NewsOrbit
న్యూస్ బిగ్ స్టోరీ

ఐఏఎస్ ల అవినీతి ఆకలి… మరో ఐఏఎస్ బలి…!

AP Latest news: Highly Corruption by Minister Shade

సీఎం జగన్ చెబుతున్నదేమిటి…? అవినీతి రహిత పరిపాలన…!

కొందరు నాయకులూ… అధికారులూ చేస్తున్నదేమిటి…?? అవినీతి సహిత పాలన…!

సీఎం ఆశయానికి చేదోడుగా నిలవాల్సిన ఐఏఎస్ లు కూడా అవినీతికి తెర తీస్తుండడం… ఓ సీనియర్ ఐఏఎస్ అధికారిని మరణించడం … ప్రభుత్వానికి మచ్చగా మారి… కేంద్రం నుండి కూడా నిఘా పెరిగేలా చేసింది… ఈ అవినీతి వ్యవహారంపై “న్యూస్ ఆర్బిట్” అందిస్తున్న ప్రత్యేక కథనం ఇది.

పది రోజుల కిందట ఓ ఐఏఎస్ అధికారిని చనిపోయారు. పోస్టింగు లేక, ఇద్దరు సీనియర్ అధికారుల తీవ్ర వేధింపులు, ఒత్తిళ్లు తట్టుకోలేక ఒత్తిడితో అనారోగ్యానికి గురై మరణించారు. ఆమె మరణం తర్వాత కొన్ని కీలక అంశాల బయటకు వస్తున్నాయి. ఆమె ఓ బ్రాహ్మిణ్… ఆమె మరణానికి కారణాలు వివరిస్తూ ఆమె సోదరుడు తెలంగాణాలో ఉండే ఓ బిజెపి పెద్దకి చెప్పారు. ఆయన కేంద్రంలో ఐఏఎస్ ల వ్యవహారాలూ చూసే డీవోపీటీ (డిపార్ట్మెంట్ అఫ్ పర్సనల్ ట్రైనింగ్) కి పిర్యాదు చేసారు. అందులో కొన్ని కారణాలు స్పష్టంగా పేర్కొన్నారు. ఆమె మరణానికి దారి తీసిన పరిస్థితులు, జగన్ ప్రభుత్వంలో కొందరు ఐఏఎస్ లు వ్యవహరిస్తున్న తీరుని వివరించారు. దీనిపై కేంద్రం సీరియస్ గా రియాక్ట్ అయింది.

నెలకు లక్ష ఇవ్వాలట… భార్యకు కారు బిల్లులు కట్టాలట…!

డీవోపీటీ కి చేరిన ఫిర్యాదులో సారాంశం ఏమిటంటే…! “ఆమెకి ఆరు నెలల నుండి పోస్టింగు లేదు. వాణిజ్య పన్నుల శాఖలో పని చేసే ఆమెను బదిలీల సమయంలో పక్కన పెట్టారు. పోస్టింగు కోసం ఆమె జగన్ పేషీలోని ఓ కీలక అధికారి వద్దకు వెళ్లారు. అందుకు ఆయన “ఆఫీస్ నిర్వహణ ఖర్చుల కోసం నెలకు రూ. లక్ష ఇవ్వాలి అని కండిషన్ పెట్టారట. ఆమె అంగీకరించలేదు. అంతకు ముందు మరో అధికారి (ఆమె పని చేసే శాఖ ఉన్నతాధికారి) “మా భార్య ఢిల్లీ వెళ్లారు. కారు బిల్లులు, రూమ్ బిల్లులు చెల్లించాలి.” అంటూ అడిగారట. ఆమె అంగీకరించలేదు. అసలే బ్రాహ్మిణ్ సామాజికవర్గం, మంచి అధికారిణిగా పేరుంది. అందుకే అవినీతికి అంగీకరించకుండా లోలోపల కుంగిపోయింది. చివరికి ఒత్తిళ్లకు తట్టుకోలేక మరణించారు. ఇక్కడ మనం చెప్పుకున్న సీఎం పేషీలో కీలక అధికారి గుర్తు పెట్టుకోండి. ఆయన మరిన్ని లోలోపలి వ్యవహారాలు మరో సందర్భం చూసుకుని పూర్తిగా చెప్పుకుందాం.

