Yoga: ఈ మధ్య కాలంలో అందరికీ ఫిట్ నెస్ మీద బాగా శ్రద్ధ పెరిగింది. అందులో భాగంగా యోగాసనాలు వేయడానికి ఎక్కువ శ్రద్ధ పెడుతున్నారు. ఆసనాలు వేయడానికి నేల గట్టిగా ఉండి ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి మ్యాట్ కచ్చితం గా ఉండాలి. ఐతే చాలామంది యోగ మాట్ ని ఆన్ లైన్ లో కొంటున్నారు . యోగ మ్యాట్ మీద అసలు అవగాహన లేకుండా యోగా మ్యాట్ అని సెర్చ్ చేసి కొనుగోలు చేస్తున్నారు. అయితే ఇది కరెక్ట్ కాదు కొనడానికి కొన్ని లెక్కలున్నాయి అంటున్నారు నిపుణులు.
మీరు ఎంత వెయిట్ ఉన్నారు , మీరు వేసే యోగాసనాలు బట్టి మ్యాట్ ని సెలెక్ట్ చేసుకోవాలి .
యోగ మ్యాట్ కొంచెం మందంగా ఉంటే ఎక్కువ రోజులు మన్నిక ఉండడం తో పాటు కొన్ని రకాల ఆసనాల కి అనుకూలం గా ఉంటుంది. మ్యాట్ పలుచగా ఉంటే ఆసనాలు వేసే సమయంలో మోకాళ్ళపై బరువు ఎక్కువగా పడుతుంది. అందుకే మందం గా ఉన్న మ్యాట్ ను మాత్రమే వాడాలి.మ్యాట్ మందం 8 ఎమ్ఎమ్ నుండి 12 ఎమ్ఎమ్ వరకు ఉండాలి.అన్ని యోగాసనాల కి బాగా పని చేయాలి అంటే మాత్రం 10 ఎమ్ఎమ్ ని మించి ఎక్కువ మందంగా ఉన్న యోగ మ్యాట్ కొనుక్కోవాలి .ఇక సైజు విషయానికి వస్తే మీ ఎత్తు, వెడల్పు బట్టి యోగా మ్యాట్ సెలెక్ట్ చేసుకోవాలి. యోగ మ్యాట్ లలో 6 X 2 అడుగుల వి ఎక్కువగా దొరుకుతుంటాయి . కానీ మీ భుజాల వెడల్పు ఎక్కువగా ఉంటే 7 X 2.5 అడుగుల మ్యాట్ తీసుకోవడం మంచిది.
గ్రిప్ ఎక్కువగా ఉన్న మ్యాట్ అయితే కొత్తగా యోగ చేయడం మొదలు పెట్టిన వారికి అనుకూలం గా ఉంటుంది. కొన్ని సార్లు ఆసనాలు చేసేటప్పుడు కింద పడడం అనేది జరుగుతూ ఉంటుంది. అలాంటప్పుడు రక్షణ గా గ్రిప్స్ ఎక్కువగా ఉన్న మ్యాట్ తీసుకోవాలి.ఆ మ్యాట్ తయారు చేయడానికి ఉపయోగించిన మెటీరియల్ కూడా దృష్టిలో పెట్టుకోవాలి . ఈ విషయాల గురించి బాగా తెలుసుకున్నాక యోగ మ్యాట్ కొనుక్కోవాలి.