NewsOrbit
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

CM Revanth Reddy: బీఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ లో చేరనున్న కీలక నేత ..? కేసీఆర్ బాటలోనే రేవంత్ ఆట స్టార్ట్ చేసినట్లుంది(గా)..!

CM Revanth Reddy: పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీఆర్ఎస్ కు ఊహించని షాక్ తగిలింది. ఇప్పటికే ఒక్కరొక్కరుగా పార్టీ కీలక నేతలు, సిట్టింగ్ లు కారు దిగి కాంగ్రెస్ గూటికి చేరుతుండగా, తాజాగా పార్టీ కీలక నేత, మాజీ మంత్రి ..కేసిఆర్ కు బైబై చెప్పేందుకు సిద్దమవ్వడం రాష్ట్ర రాజకీయ  వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది.

మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి, ఆయన సతీమణి, ప్రస్తుత వికారాబాద్ జడ్పీ చైర్ పర్సన్ సునీతారెడ్డి గురువారం రాత్రి సీఎం రేవంత్ రెడ్డి తో భేటీ అయ్యారు. దుశ్సాలువాతో సత్కరించి బొకే అందజేసి అభినందనలు తెలియజేశారు.  మహేందర్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికలకు ముందే బీఆర్ఎస్ కు రాజీనామా చేసి కాంగ్రెస్ గూటికి చేరతారని ప్రచారం జరిగింది. తన సోదరుడు, కొడంగల్ బీఆర్ఎస్ అభ్యర్ధి పట్నం నరేందర్ రెడ్డితో కలిసి కాంగ్రెస్ పార్టీకి వెళతారని ప్రచారం జరిగింది.

ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో మహేందర్ రెడ్డికి తాండూరు టికెట్ ఇవ్వకుండా పైలట్ రోహిత్ రెడ్డికి కేటాయించడంతో మహేందర్ రెడ్డి తీవ్ర అసంతృప్తికి గురైయ్యారు. ఆ కారణంగా ఎన్నికల్లోనూ అంటీముట్టనట్లుగా వ్యవహరించారు. పట్నం ఫామిలీ కాంగ్రెస్ పార్టీలో చేరితే జడ్పీ చైర్ పర్సన్ గా ఉన్న సునీతా రెడ్డిని చేవెళ్ల లోక్ సభ అభ్యర్ధిగా ప్రకటించాలని కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేస్తొందని సమాచారం. ఈ దంపతుల చేరికకు రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ప్రచారం జరుగుతోంది. కొడంగల్ లో రేవంత్ రెడ్డి నిర్వహించే భారీ బహిరంగ సభలో సీఎం సమక్షంలో పట్నం మహేందర్ రెడ్డి, సునీతా రెడ్డి కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకునే అవకాశం ఉందని అంటున్నారు.

ఇప్పటికే సిట్టింగ్ ఎంపీ వెంకటేశ్ బీఆర్ఎస్ కు బైబై చెప్పి కాంగ్రెస్ గూటికి చేరి బిగ్ షాక్ ఇచ్చారు. ఈ షాక్ నుండి బీఆర్ఎస్ తేరుకోకముందే ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఆర్ధికంగా, రాజకీయంగా బలమైన నేతగా ఉన్న పట్నం మహేందర్ రెడ్డి ఫ్యామిలీ పార్టీని వీడితే బీఆర్ఎస్ కు బిగ్ షాక్ గానే భావించాల్సి ఉంటుంది. గతంలో కేసిఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కాంగ్రెస్ పార్టీని బలహీన పర్చేందుకు సిట్టింగ్ ఎమ్మెల్యేలు, కీలక నేతలను పార్టీలో చేర్చుకున్నారు.

రేవంత్ సర్కార్ పూర్తి కాలం నిలబడలేదని, తెలంగాణలో కాంగ్రెస్ పడిపోతుందని విపక్షాలు విమర్శిస్తుండగా, రేవంత్ అలర్ట్ అయినట్లుగా తెలుస్తొంది. నీవు నేర్పిన విద్యే నీరజాక్ష అన్నట్లు గతంలో కేసిఆర్ అనుసరించిన ఫార్ములానే ఇప్పుడు రేవంత్ పాటిస్తున్నారని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. లోక్ సభ ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే నేతలు ఒక్కరొక్కరుగా కాంగ్రెస్ పార్టీలోకి చేరుతుండటంతో నోటిఫికేషన్ వెలువడిన తర్వాత వలసలు మరింత ఊపందుకుంటాయనే టాక్ నడుస్తొంది. అనేక మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారంటూ కీలక కాంగ్రెస్ నేతలు అంటూనే ఉన్నారు.

India Today Survey: ఇండియా టుడే ‘మూడ్ ఆఫ్ ది నేషన్’ సర్వే ..ఏపీలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు అంటే..?

Related posts

Brazil: బ్రెజిల్ ను అతలాకుతలం చేస్తున్న భారీ వర్షాలు .. కొండచరియలు విరిగిపడి 37 మంది మృతి

sharma somaraju

Road Accident: కెనడాలో ఘోర రోడ్డు ప్రమాదం .. మనవడితో పాటు భారతీయ దంపతులు మృతి

sharma somaraju

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju