NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

Tamil Nadu : తమిళనాడును ఊపేస్తోన్న చిన్నమ్మ ఫీవర్!సీఎంకి కూడా తప్పని షివర్!!

Tamil Nadu : తమిళనాడులో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. శశికళ జైలు నుంచి విడుదలైన తర్వాత రాజకీయాలు మరింత రసవత్తరగా మారాయి.

Chinnamma fever rocking Tamil Nadu!
Chinnamma fever rocking Tamil Nadu!

ఈనెల 7న బెంగళూరు నుంచి శశికళ చెన్నైకి రానున్న నేపథ్యంలో ఏం జరుగుతుందోనని చర్చలు నడుస్తున్నాయి. ఈనెల 7న జయలలిత సమాధి వద్దకు వెళ్లాలని చిన్నమ్మ నిర్ణయించగా, ఆ కార్యక్రమాన్ని ఎలాగైనా అడ్డుకునేందుకు అధికార అన్నాడీఎంకే విశ్వ ప్రయత్నాలు చేస్తోంది.. ఎట్టి పరిస్థితుల్లో జయలలిత సమాధి వద్దకు శశికళను రానివ్వకూడదనే ఆలోచన చేస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఇందులో భాగంగానే 15రోజులపాటు జయలలిత సమాధి సందర్శనను నిలిపివేస్తున్నట్లు ప్రకటించి చిన్నమ్మకు షాక్‌ ఇచ్చింది తమిళనాడు ప్రభుత్వం.అయితే, ఇందులో ఎలాంటి రాజకీయాలు లేవని, కేవలం సమాధికి తుది మెరుగులు దిద్దడం కోసమే ఈనిర్ణయం తీసుకున్నామని పళని ప్రభుత్వం చెబుతుండగా.. కావాలనే సందర్శన నిలిపివేశారని శశికళ వర్గం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.. ఎట్టి పరిస్థితుల్లో ఆదివారం జయలలిత సమాధి దగ్గరకు వెళ్లి తీరుతామని తెగేసి చెబుతోంది.. అటు ప్రభుత్వం కూడా నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరిస్తోంది.. మొత్తంగా చిన్నమ్మకు చెక్‌ పెట్టేందుకు అన్నాడీఎంకే భారీగానే ఎత్తుగడలు వేస్తున్నట్లు కనిపిస్తోంది.

Tamil Nadu : మరోవైపు భారీ స్వాగత ఏర్పాట్లు!

అటు జైలు శిక్ష అనుభవించి విడుదలైన శశికళకు స్వాగతం పలుకుతూ చెన్నైలో పోస్టర్లు కనిపించడం కలకలం రేపుతోంది.. అన్నాడీఎంకే శాశ్వత ప్రధాన కార్యదర్శి శశికళకు స్వాగతమంటూ ఆ పార్టీ నేత ఏసీ శేఖర్‌ పేరుతో పోస్టర్లు నగరంలో ప్రత్యక్షమయ్యాయి.. అన్నాడీఎంకే నేతల్లో కొందరు చిన్నమ్మ చెంతకు చేరతానే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. మంత్రి జయకుమార్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతంలో పోస్టర్లను చూసి అన్నాడీఎంకే నేతలు తీవ్రంగా చర్చించుకుంటున్నారు.ఇదిలా ఉండగా శశికళ కు ఘనస్వాగతం పలికేందుకు తమిళనాడులోని ఆమె అభిమానులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.కర్నాటక నుంచి బయల్దేరి చిన్నమ్మ తమిళనాడు సరిహద్దుల్లో అడుగు పెట్టగానే అక్కడి నుండి చెన్నై వరకు ఆమె కాన్వాయ్ పై హెలికాప్టర్ల ద్వారా పూల వర్షం కురిపించే ఏర్పాట్లు జరుగుతున్నాయి.మొత్తంగా చూస్తే తమిళనాడు రాజకీయాలను చిన్నమ్మ తీవ్రంగా ప్రభావితం చేసే సూచనలు గోచరిస్తున్నాయి.

 

Related posts

Trisha: లాయ‌ర్ కావాల్సిన త్రిష హీరోయిన్ ఎలా అయింది.. ఆమె ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

Balakrishna: ఇండ‌స్ట్రీలో బాల‌కృష్ణను `బాలా` అంటూ ముద్దు పేరుతో పిలిచే ఏకైక వ్య‌క్తి ఎవ‌రో తెలుసా?

kavya N

Janasena: జనసేనకు ఝలక్ .. రాత్రికి రాత్రే హెలిప్యాడ్ ధ్వంసం

sharma somaraju

Pawan Kalyan: రాత్రుళ్లు నిద్ర ప‌ట్ట‌క‌పోతే ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎలాంటి ప‌నులు చేస్తాడో తెలుసా.. లీకైన టాప్ సీక్రెట్‌!

kavya N

Vithika Sheru: పెళ్లై 8 ఏళ్లు.. అయినా సంతానం లేరు.. ఫ‌స్ట్ టైమ్ పిల్ల‌ల‌ను క‌న‌క‌పోవ‌డం పై నోరు విప్పిన వితిక!

kavya N

Brazil: బ్రెజిల్ ను అతలాకుతలం చేస్తున్న భారీ వర్షాలు .. కొండచరియలు విరిగిపడి 37 మంది మృతి

sharma somaraju

Road Accident: కెనడాలో ఘోర రోడ్డు ప్రమాదం .. మనవడితో పాటు భారతీయ దంపతులు మృతి

sharma somaraju

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?