21.2 C
Hyderabad
December 8, 2022
NewsOrbit
జాతీయం న్యూస్ సినిమా

ఢిల్లీ కోర్టులో బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కి ఊరట.. మధ్యంతర బెయిల్ పొడిగింపు

Share

మనీ లాండరింగ్ కేసులో నిందితురాలిగా ఉన్న ప్రముఖ బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కు ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టులో స్వల్ప ఊరట లభించింది. జాక్వెలిన్ బెయిల్ ను న్యాయస్థానం వచ్చే నెల 10వ తేదీ వరకు పొడిగించింది. రూ.200 కోట్ల మనీలాండరింగ్ కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న సుఖేశ్ చంద్రశేఖర్ నుండి జాక్వెలిన్ ఫెర్నాండేజ్ రూ. 7 కోట్ల విలువైన వస్తువులను బహుమతులుగా అందుకున్నారని ఈడీ పేర్కొని ఆమెను విచారణ చేసింది. ఈ కేసులో ఆమె ప్రస్తుతం తాత్కాలిక బెయిల్ పై బయట ఉన్నారు.

Jacqueline Fernandez

 

గత నెల 26వ ఈ కేసులో ఆమెకు కోర్టు మద్యంతర బెయిల్ మంజూరు చేసింది. అయితే బెయిల్ గడువు ముగుస్తున్న నేపథ్యంలో జాక్వెలిన్ ఫెర్నాండేజ్ ఇవేళ తన న్యాయవాది ప్రశాంత్ పాటిల్ తో కలిసి పాటియాలా హౌస్ కోర్టుకు హాజరయ్యారు. రెగ్యులర్ బెయిల్ పిటిషన్ ను వచ్చే నెల 10వ తేదీన విచారణ జరుపుతామని న్యాయస్థానం పేర్కొంది. అప్పటి వరకు తాత్కాలిక బెయిల్ ను పొడిగిస్తున్నట్టు తెలిపింది. కేసులో నిందితులకు చార్జిషీటు కాపీలను అందజేయాలని ఈడీకి కోర్టు ఆదేశించింది. బెయిల్ పొడిగింపుతో జాక్వెలిన్ ఫెర్నాండేజ్ కు స్వల్ప ఊరట లభించినట్టయింది.


Share

Related posts

కమలం గూటికి దివ్యవాణి..? ఈటలతో భేటీ అందుకే(నా)..!

somaraju sharma

ఫిబ్రవరి 22న ‘మిఠాయి’

Siva Prasad

AP Police : పోలీసులకు చెమటలు పట్టిస్తున్న న్యూస్ ఇది..! శిరోముండనం బాధితుడు ఏమైనట్టు..!?

Yandamuri