బిజెపి సీరియస్… అధికారుల మార్పు…

ఈ విషయం బిజెపి పెద్దలకు చేరడంతో సీరియస్ గా స్పందించారు. ఉన్నట్టుండి 30 మంది ఐ ఎఫ్ ఎస్ అధికారులకు ఏపీలో పోస్టింగు ఇచ్చేసారు. వీరిలో కొందరు నిఘా అధికారులు గానూ, కేంద్ర పెద్దలకు సమాచారం ఇచ్చేలా ఉన్నారని తెలుస్తుంది. కేంద్ర నిఘా సంస్థల ద్వారా కూడా రాష్ట్రంలోని కొందరు అధికారుల పని తీరుపై నివేదికలు తెప్పించుకున్నారట. ఇదే తీరు కొనసాగితే సీఎం జగన్ ప్రమేయం లేకుండానే కొందరి మార్పులు జరిగినా ఆశ్చర్యం అవసరం లేదు.

జగన్ అప్రమత్తమవ్వాల్సిన సమయం…!

సీఎం జగన్ పదే పదే అవినీతి రహిత పాలన అంటున్నారు. ఆయన ఆశయంతో వెంట నడవాల్సింది ఐఏఎస్ లే. ఏ ముఖ్యమంత్రికి అయినా తన లక్ష్యాలకు అనుగుణంగా పని చేసే అధికారులు (ఐఏఎస్ ఐపీస్) లు ఉంటేనే అనుకున్నది జరుగుతుంది. కానీ ఇటువంటి అవినీతి మరకలు ఉన్న అధికారులను పక్కన పెట్టుకుని సీఎం మంత్రం ఏం చేయగలరు…? కోర్టులు, విపక్షాలు, కొందరు సీనియర్ నాయకులు అందరూ ఏకమై ముప్పేట దాడులు చేస్తున్న సమయంలో జగన్ కి తోడు, నీడగా ఉండాల్సింది బ్యూరోక్రసీ అధికారులే. జగన్ ఆశయం నిజమైనది అయితే.., ఆయన అవినీతి రహితం అంటున్న మాట అంతఃకరణ శుద్ధితో వస్తే… వెంటనే తన పేషీలోని అవినీతిపై ద్రుస్తి పెట్టాల్సిందే… లేకుంటే మరి కొంత మంది మంచి అధికారులు అసువులు బాసక తప్పదేమో.

Related posts

Rajamouli-NTR: ఆ ఇద్ద‌రే నా ఫ్రెండ్స్‌.. ఎన్టీఆర్ కానే కాదు.. సంచ‌ల‌నంగా మారిన రాజ‌మౌళి కామెంట్స్‌!

kavya N

AP Elections: తూర్పు గోదావరి జిల్లాలో భారీగా నగదు పట్టివేత

sharma somaraju

డ్యామ్ షూర్‌గా గెలిచే ఖ‌మ్మం ఎంపీ సీట్లో కాంగ్రెస్ ఓడుతోందా… అస‌లేం చేస్తున్నారు..?

ఎన్నికల తర్వాత ప్ర‌జారాజ్యం రూట్లోకే జ‌న‌సేన కూడా… నీరు గార్చేసిన ప‌వ‌న్‌…?

సీఎం జగన్ బిగ్ స్కెచ్.. షర్మిలకు అది కూడా కష్టమే ?

మంగళగిరిలో లోకేష్‌కు మ‌ళ్లీ క‌ష్ట‌మ‌వుతోందా… ఓట‌ర్లు ఇంత పెద్ద షాక్ ఇవ్వ‌బోతున్నారా ?

Hari Hara Veera Mallu: హరిహర వీరమల్లు నుంచి త‌ప్పుకున్న క్రిష్‌.. డైరెక్ట‌ర్ గా జ్యోతికృష్ణకు బాధ్య‌త‌లు.. అస‌లెవ‌రిత‌ను?

kavya N

విశాఖ‌లో భ‌ర‌త్‌కు రెండో ఓట‌మి రాసి పెట్టుకోవ‌చ్చా ?

BSV Newsorbit Politics Desk

YSRCP: నేడు జగన్ ప్రచారానికి విరామం ..ఎందుకంటే..?

sharma somaraju

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?