పెళ్లి చేసి చూడు, ఇల్లు కట్టి చూడు.. అన్నారు పెద్దలు. ఎందుకంటే.. పెళ్లి చేయడం మామూలు విషయం కాదు.. అలాగే ఈరోజుల్లో ఇల్లు కట్టడం కూడా అంత ఈజీ కాదు. ముట్టుకుంటే లక్షలు.. కోట్లే. ప్రస్తుతం ఇంటి నిర్మాణంలో వాడే మెటిరియల్ ధరలు విపరతంగా పెరగడంతో మధ్య తరగతి కుటుంబాలు సొంతిల్లు కట్టుకోవాలంటే ఒకటికి పదిసార్లు ఆలోచించాల్సి వస్తోంది.

ఇల్లును లక్షలు పోసి నిర్మించడం ఎందుకు.. సింపుల్ గా తయారు చేసుకుంటే పోలా.. అని అనుకున్నాడో ఏమో.. చెన్నైకి చెందిన అరుణ్ ప్రభు అనే యువకుడు ఏకంగా ఆటోనే ఇల్లుగా మార్చేశాడు. ఏదో ఇల్లు ఉందా? అంటే ఉంది.. అన్నట్టుగా కాకుండా.. ఆ ఇంటిని లగ్జరీగా నిర్మించాడు. అందులో బోలెడన్ని సౌకర్యాలను కల్పించాడు అరుణ్ ప్రభు.

ఆ ఆటో ఇంట్లోనే సోలార్ ప్యానెల్స్, కప్ బోర్డ్, కిచెన్, రీడింగ్ రూమ్, బెడ్ రూం… అన్నీ కల్పించాడు. అసలు లోపల నుంచి చూస్తే.. మనం ఉన్నది ఆటోలోనేనా అని అనిపిస్తుంది.
అయితే.. ఈ ఆటో ఇల్లు ముఖ్యంగా ట్రిప్స్ కు ఎటైనా ప్లాన్ చేసుకుంటే బాగా ఉపయోగపడుతుందని అరుణ్ చెబుతున్నాడు. అలాగే.. ఈ ఇంట్లో ఒకరిద్దరు అడ్జెస్ట్ చేసుకొని ఉండొచ్చని చెబుతున్నాడు.

అరుణ్ ప్రభు నిర్మించిన ఆటో ఇల్లుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆటోను ఇల్లుగా ఎలా మార్చాడు? ఎందుకు మార్చాడు? అసలు.. ఆ ఆటో ఇల్లు కథ ఏందో ఇంకాస్త వివరంగా తెలుసుకోవాలంటే మీరు ఈ వీడియో చూడాల్సిందే.