Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి వరుసపెట్టి సినిమాలు చేస్తున్నారు. కుర్ర హీరోలకు ఏ మాత్రం తీసిపోకుండా.. చిరంజీవి భారీగా సినిమాలను లైన్ లో పెట్టడం జరిగింది. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి “ఆచార్య” అనే సినిమా చేస్తూ ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ దాదాపు తుది దశకు చేరుకుంది. ఇదిలా ఉంటే మలయాళం మూవీ లో సూపర్ సినిమా తెలుగులో చిరంజీవి రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆగస్టు 13వ తారీకు అధికారికంగా ఈ సినిమా స్టార్ట్ అయినట్లు డైరెక్టర్ మోహన్ రాజ తెలిపారు.
ఇటువంటి తరుణంలో రేపు చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా తాజాగా అభిమానులకు సరికొత్త సర్ప్రైస్ రావడం జరిగింది. విషయంలోకి వెళితే లూసిఫర్ తెలుగు రీమేక్ టైటిల్ “గాడ్ ఫాదర్” అని అధికారికంగా సినిమా యూనిట్ ప్రకటించింది. హాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ సినిమా టైటిల్ తో వచ్చిన మూవీ ఆల్టైమ్ సెన్సేషనల్ సృష్టించింది. అటువంటి టైటిల్ చిరంజీవి సినిమాకి పెట్టడంతో ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో.. చిరంజీవి 153 సినిమా “గాడ్ ఫాదర్” సంచలనం రేపుతోంది.
రేపు చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా మెగా అభిమానులు భారీ ఎత్తున సోషల్ మీడియాలో తాజా టైటిల్ నీ వైరల్ చేస్తూ ఉన్నారు. మరోపక్క ఇదే సమయంలో కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమాకి సంబంధించి.. విడుదల తేదీ అధికారికంగా ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ ఆదివారం మెగాస్టార్ చిరంజీవి 66 వ ఏట అడుగుపెడుతున్నారు. ఇటువంటి తరుణంలో హాలీవుడ్ సినిమా టైటిల్ తో చిరంజీవి 153 సినిమా తెరకెక్కడం సంచలనంగా మారింది.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!