Boyapati: తమిళ బిగ్ స్టార్ హీరోతో అవకాశం అందుకున్న బోయపాటి..??

Share

Boyapati: టాలీవుడ్ ఇండస్ట్రీలో మాస్ పల్స్ బాగా తెలిసిన స్పెషలిస్ట్ దర్శకుడిగా పేరొందిన వారు బోయపాటి శ్రీను. హీరో క్యారెక్టరైజేషన్ ఒక పద్ధతిగా ఉంటూ సరికొత్త రీతిలో స్క్రీన్ మీద ప్రజెంట్ చేస్తూ.. అనేక బ్లాక్ బస్టర్ విజయాలు బోయపాటి అందుకోవడం జరిగింది. అటువంటి బోయపాటి ప్రస్తుతం బాలకృష్ణతో అఖండ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ దాదాపు క్లైమాక్స్ కి చేరుకున్న నేపథ్యంలో.. బోయపాటి తర్వాత సినిమా గురించి రకరకాల వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. వస్తున్న వార్తల ప్రకారం మరోసారి ఐకాన్ స్టార్ బన్నీతో సినిమా చేయడానికి బోయపాటి రెడీ అయినట్లు ఇప్పటికే టాక్ నడుస్తోంది.

I am going to enter politics, says Tamil actor Vishal

ఈ సినిమా బన్నీ హోమ్ బ్యానర్ గీతా ఆర్ట్స్ నిర్మిస్తున్నట్లు కూడా వార్తలు వినబడుతున్నాయి. ఇదిలా ఉంటే తమిళ స్టార్ హీరో విశాల్ తో కూడా సినిమా చేయడానికి బోయపాటి రెడీ అయినట్లు సరికొత్త వార్త ఇప్పుడు వినబడుతోంది. ఈ సినిమాని సౌత్ ఇండియాలో ప్రధాన భాషల్లో రిలీజ్ చేయాలని.. అఖండ సినిమా షూటింగ్ అయిన వెంటనే విశాల్ తో బోయపాటి సినిమా చేసే ఛాన్స్ ఉన్నట్లు ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి.

Read More: Pushpa : పుష్ప తర్వాత బన్ని ఫిక్సైందా ఆ డైరెక్టర్‌కేనా..?

బన్నీ “పుష్ప” సెకండ్ పార్ట్ కోసం టైం పట్టే అవకాశం ఉండటంతో మధ్యలో విశాల్ ప్రాజెక్టు పూర్తి చేయాలని బోయపాటి డిసైడ్ అయినట్లు ఇప్పటికే విశాల్ స్క్రిప్ట్ విన్నట్లు అంతా ఓకే అయినట్లు వార్తలు వస్తున్నాయి. బాలీవుడ్ ఇండస్ట్రీ మొదలుకొని సౌత్ లో చాలా ఇండస్ట్రీలో టాప్ హీరోలు ఎక్కువగా టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన స్టార్ డైరెక్టర్లతో సినిమాలు చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో విశాల్ కి టాలీవుడ్లో మంచి మార్కెట్ ఉండటంతో.. బోయపాటితో సినిమా అనే వార్త ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీ లో సంచలనం రేపుతోంది. 


Share

Related posts

చైనాకు గూఢచారిగా వ్యవహరిస్తున్న జర్నలిస్టు ?

Special Bureau

Prabhas krishnam Raju : రాధేశ్యామ్ సెట్స్ నుంచి విడుదలైన ఫోటో… పండగ చేసుకుంటున్న ప్రభాస్ అభిమానులు..!

Teja

Disha Patani: నిన్న గాక మొన్న వచ్చి ట్రెండ్ సృష్టిస్తున్న దిశా పఠానీ

Varun G