Chiranjeevi Block Buster Hits: టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈరోజు చిరంజీవి పుట్టినరోజు కావడంతో మెగా అభిమానులు భారీ ఎత్తున వేడుకలు జరుపుతున్నారు. 66వ ఆటో లోకి చిరంజీవి అడుగుపెట్టడంతో ఇండస్ట్రీలో చాలామంది చిరుకి పుట్టినరోజు విషెస్ తెలియజేస్తున్నారు. సోషల్ మీడియాలో చాలా మంది ప్రముఖులు చిరంజీవికి.. శుభాకాంక్షలు తెలుపుతున్నారు. చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ట్విట్టర్ స్పేస్ సెషన్ కార్యక్రమంలో ఇండస్ట్రీలో కొంత మంది ప్రముఖులు పాల్గొంటున్నారు. చిరంజీవి గురించి వారి వ్యక్తిగత అభిప్రాయాలు తెలియజేయడానికి జరుగుతున్న ఈ కార్యక్రమానికి సుమ కనకాల హోస్ట్ గా రాణిస్తున్నారు. ఈరోజు రాత్రి 7 గంటలకు ఈ స్పెషల్ కార్యక్రమం ప్రసారం కానుంది.
ఇండస్ట్రీ పరంగా ఎన్నో మైలు రాళ్ళు అందుకున్న చిరంజీవి… దాదాపు పు 30 సంవత్సరాల పాటు టాలీవుడ్ బాక్సాఫీస్ నీ శాసించటం మాత్రమే కాక ఎన్నో బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ హిట్ సినిమాలు అందుకోవటం జరిగింది. సినిమాలు సెలెక్ట్ చేసుకోవడం లో అదే రీతిలో వైవిధ్యమైన సినిమాలు చేయడంలో ఎప్పుడూ ముందుండే చిరంజీవి కమర్షియల్ గా తిరుగులేని సినిమాలు చరిత్ర సృష్టించి సినిమాలు నిర్మాతలకి కాసుల వర్షం కురిపించారు. ఈ నేపథ్యంలో చిరంజీవి కెరియర్ లో తిరుగులేని ఇండస్ట్రీ హిట్ అయిన సినిమాల లిస్టు పై ఒక లుక్ ఏద్దం.
చిరంజీవి ఇండస్ట్రీ హిట్ మూవీ లిస్ట్ :-
చిరంజీవి కెరీర్ లో మొట్టమొదటి ఇండస్ట్రీ హిట్ సినిమా ఖైదీ. ఈ సినిమాలో చిరంజీవి చేసిన యాక్షన్ కి కమర్షియల్ క్రేజ్ ఏర్పడటం మాత్రమే కాక ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరో స్థానాన్ని అందుకున్నారు. ఆ తరువాత.. రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఘరానా మొగుడు..తో కూడా ఇండస్ట్రీ హిట్ అందుకొని దాదాపు అప్పట్లో 10 కోట్ల షేర్ సాధించి సరికొత్త రికార్డు సృష్టించారు. ఇక గ్యాంగ్ లీడర్ సినిమా తో కూడా 7 కోట్ల షేర్ సాధించడం జరిగింది. జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమాతో కూడా ఇండస్ట్రీ హిట్ అందుకున్నారు. అత్తకి యముడు అమ్మాయికి మొగుడు, యముడికి మొగుడు, పసివాడి ప్రాణం… తోపాటు 2002లో ఇంద్ర సినిమా తో… టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర తిరుగులేని రికార్డులు సృష్టించి .. తన స్టామినా ఏంటో ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ కి తెలియజేసేలా చిరంజీవి రాణించారు.
కష్టపడితే.. సింహాసనాలు మీద కూర్చో వచ్చు అనేదానికి రోల్ మోడల్ :-
ప్రస్తుతం చేస్తున్న సినిమాలు కూడా చాలావరకూ.. ఇండస్ట్రీలో చరిత్ర తిరగరాసిన సినిమాలు అని సినీ విశ్లేషకులు అంటున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య, అదే రీతిలో గాడ్ ఫాదర్… మరికొన్ని సినిమాలు.. టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర మ్యాజిక్ సృష్టించడం గ్యారెంటీ అని అంచనా వేస్తున్నారు. ఏది ఏమైనా ఈ రోజు చిరంజీవి పుట్టినరోజు కావడంతో.. ఇండస్ట్రీలో ఒక్కడిగా అడుగుపెట్టి పెద్ద వృక్షం గా మారి.. అనేక మందికి స్ఫూర్తినిస్తూ.. కష్టపడితే.. సింహాసనాలు మీద కూర్చో వచ్చు.. అనేదానికి ఉదాహరణగా నిలిచి.. తన కుటుంబంలో అనేక మంది కి లైఫ్ ఇవ్వటంతో పాటు సమాజానికి అనేక రీతులుగా ఎన్నో మంచి పనులు చేస్తూ.. ఉండటంతో.. చిరంజీవికి సోషల్ మీడియాలో నెటిజన్లు అదే రీతిలో సెలబ్రిటీలు భారీ ఎత్తున ఆయన కృషిని కొనియాడుతూ.. పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!