ట్ లో అర్హత సాధించిన అభ్యర్థుల ను రాత పరీక్షకు పిలుస్తారు. తుది ఎంపిక రాత పరీక్షలో చూపిన ప్రతిభ ఆధారంగా ఉంటుంది.

 

పరీక్షా విధానం :

 

ఈ రాత పరీక్షను 200 మార్కులకు నిర్వహిస్తారు. పరీక్షా సమయం మూడు గంటలు. ఈ పరీక్షను మెంటల్ ఎబిలిటీ , జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ సంబంధిత సబ్జెక్టు నుంచి మొత్తం 200 మార్కులకు నిర్వహిస్తారు.

 

 

టెక్నీషియన్ (సపోర్ట్ స్టాఫ్) :11 పోస్టులు

 

అర్హతలు :

పదో తరగతి, సంబంధిత ట్రేడ్ లో ఐటిఐ ఉత్తీర్ణత. కనీసం రెండేళ్ల అనుభవం తప్పనిసరి.

ఎంపిక విధానం :

ట్రేడ్ టెస్ట్, రాత పరీక్ష ఆధారంగా ఉంటుంది.

పరీక్ష విధానం :

ఈ రాత పరీక్షలో పదవ తరగతి, ఐటిఐ స్థాయిలో 150 ప్రశ్నలు ఉంటాయి . పరీక్ష సమయం 2:30 నిమిషాలు ఉంటుంది.

 

సీనియర్ టెక్నికల్ ఆఫీసర్ : 2 పోస్టులు

 

అర్హతలు:

పోస్ట్ ను అనుసరించి కనీసం 55 శాతం మార్కులతో బివిఎస్ సి అండ్ ఏహెచ్, ఎంబిబిఎస్ ఉత్తీర్ణత. సంబంధిత రంగంలో అనుభవం ఉండాలి.

 

ఎంపిక విధానం :

రాత పరీక్ష , ఇంటర్వ్యూ ఆధారంగా.

 

పరీక్ష విధానం :

ఈ రాత పరీక్షలో మూడు పేపర్లు ఉంటాయి. 200 మార్కులకు నిర్వహిస్తారు. పరీక్ష సమయం మూడు గంటలు ఉంటుంది . ఇందులో మెంటల్ ఎబిలిటీ , జనరల్ అవేర్నెస్ , ఇంగ్లీష్ లాంగ్వేజ్ సంబంధిత సబ్జెక్టుల నుండి ప్రశ్నలు ఉంటాయి.

 

 

దరఖాస్తు విధానం : ఆన్ లైన్, ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

 

దరఖాస్తు ఫీజు : రూ. 100/- ఎస్సీ , ఎస్టీ, పిడబ్ల్యుడి, మహిళా అభ్యర్థులకు ఎటువంటి రుసుము చెల్లించిన అవసరం లేదు.

 

ఆన్ లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 5/2/2021

ఆఫ్ లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 22/2/2021

దరఖాస్తులు పంపించవలసిన చిరునామా :

డైరెక్టర్ సిఎస్ఐఆర్ – సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, సెక్టార్ – 10 , జానకిపురం ఎక్స్టెన్షన్, సీతాపూర్ రోడ్డు, లక్నో – 226031, ఉత్తర ప్రదేశ్, ఇండియా.

author avatar
bharani jella

Related posts

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju