NewsOrbit
5th ఎస్టేట్ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Chandrababu: బాబుగారిలో మరో కోణం..! ఎందుకిలా..?

Chandrababu: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు వ్యవహార శైలి ఇటీవల మార్పు వచ్చింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం వైఎస్ జగన్ పర్యటన గురించి నిన్న చంద్రబాబు మాట్లాడుతూ ఆయన పర్యటనకు జనం తరలివచ్చారు, ఆనందంగా స్వాగతం పలికారు. ఒక మహాతల్లి (పెద్దావిడ) జగన్ వద్దకు వెళ్లి నవ్వుతూ మాట్లాడుతోంది. రాష్ట్రంలో పోలీసులు బాగా పని చేస్తున్నారు. లాయర్ లు బాగుపడుతున్నారు. అసలు వ్యవస్థ ఎటువెళిపోతుంది అంటూ ఆవేదనతో బాధతో చంద్రబాబు కామెంట్స్ చేశారు. చంద్రబాబు ప్రజలనే తప్పు బడుతూ వ్యాఖ్యలు చేస్తున్నారంటూ వైసీపీ ప్రచారం చేస్తోంది. ప్రజలనే తిడుతున్నాడు, ప్రజలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారంటూ చంద్రబాబు వ్యాఖ్యలను వైసీపీ తిప్పికొడుతోంది.

Chandrababu political strategy reverse
Chandrababu political strategy reverse

Chandrababu: సీఎం వెళ్లినప్పుడు ప్రజలు కోప్పడలా ? రాళ్లు వేయాలా ?

చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను ఉన్నది ఉన్నట్లుగా ప్రచారం చేయడానికి ఒక సెక్షన్ మీడియా ఉంది. ఏబీఎన్, ఈటీవీ, టీవీ 5, మహా టీవి లాంటి ఛానల్స్ ఉన్నాయి. చంద్రబాబు వ్యాఖ్యల్లో అంతర్గత ఉద్దేశాలు, లేని ఉద్దేశాలను అపాదించి ప్రచారం చేయడానికి మరో సెక్షన్ మీడియా ఉంది. సాక్షి, టీవి 9, టీవి 10 తదితర ఛానల్స్ లాంటివి. చంద్రబాబు ఏమి మాట్లాడినా అనుకూలంగా చూస్తారు. వ్యతిరేకంగానూ చూస్తారు. కానీ ఉన్నది ఉన్నట్లు ప్రజెంట్ చేసే మీడియాలు లేవు. చంద్రబాబుకు ఇవన్నీ తెలుసు. రాష్ట్రంలో మీడియా పరిస్థితి ఎలా ఉంది. ప్రజలు ఎటువంటి జీవన పరిస్థితిలో ఉన్నారు అనేది. సీఎం వెళ్లినప్పుడు ప్రజలు కోప్పడలా ? రాళ్లు వేయాలా ? మీరు రావద్దు అని నినాదాలు చేయాలా, ఏ ప్రజలు కూడా అలా చేయరు కదా. సీఎం మీద ఎంత వ్యతిరేకత ఉన్నా, కోపం ఉన్నా, బాధ ఉన్నా, ఆవేదన ఉన్నా ఆయన ముందు వ్యక్తం చేయరు కదా. ఎమ్మెల్యేలో, మంత్రులో వెళితే వ్యతిరేకత వ్యక్తం చేసే అవకాశం ఉంటుంది. దర్నాలు, నిరసనలు వ్యక్తం చేస్తారు. కానీ సీఎం వెళ్లినప్పుడు ప్రజలు సాదరంగా స్వాగతం పలుకుతారు. ఏదైనా వరం ఇస్తారనో, అభివృద్ధికి నిధులు ఇస్తారనో, ఇళ్లు కోల్పోయిన వారికి ఏమైనా ఇస్తారనో భావించి స్వాగతం పలుకుతారు. ఆ సమయంలో ప్రజలు లేని ఆనందాన్ని తెచ్చుకుంటారు. ఇది 14 సంవత్సరాలు సీఎంగా చేసిన చంద్రబాబుకు తెలియని విషయం కాదు. సీఎం వెళ్లినప్పుడు ప్రజలు తిరగబడాలని చంద్రబాబు అనుకోవడం తప్పు. సీఎం వచ్చినప్పుడు ప్రజలు తిరగబడే స్థితిలో లేరని అనుకోవచ్చు. ప్రజలను తప్పుబడుతూ చంద్రబాబు వ్యాఖ్యలు చేయడంపై ఆక్షేపణలు వ్యక్తం అవుతున్నాయి.

Chandrababu: బాబుకే అప్రతిష్ట

ఇటీవల అసెంబ్లీలో ఘటన విషయంలోనూ చంద్రబాబు వ్యవహరించిన తీరుపైనా ఆక్షేపణలు వ్యక్తం అయ్యాయి. తనను, తన భార్యను అవమానించారంటూ అసెంబ్లీలో శపథం చేసి బయటకు వచ్చిన చంద్రబాబు, ఆ తరువాత పార్టీ నేతల సమావేశంలో బోరుబోరున విలపించారు. ఆ తరువాత వరద బాధితల పరామర్శకు వెళ్లిన సమయంలోనూ తన సతీమణి భువనేశ్వరిని వైసీపీ ఎమ్మెల్యేలు అవమానించారంటూ బాధితులకు పదే పదే చెప్పారు. అక్కడ సందర్భం వరద బాధితుల పరామర్శ. ఆ సమయంలో చంద్రబాబు అసెంబ్లీ జరిగిన ఘటనను తీసుకురావడంతో ఆయన ఒక రకమైన రాజకీయం చేస్తున్నారనే విమర్శలు వచ్చాయి. చంద్రబాబు సానుభూతి కోసం చేస్తున్న డ్రామాలు అంటూ ప్రత్యర్ధుల నుండి విమర్శలు వచ్చాయి. వరద బాధితుల ఓదార్పునకు వెళ్లి వాళ్ల నుండి ఓదార్పు తీసుకుంటున్నారు అంటూ ప్రత్యర్ధి మీడియా ప్రచారం చేసింది. ఇప్పుడు జనాలను చంద్రబాబు తిడుతున్నారు అంటూ ప్రచారం చేస్తున్నారు. రాష్ట్రం బాగు పడటం లేదని, పరిపాలన బాగోలేదని చంద్రబాబుకు ఆవేదన బాధ ఉండవచ్చు, కానీ ఆ బాధను ప్రజల మీదకు నెట్టేసి వాళ్లను నిందించడం వల్ల అది చంద్రబాబుకే అప్రతిష్ట అని పరిశీలకులు పేర్కొంటున్నారు.

Related posts

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N