విక్టరీ వెంకటేష్ సినిమాలన్నిటిలోనూ ఘర్షణ సినిమా అభిమానులను బాగా ఎంటర్టైన్ చేసిందని చెప్పవచ్చు. ఘర్షణ సినిమాలో సీరియస్ అండ్ స్టైలిష్ పోలీస్ ఆఫీసర్‌గా వెంకటేష్ కనిపించి కేక పుట్టించాడు. ఘర్షణ సినిమా కంటే ముందు చాలా సినిమాల్లో వెంకటేష్ పోలీస్ అవతారం ఎత్తిన కూడా ఘర్షణ సినిమాకు వచ్చినంత క్రేజ్ మరే సినిమాకి రాలేదు. తమిళ బ్లాక్ బస్టర్ కాకాకాకా సినిమాని 2004లో స్టార్ డైరెక్టర్ గౌతమ్ మీనన్ తెలుగులో ఘర్షణగా తెరకెక్కించారు. ఈ కాప్ డ్రామా ఆయనకు స్పెషల్ మూవీగా నిలిచిపోయింది. ప్రస్తుతం ఆ సినిమా వచ్చి 18 ఏళ్లు దాటింది. అయినా కూడా ప్రేక్షకులు ఆ సినిమాకు సీక్వెల్ కావాలని ఇప్పటికీ డిమాండ్ చేస్తున్నారు.
ఘర్షణ 2 కచ్చితంగా ఉంటుంది
తాజాగా గౌతమ్ మీనన్, వెంకీతో కలిసి ఘర్షణ 2 తీసుకురానున్నట్లు క్లారిటీ ఇచ్చారు. ఇటీవలే ఘర్షణ సినిమా సీక్వెల్ కోసం విక్టరీ వెంకటేష్‌ను కలిసానని, వెంకీ సానుకూలంగా స్పందించారని.. భవిష్యత్తులో ఘర్షణ సినిమా సీక్వెల్ ని ఎక్స్పెక్ట్ చేయొచ్చని గౌతమ్ మీనన్ వెల్లడించారు. దాంతో ఫ్యాన్స్ తెగ ఖుషి అయిపోతున్నారు. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, అసలు స్క్రిప్ట్ మొదలు పెట్టకుండానే ఘర్షణ సినిమా సెక్వల్ గురించి ప్రేక్షకులకు మాట ఇచ్చాడు గౌతమ్. అయితే త్వరలోనే స్క్రిప్ట్ రైటింగ్ స్టార్ట్ చేస్తారట. తాను డైరెక్ట్ చేసిన ‘శింభూ ది లైఫ్ ఆఫ్ మత్తు’ సినిమా ప్రమోషన్ కోసం హైదరాబాద్ వచ్చినప్పుడు ఈ విషయాలను గౌతమ్ వెల్లడించాడు.
చిరుతో కూడా ఘర్షణ లాంటి మూవీ ప్లాన్
అంతేకాకుండా కమలహాసన్ కెరీర్లో ది బెస్ట్ మూవీగా నిలిచిన ‘రాఘవన్’ సినిమాకి సెకండ్ పార్ట్ ని వచ్చే ఏడాది మొదలు పెడతారట. ఇదంతా పక్కన పెడితే మెగాస్టార్ చిరంజీవితో కూడా ఘర్షణ లాంటి సీరియస్ యాక్షన్ సినిమా తీయాలని అనుకుంటున్నట్లు గౌతమ్ చెప్తున్నారు. నిజానికి ప్రేక్షకులు కూడా అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!