NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ బిగ్ స్టోరీ

AP PRC: జగన్ వరమా.. శాపమా..!? వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు..!?

cm jagan announce prc

AP PRC: కొన్ని నెలలుగా చర్చల్లో ఉన్న పీఆర్సీని ఎట్టకేలకు సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. 23.29 శాతం పీఆర్సీని ప్రకటించారు. సీఎం ప్రసంగంలోని ముఖ్యాంశాల్ని పరిశీలిస్తే.. ‘కోవిడ్ కారణంగా మరణించిన కుటుంబాల వారికి జూన్ 30 లోగా కారుణ్య నియామకాలు చేపడతాం. EHS సమస్యలపై 2 వారాల్లోపు మెరుగైన పరిష్కారం అందిస్తాం. MIG కాలనీల్లో 10% ఇల్లు కేటాయిస్తాం.. 20% రిబెట్ ఇస్తాం. జూన్ 30 లోగా సచివాలయ ఉద్యోగులకు ప్రొబేషనరీ పూర్తి చేస్తాం. జులై నుండి నూతన స్కేల్స్ ఇస్తాం. PF, APGLI పెండింగ్ బకాయిలు ఏప్రిల్ లోపు పూర్తి చేస్తాం. పెండింగ్ డీఏలను జనవరి జీతం నుండే అమలు చేస్తాం. జనవరి 2022 నుండి నూతన PRC అమలు చేస్తాం. 2020 ఏప్రిల్ నుండి మానిటరీ బెనిఫిట్ అమలు. కేంద్ర ప్రభుత్వం తరహాలో ఇకపై PRC ప్రక్రియ పదేళ్లకోసారి అమలు. (AP PRC) పీఆర్సీ అమలుతో రాష్ట్రంపై 10,247 కోట్ల అదనపు భారం పడుతోంది. ప్రభుత్వోద్యోగుల పదవీ విరమణ వయస్సు 60 నుంచి 62 సంవత్సరాలకు పెంపు. CPS మీద జూన్ 30 లోగా మంచి నిర్ణయం తీసుకుంటాం’ అని అన్నారు. అయితే..

cm jagan announce prc
cm jagan announce prc

పదవీ విరమణ వయసు పెంపు..

ప్రభుత్వోద్యోగుల పదవీ విరమణ వయసును 60 నుంచి 62కి పెంచిన ప్రభుత్వం.. నిరుద్యోగులకు చేదు వార్త చెప్పిందనే చెప్పాలి. ఉద్యోగ ప్రకటనల కోసం ఎదురు చూసే వారికి ప్రభుత్వం ఏం సమాధానం చెప్తుందో చూడాల్సి ఉంది. గతంలో టీడీపీ ప్రభుత్వం ఉద్యోగుల పదవీ విరమణ వయసును 58 నుంచి 60కి పెంచితే.. ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం 60 నుంచి 62కి పెంచింది. ఈసారి ఈ పరిమితిని 65కి పెంచితే నిరుద్యోగుల సమస్య మరింత జటిలమవుతుందనే చెప్పాలి. (AP PRC) ఉద్యోగులను ప్రసన్నం చేసుకునేందుకు.. హెచ్ఆర్ఏ తగ్గింపు, ఎరియర్స్ ఇచ్చే అవసరం ఉండదు కాబట్టే ఈ నిర్ణయం తీసుకున్నారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. 

వాళ్లకేం సమాధానం చెప్తారో..

సీఎం వరాలతో ఉద్యోగ సంఘాలు కొంత తగ్గినా ఊహించనివి దక్కాయని సంతోషంగా ఉన్నట్టు తెలుస్తోంది. అయితే.. ఈ నిర్ణయంతో నిరుద్యోగం పెరుగుతుందనేది వాస్తవం. ఉన్నవారికి పదోన్నతులు రావు. ఇప్పటికే జాబ్ క్యాలెండర్ ప్రకటనతో రాష్ట్ర ప్రభుత్వం విమర్శలు ఎదుర్కొంది. (AP PRC) ఉద్యోగులను సంతృప్తి పరచినా.. నిరుద్యోగులు అసంతృప్తికి గురైతే మాత్రం ప్రభుత్వం ఏం సమాధానం చెప్తుందో చూడాల్సిందే.

 

author avatar
Muraliak

Related posts

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju