ప్రఖ్యాత భారతీయ శాస్త్రవేత్త హూమీ జహంగీర్ భాభా, భారత మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి మరణాలపై అమెరికన్ ఇంటెలిజెన్స్ ఏజన్సీ (సీఐఏ) పాత్ర ఉందనే వాదనలు ఎప్పటి నుండో వినబడుతున్నాయి. అయితే ఈ ఇద్దరి మరణాలపై అమెరికా ప్రఖ్యాత రచయిత గ్రెగోరీ డగ్లోస్ తను రచించిన “కాన్వర్సేషన్ విత్ ది క్రో” అనే పుస్తకంలో సంచలన విషయాలను వెల్లడించడంతో ఇది హాట్ టాపిక్ అయ్యింది. హుమీ జహంగీర్ భాభా, లాల్ బహదూర్ శాస్త్రిలను తమ ఆధ్వర్యంలోనే హత్య జరిగినట్లు రాబర్ట్ క్రోలీ పేర్కొన్నట్లు ఈ పుస్తకంలో ప్రచురించారు. హత్యలు జరిగే సమయంలో రాబర్ట్ క్రోలీ సీఐఏ డైరెక్టరేట్ ఆఫ్ ఆపరేషన్స్ బాధ్యతలు నిర్వహించారు. రాబర్ట్ క్రోలీ వెల్లడించిన విషయాలను రచయిత డగ్లోస్ పుస్తకంలో రాసుకొచ్చారు. ఇప్పుడు రాబర్ట్ ప్రకటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
గోవులను ప్రేమించే భారతీయులు తాము ఎంతో తెలివైనవారమనీ, ప్రపంచంలో గొప్ప శక్తిగా మారబోతున్నామని గొప్పగా చెప్పుకునే వారినీ, తాము భారతీయులు స్వయం సంవృద్ధి సాధించాలని కోరుకోలేదని రాబర్ట్ క్రోలీ తమ స్టేట్ మెంట్ లో పేర్కొన్నాడు. హూమీ భాభా మరణించిన సమయంలో ఎయిర్ ఇండియాకు చెందిన కమర్షియల్ ఎయిర్ క్రాప్ట్ లో వియన్నా వెళుతున్నారని రాబర్ట్ చెప్పారు. తాను ఆయన మరణం గురించి.. విమానంలో ప్రయాణీకుల గురించి చింతించలేదనీ, ఎందుకంటే ఆ విమానంలో తన సొంత మనుషులు ఉంటే బాధపడతానన్నారు. వియన్నాలోనే భాభాను హత్య చేయవచ్చు కానీ తాము ఎత్తైన పర్వతాన్ని ఎంచుకున్నామనీ ఎందుకంటే విమానం విస్పోటనం తర్వాత అది ముక్కలు అవ్వడానికి మంచి ప్రదేశం అని తాము నిర్ణయించుకున్నామని రాబర్ట్ పేర్కొన్నారు.
లాల్ బహదూర్ శాస్త్రి కూడా అవు ప్రేమికుడే. భారతీయులు స్వయంగా బాంబు తయారు చేసేందుకు ప్రణాళికతో ముందుకు వెళుతున్నారు. భారతీయులు తమ శత్రువైన పాక్ పై దాడి చేస్తే .. అంటూ తాము ఆలోచించినట్లు రాబర్ట్ పేర్కొన్నారు. డాక్టర్ హుమీ జహంగీర్ భాభా భారత అణు కార్యక్రమానికి పితామహుడు. భారతదేశంలో ఆటమిక్ ఎనర్జీ కార్యక్రమాన్ని రూపొందించడమే కాక అణుశక్తిని పెంపొందించుకునేలా అవసరమైన అనేక చర్యలు తీసుకువచ్చారు. హూమీ భాభా వేసిన పునాదులతోనే ఇండియాలో అణుశక్తి ని కల్గి ఉండే మార్గం ఏర్పడింది. 1957 లో ముంబాయి సమీపంలోని ట్రాంబేలో మొదటి అణు శక్తి కేంద్రాన్ని స్థాపించారు. 1966 జనవరి 24న విమాన ప్రమాదంలో హూమీ భాభా మరణించారు. ఆయన మరణానంతరం 1967 లో ట్రాంబేలో నెలకొల్పిన అణు పరిశోధనా కేంద్రాన్ని భాభా ఆటామిక్ రీసెర్చ్ సెంటర్ గా మార్చారు.
తులసి పక్కకి వచ్చి నందు కూర్చుని హాయ్ మామ్ గుడ్ ఈవెనింగ్ అంటాడు తులసి ఏం మాట్లాడుకోకుండా సైలెంట్ గా ఉంటుంది మొన్న ఒక న్యూస్ పేపర్…
వచ్చేవారం మెగాస్టార్ చిరంజీవి జన్మదినం సందర్భంగా మెగా ఫాన్స్ రకరకాల కార్యక్రమాలు నిర్వహించడానికి రెడీ అవుతున్నారు. గత రెండు సంవత్సరాలు కరోనా కారణంగా పెద్దగా జరపలేదు. అయితే…
ఆగస్టు 19 – శ్రావణమాసం - శుక్రవారం మేషం దైవ చింతన పెరుగుతుంది.ఉద్యోగవిషయమై అధికారులతో చర్చలు ఫలిస్తాయి.ఇంటా బయట కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి. వృత్తి వ్యాపారాలలో…
టాలీవుడ్ టాప్ డైరెక్టర్ల లిస్ట్ తీస్తే.. అందులో పూరి జగన్నాథ్ పేరు ఖచ్చితంగా ఉంటుంది. దూరదర్శన్లో అసిస్టెంట్ డైరెక్టర్గా కెరీర్ ప్రారంభించి పూరి జగన్నాథ్.. ఆ తర్వాత…
టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ త్వరలోనే `లైగర్` మూవీతో ప్రేక్షకులను పలకరించబోతున్న సంగతి తెలిసిందే. బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్…
"లైగర్" సినిమా మరో వారం రోజుల్లో విడుదల కానుంది. ఇటువంటి తరుణంలో తాజాగా సెన్సార్ బోర్డ్ "లైగర్" ఊహించని షాక్ ఇచ్చింది. విషయంలోకి వెళ్తే సెన్సార్ బోర్డ్…