NewsOrbit
న్యూస్

“తూర్పు”ను ఎరుపెక్కిస్తున్న దివీస్‌ ల్యాబ్స్!ముదిరిపోతున్న గొడవలు!క్షీణిస్తున్న శాంతిభద్రతలు!!

దివీస్‌ ల్యాబ్స్ గొడవ పెద్దదవుతోంది. రెండ్రోజులుగా జరుగుతున్న అల్లర్లు పీక్స్‌కు చేరాయి. స్థానిక కొత్తపాకాల గ్రామస్తులు దివిస్‌ నిర్మాణ ప్రాంతం దగ్గర ఆందోళనలు ఉదృతం చేశారు. దివిస్‌ నిర్మించిన ఓ గోడౌన్‌ను ధ్వంసం చేసి తగలబెట్టారు.

కొద్ది రోజులుగా దీక్ష చేస్తున్న రైతులు ఉద్యమకారులు ఒక్కసారిగా లోనికి చొచ్చుకొచ్చారు. ఫ్యాక్టరీ చుట్టూ ఉన్న ఫెన్సింగ్‌ను పీకి పారేశారు.ఫ్యాక్టరీలో ఉన్న కంటైనర్‌, జనరేటర్‌ను తగలబెట్టారు. నిర్మాణంలో ఉన్న గోడలను కూలగొట్టారు. దీంతో అక్కడ ఉద్రిక్తపరిస్థితులు నెలకొన్నాయి. అక్కడకు చేరుకున్న పోలీసులు గ్రామస్తులను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. పరిస్థితి చేయిదాటుతుందని భావించడంతో.. 50మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరిని వెంటనే విడుదల చేయాలని.. స్థానికులు అక్కడే బైఠాయించారు.తూర్పుతీరంలో దివీస్‌ లేబరేటరీస్‌ ల్యాబ్‌.. పొలిటికల్‌ గేమ్‌కు అద్దం పడుతోంది. కొత్త యూనిట్‌ ఏర్పాటుపై అధికార, టీడీపీల మధ్య మాటల యుద్ధానికి దారితీస్తోంది. అధికారంలో ఉన్నప్పుడు అనుమతిచ్చిన టీడీపీ ఇప్పుడు వ్యతిరేకిస్తోంది.

గతంలో ఎట్టి పరిస్థితుల్లో నిలిపివేస్తామన్న వైసీపీ అధికారంలోకి వచ్చాక మాట మార్చడంతో.. స్థానికులు తీవ్రంగా మండిపడుతున్నారు.ఈ ల్యాబ్‌ విషయంలో.. వైసీపీ, టీడీపీల తీరు అవకాశవాద రాజకీయాలను గుర్తు చేస్తోందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో దివిస్‌ ల్యాబ్‌ను ఒప్పుకునేది లేదని మత్స్యకారులు తెగేసి చెబుతున్నారు. ల్యాబ్ ఏర్పాటుతో మత్స్యకారులకు నష్టం ఏర్పడటంతో పాటు.. జీవనోపాధి దెబ్బతింటుందని నేతలు కూడా అంగీకరిస్తున్నారు. ఒకే పరిశ్రమపై టీడీపీ-వైసీపీలు భిన్నస్వరాలు వినిపిస్తుండటంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ ప్రాంతంపై అవకాశవాద రాజకీయాలకు దిగుతున్నాయని మండి పడుతున్నారు. తమ ప్రాంతంలో దివీస్ పరిశ్రమ నిర్మాణం వద్దంటూ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.

తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఈ ల్యాబ్స్ కి కాకినాడ సమీపంలోని తొండంగి గ్రామంలో ఆరు వందల ఎకరాల భూమిని ఇవ్వడం జరిగింది .ఐదు వందల కోట్ల రూపాయల పెట్టుబడితో అక్కడ లాబ్ పెట్టడానికి దివీస్ యాజమాన్యం ముందుకు వచ్చింది. అప్పటి నుంచి కూడా వివాదం నడుస్తోంది.ఈ మందుల పరిశ్రమ కారణంగా వాతావరణం కలుషితమైపోతుందని మత్స్యకారులకు ఉపాధి లేకుండా పోతుందని స్థానికులు ఆందోళనలు సాగిస్తున్నారు.అప్పట్లో వైసిపి ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా వారి ఆందోళనలకు మద్దతిచ్చి అరెస్ట్ అయిన దాఖలాలు కూడా ఉన్నాయి.అయితే అధికారంలోకి వచ్చాక ఈ పరిశ్రమ విషయంలో వైసిపి తీరు మారింది.అయితే వివాదం రోజురోజుకు ముదిరిపోతున నేపధ్యంలో జగన్ సర్కార్ తక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

 

author avatar
Yandamuri

Related posts

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju